MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా

మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా

అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు.ఆమె 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్ కి గురై ఇప్పుడు మిస్ వరల్డ్  కిరీటం గెలుచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

3 Min read
Author : Tirumala Dornala
Published : May 31 2025, 11:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గ్రాండ్ గా ముగిసిన మిస్ వరల్డ్ 2025
Image Credit : Instagram/Suchata Chuangsri

గ్రాండ్ గా ముగిసిన మిస్ వరల్డ్ 2025

హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. మిస్ వరల్డ్ ఫైనల్స్ శనివారం మే 31న చాలా గ్రాండ్ గా జరిగాయి. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు. 

మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఆమె మిస్ వరల్డ్ 2025 కిరీటం అందుకున్నారు. 21 ఏళ్ళ యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది. 

27
ట్రెండింగ్ గా మారిన ఓపల్ సుచాత
Image Credit : Instagram/ Suchata Chuangsri

ట్రెండింగ్ గా మారిన ఓపల్ సుచాత

ఓపల్ సుచాతా గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఆమె ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చింది ? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ? మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగింది ? లాంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోవచ్చు. 

Related Articles

Related image1
Miss World 2025 Winner ఓపల్‌ సుచాతకి దక్కే ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? బెనిఫిట్స్.. ఏకంగా రాయల్‌ లైఫ్‌
Related image2
ఇండియా ఆశలు గల్లంతు, మిస్ అయిన మిస్ వరల్డ్ రికార్డ్, నందిని గుప్తా ఓటమికి కారణాలేంటి?
37
ఓపల్ సుచాత బ్యాగ్రౌండ్, ఎడ్యుకేషన్ వివరాలు
Image Credit : Instagram/ Suchata Chuangsri

ఓపల్ సుచాత బ్యాగ్రౌండ్, ఎడ్యుకేషన్ వివరాలు

ఓపల్ సుచాత సెప్టెంబర్ 20, 2003లో జన్మించింది. ఆమె థాయిలాండ్ లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది. ఆమె తల్లిదండ్రులు థానెట్ డోంకామ్నెర్డ్, సుపాత్ర చువాంగ్స్రీ. ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు. 

ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్ లోనే సాగింది. ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్ లోని తమ్మాషాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండడం విశేషం. 

47
తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ
Image Credit : Instagram/ Suchata Chuangsri

తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ

ఓపల్ సుచాత 2021 నుంచి బ్యూటీ పేజెంట్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 2021లో ఆమె 'మిస్ రత్తనకోసిన్' పోటీల్లో పాల్గొంది. కానీ ఈ పోటీల్లో ఆమె ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందలేదు. ఆ మరుసటి ఏడాది 2022లో సుచాత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఈ పోటీల్లో సుచాత మూడవ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత తొలి రన్నరప్ తప్పుకోవడంతో సుచాతకి రెండవ రన్నరప్ గా అవకాశం దక్కింది. 

57
2024లో బలమైన ముద్ర
Image Credit : Instagram/ Suchata Chuangsri

2024లో బలమైన ముద్ర

2024లో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాతా బలమైన ముద్ర వేసింది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకి దక్కింది. ఛాన్స్ దక్కడమే కాదు.. మిస్ యూనివర్స్ పోటీల్లో మూడవ రన్నరప్ గా నిలిచింది. ఆయా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవలసి వచ్చింది. 

67
16 ఏళ్ళ వయసులో క్యాన్సర్
Image Credit : Instagram/ Suchata Chuangsri

16 ఏళ్ళ వయసులో క్యాన్సర్

ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ సుచాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఆమెకి 16 ఏళ్ళ వయసులో జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది. 16 ఏళ్ళ వయసులోనే సుచాత బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యారు. తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి, భయానికి గురైనట్లు సుచాత పేర్కొంది. దీనివల్ల నేను కన్న కలలన్నీ నాశనం అవుతాయని అనుకున్నా. ఆక్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు.. మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది. 

77
నా జీవితానికి అదే మలుపు
Image Credit : Instagram/ Suchata Chuangsri

నా జీవితానికి అదే మలుపు

నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ అంత అపాయకరమైనది కాదు. అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు. నాలో కలిగిన ఆ ఆందోళనే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అని సుచాత పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎదుర్కొనడానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా.  

అలాంటి మహిళల కోసమే 'ఓపల్ ఫర్ హర్' అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం, అవగాహన అవసరం అని నేను నమ్ముతా. వాళ్ళు ఒంటరిగా పోరాటం చేయకూడదు. తన ఓపల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలా మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. 

పాఠశాలల్లో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం, నిజ జీవిత కథల్ని పాడ్‌కాస్ట్‌ల ద్వారా పంచుకున్నాం, థాయిలాండ్‌లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం అని ఓపల్ పేర్కొంది.  ఓపల్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నందుకు ఆమెని అభినందిస్తున్న నెటిజన్లు.. ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని కూడా కొనియాడుతున్నారు. సుచాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శం అని అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Recommended image2
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image3
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Related Stories
Recommended image1
Miss World 2025 Winner ఓపల్‌ సుచాతకి దక్కే ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? బెనిఫిట్స్.. ఏకంగా రాయల్‌ లైఫ్‌
Recommended image2
ఇండియా ఆశలు గల్లంతు, మిస్ అయిన మిస్ వరల్డ్ రికార్డ్, నందిని గుప్తా ఓటమికి కారణాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved