- Home
- Entertainment
- `మిరపకాయ్`, `కుమారి 21ఎఫ్`, `ది 100`.. ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
`మిరపకాయ్`, `కుమారి 21ఎఫ్`, `ది 100`.. ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
జులై రెండో వారం(జులై 8-11) వరకు థియేటర్లలో, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.

జులై రెండో వారంలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
జులై సినిమాలకు, ఓటీటీలకు మరో డ్రై నెలగా మారింది. మొదటి వారంలో `తమ్ముడు` వచ్చి నిరాశపరిచింది. నాల్గో వారంలో పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` తప్ప మరే పెద్ద సినిమాలు లేవు. రెండో వారం, మూడో వారం మరింత డ్రైగా మారింది.
దీంతో చిన్న సినిమాలు, రీ రిలీజ్‌లకు టైమ్ కలిసి వచ్చింది. ఈ వారం(జులై 11)న థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం.
జులై 10న `కుమారి 21ఎఫ్` రీ రిలీజ్
ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో రీ రిలీజ్‌ల సందడి నడుస్తోంది. జులై 10న ఒకప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీగా సంచలనం సృష్టించిన `కుమారి 21ఎఫ్` మరోసారి విడుదల కాబోతుంది.
రాజ్ తరుణ్, హేబా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించారు.
2015 నవంబర్ 20న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది.
జులై 11న రవితేజ `మిరపకాయ్` రీ రిలీజ్
జులై 11న రవితేజ హీరోగా నటించిన `మిరపకాయ్` మూవీ రీ రిలీజ్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేత్ హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీ 2011 జనవరి 13న విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా ఆడింది. కానీ ఇందులోని మాస్ ఎలిమెంట్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
జులై 11న ఆర్కే సాగర్ `ది 100` థియేటర్ విడుదల
వీటితోపాటు మూడు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. అందులో టీవీ సీరియల్స్ తో పాపులర్ అయిన ఆర్కే సాగర్ నటించిన `ది 100` విడుదల కాబోతుంది.
సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన సందేశాత్మక చిత్రమిది. హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.
కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది.
జులై 11న థియేటర్లో సుహాస్ `ఓ భామ అయ్యో రామ` విడుదల
దీంతోపాటు సుహాస్ హీరోగా నటించిన `ఓ భామ అయ్యో రామ` చిత్రం కూడా జులై 11న థియేటర్లోకి రాబోతుంది. రామ్ గోదల దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించింది.
పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా హిట్ లేని సుహాస్‌కి ఇది విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే గత వారమే `ఉప్పుకప్పురంబు` చిత్రంతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చారు సుహాస్. ఇందులో కీర్తిసురేష్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
జులై 11న తమిళ డబ్బింగ్ చిత్రం `మై బేబీ` రిలీజ్
తమిళంలో మంచి ఆదరణ పొందిన `డీఎన్‌ఏ` చిత్రాన్ని తెలుగులో `మై బేబీ` పేరుతో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత సురేష్ కొడేటి. ఇది జులై 11న థియేటర్లో విడుదల కాబోతుంది.
నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అధర్వ మురళీ, నిమిషా సజయన్ జంటగా నటించారు.
2014లో ఒక సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా చేసుకుని క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు. తమిళంలో ఆకట్టుకున్న ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుందా అనేది చూడాలి.
జులై 8 నుంచి 11 వరకు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్‌లు
ఇక ఓటీటీలో ఈవారం పెద్దగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కనిపించడం లేదు. మలయాళంలో హిట్ అయిన `నరివేట్ట` మూవీ ఈ వారం ఓటీటీలోకి రాబోతుంది. సోనీ లివ్‌లో ఇది జులై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇందులో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి వారు నటించారు. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇది ఆలోచింపజేసే ఓ ఎంగేజింగ్ డ్రామా.
వీటితోపాటు జులై 11న నెట్ ఫ్లిక్స్ లో `ఆప్ జైసా కోయి` హిందీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్ స్టార్‌లో `మూన్ వాక్` అనే మలయాళ చిత్రం జులై 8న స్ట్రీమింగ్ కానుంది.
ఆహాలో ఫహద్ ఫాజిల్ నటించిన `ధూమం` మూవీ జులై 11నే స్ట్రీమింగ్ కానుంది.
ప్రైమ్ వీడియోలో జులై 9న `బల్లార్డ్` సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జులై 11న `స్పెషల్ ఓప్స్ సీజన్ 2`, `వన్ నైట్ ఇన్ ఇదాహో` స్ట్రీమింగ్ అవుతాయి.
నెట్ ఫ్లిక్స్ లో జర్మనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `బ్రిక్` జులై 10న, హాలీవుడ్ మూవీ `టూ మచ్` సైతం అదే రోజు స్ట్రీమింగ్ అవుతుంది.