- Home
- Entertainment
- చిరంజీవికి చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా 4 పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
చిరంజీవికి చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా 4 పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
చిరంజీవితో సినిమా అంటే ఎగిరిగంతేసేవారు హీరోయిన్లు. కెరీర్ కు ప్లాస్ అవుతుందని మురిసిపోయేవారు. అయితే మెగాస్టార్ తో హీరోయిన్ గా మాత్రమే కాకుండా తల్లిగా,చెల్లిగా, అక్కగా కూడా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తన 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. ఎంతో మంది హీరోయిన్లను స్టార్లను చేశారు. ఎంతోమందికి ఇండస్ట్రీలో కెరీర్ ను ఇచ్చారు. అయితే ముగ్గురు హీరోయిన్లతో మాత్రమే ఆయన ప్రయోగాత్మక పాత్రలు చేశారు. ఒక హీరోయిన్ అయితే చిరంజీవికి అక్కగా, చెల్లిగా, తల్లిగా భార్యగా నాలుగు పాత్రల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసా? ఆమె మరెవరో కాదు దివంగత నటి సుజాత.
మెగాస్టార్ చిరంజీవి తన 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. ఎంతో మంది హీరోయిన్లను స్టార్లను చేశారు. ఎంతోమందికి ఇండస్ట్రీలో కెరీర్ ను ఇచ్చారు. అయితే ముగ్గురు హీరోయిన్లతో మాత్రమే ఆయన ప్రయోగాత్మక పాత్రలు చేశారు. ఒక హీరోయిన్ అయితే చిరంజీవికి అక్కగా, చెల్లిగా, తల్లిగా భార్యగా నాలుగు పాత్రల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసా? ఆమె మరెవరో కాదు దివంగత నటి సుజాత.
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో భార్య పాత్రలో సుజాత
చిరంజీవి కెరీర్ లో స్టార్‌గా ఎదుగుతున్న కాలంలో సెకండ్ హీరోగా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. అందులో ‘ప్రేమ తరంగాలు’ సినిమా కూడా ఒకటి. ఎస్.పి. చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కృష్ణంరాజు నటించగా, చిరంజీవికి కీలకమైన పాత్ర దక్కింది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘ముఖద్దర్ కా సికందర్’కు రీమేక్. అందులో వినోద్ ఖన్నా పాత్రను చిరంజీవి పోషించగా, అమితాబ్ బచ్చన్ పాత్రను కృష్ణంరాజు చేశారు. ఈ సినిమాలో సుజాత, చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది. ఇది ఆమె చిరంజీవితో కలిసి నటించిన ఏకైక రొమాంటిక్ పాత్ర ఇది.
చిరంజీవి చెల్లెలుగా, అక్కగా సుజాత నటించిన సినిమాలు
చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఆయన హీరోగా సీతాదేవి అనే సినిమా వచ్చింది. ఈరంకి శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుజాత, చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించారు. 1982 లో రిలీజ్ అయిన సీతాదేవి సినిమ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి సుప్రీం హీరోగా స్టార్‌డమ్‌కు చేరిన తరువాత వచ్చిన మూవీ ‘అగ్ని గుండం. ఈసినిమాలో సుజాత చిరంజీవికి అక్క పాత్ర పోషించారు. ఈ సినిమా క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ చిత్రం పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సినిమా పరంగా అభిమానులను ఆకట్టుకుంది కాని, బాక్సాఫీస్ విజయంమాత్రం సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఇందులో సుజాత అక్కగా చేసిన పాత్ర ప్రత్యేక గుర్తింపు పొందింది.
చిరంజీవికి తల్లి పాత్రలో సుజాత నటించిన సినిమా
చిరంజీవి కెరీర్ లో మంచి మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు విజయ బాపినీడు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటించిన చివరి సినిమా బిగ్ బాస్. ఈ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రను సుజాత పోషించారు. అప్పటికే సుజాత హీరోయిన్ గా కెరీర్ ముగియడంతో క్యారెక్టర్ రోల్స్ వైపు టర్న్ అయ్యారు. కొన్ని తల్లిపాత్రలు కూడా చేశారు. దాంతో మెగాస్టార్ చిరంజీవి తల్లి పాత్ర కోసం విజయబాపినీడు సుజాతను తీసుకున్నారు. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. బాక్సాపీస్ దగ్గర ప్లాప్ గా మిగిలిపోయింది. కాని సుజాత పోషించిన తల్లి పాత్ర మాత్రం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఇలా సుజాత మాత్రమే స్టార్ హీరో అయిన చిరంజీవికి భార్యగా, ప్రియురాలిగా, చెల్లెలుగా, అక్కగా, తల్లిగా ఇన్ని రకాల పాత్రలు చేసిన నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. . టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి విభిన్న పాత్రల్లో నటిచినవారు లేరనేచెప్పాలి. 1970ల కాలం నుండి 2000ల మధ్య కాలంలో సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో రకాల పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందారు సుజాత. 58 ఏళ్ల వయస్సులోనే అనారోగ్యంతో 2011 లో సుజాత కన్నుమూశారు.
చిరంజీవి చెల్లిగా, భార్యగా నటించిన మరో ఇద్దరు హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సుజాత మాత్రమే కాదు మరో ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి చెల్లెలు, అక్క పాత్రలతో పాటు భార్యగా కూడా నటించి మెప్పించారు. ఆ హీరోయిన్లు మరెవరో కాదు కుష్బు, నయనతార. అవును కుష్బు చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో ఆయన కు అక్కగా నటించింది. కాని మెగాస్టార్ తో హీరోయిన్ గా ఏ సినిమా చేయనప్పటికి.. ఒ రియల్ ఎస్టేట్ యాడ్ లో మాత్రం కుష్బు మెగాస్టార్ కు భార్యగా నటించింది.
ఇక నయనతార కూడా చిరంజీవికి చెల్లెలుగా, భార్యగా , ప్రియురాలిగా నటించి మెప్పించింది. చిరంజీవ హీరోగా వచ్చిన మలయాళ రీమక్ మూవీ గాడ్ ఫాదర్ లో ఆయన చెల్లెలి పాత్రలో నయనతార నటించారు. ఈసినిమా మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా రూపొందింది.
ఇక అంతకు ముందు సైరా సినిమాలో చిరంజీవి భార్యగా నయనతార నటించి మెప్పించారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా మెగాస్టార్ కెరీర్ లో సుజాత, నయనతార, కుష్బు ఈముగ్గరు డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించారని చెప్పవచ్చు.