MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున మూవీ సీన్ మొత్తం కాపీ కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్.. ఆ సినిమా ఏంటో తెలుసా

నాగార్జున మూవీ సీన్ మొత్తం కాపీ కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్.. ఆ సినిమా ఏంటో తెలుసా

అక్కినేని నాగార్జున 1988లో నటించిన ఒక చిత్రంలోని సన్నివేశాలని పాన్ ఇండియా డైరెక్టర్ ఒకరు కాపీ చేశారు. ఆయన రూపొందించిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 18 2025, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/ETV Cinema

కింగ్ నాగార్జున కెరీర్ లో లవ్ రొమాంటిక్ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నాగార్జున మహిళా ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆదరణ పొందారు. అభిమానులు ఆయన్ని మన్మథుడు అని పిలుస్తుంటారు. కెరీర్ బిగినింగ్ లో నాగార్జున కోడి రామకృష్ణ దర్శకత్వంలో మురళీ కృష్ణుడు అనే చిత్రంలో నటించారు. ఈ మూవీలో నటి రజనీ హీరోయిన్. గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి కీలక పాత్రల్లో నటించారు. 

25
Image Credit : Youtube/ETV Cinema

1998లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక లవ్ సీన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ రజనీ ఓ డ్రామా కంపెనీలో డ్యాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి తన అవసరాల కోసం, డ్రామా కంపెనీలో బిల్డప్ కోసం పెద్ద కంపెనీకి ఓనర్ అయిన మురళి కృష్ణ (నాగార్జున) తన లవర్ అని చెప్పుకుంటుంది.  తన పేరు వాడుకుంటోంది అని ఆమె గురించి నాగార్జునకి తెలుస్తుంది. 

తాను కూడా నాటకం ఆడి ఆమె గురించి తెలుసుకోవాలని నాగార్జున ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆమె ఆత్మాభిమానం గల మంచి అమ్మాయి అని నాగార్జునకి అర్థం అవుతుంది. దీనితో ఆమెతో ప్రేమలో పడతాడు. తానే మురళీకృష్ణ అని చెప్పకుండా సామాన్యుడిగా ఆమెతో ట్రావెల్ చేస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. 

Related Articles

Related image1
హరిహర వీరమల్లు మూవీకి నిధి అగర్వాల్ ఎందుకు ఓకె చెప్పిందో తెలుసా ? ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ అదే
Related image2
దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే
35
Image Credit : Sun NXT

ఇంతలో డ్రామా కంపెనీ ఓనర్ ఒక పార్టీ ఏర్పాటు చేసి దానికి మురళీ కృష్ణని అతిథిగా పిలవాలని హీరోయిన్ ని అడుగుతారు. దీనితో ఆమె చిక్కుల్లో పడుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా నాగార్జున ఒక ఐడియా చెబుతాడు. తానే పార్టీలో మురళీకృష్ణ లాగా నటిస్తానని, వాళ్ళని నమ్మిస్తానని చెబుతాడు. కంగారు పడుతూ హీరోయిన్ అందుకు అంగీకరిస్తుంది. పార్టీలో ఆ కంపెనీ ఓనర్.. కళల అభివృద్ధి కోసం నాగార్జునని డొనేషన్ అడుగుతారు. 

45
Image Credit : Prime Video

వెంటనే నాగార్జున రూ.2 లక్షల చెక్కు రాసి ఇస్తాడు. దీనితో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆరా తీస్తే అతడే నిజమైన మురళి కృష్ణ అని హీరోయిన్ కి తెలుస్తుంది. ఈ సీన్ ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. అవును ఇదే సన్నివేశాన్ని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గజినీ చిత్రంలో కాపీ కొట్టారు. మక్కీకి మక్కీ ఇలాంటి సన్నివేశమే గజినీ చిత్రంలో అసిన్, సూర్య మధ్య ఉంది. గజినీ మూవీ తెలుగు తమిళ భాషల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

55
Image Credit : Fancebook/Murugadoss

అదే చిత్రాన్ని మురుగదాస్ హిందీలో 2008లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. అప్పట్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. హిందీలో గజినీ 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ విధంగా గజినీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Recommended image2
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Related Stories
Recommended image1
హరిహర వీరమల్లు మూవీకి నిధి అగర్వాల్ ఎందుకు ఓకె చెప్పిందో తెలుసా ? ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ అదే
Recommended image2
దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved