చిరంజీవి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? , మెగాస్టార్ మనసు దోచిన అమ్మాయి ఎక్కడుంది ?
ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఎంతో మంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన మెగాస్టార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? ఆయన మొదటిసారిగా ఎప్పుడు ప్రేమలో పడ్డారు.

చిరంజీవి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలు పడి, తన టాలెంట్ అంతా చూపించి, స్టార్ హీరోగా ఎదిగాడు. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్, డైలాగ్ టైమింగ్ ఇలా అన్ని విషయాలలో తనను తాను నిరూపించుకున్నాడు.
అందుకే చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. అంతే కాదు తెలుగు సినీపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారాడు. ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కుటుంబం నుంచి అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంతే కాదు ముగ్గరు పాన్ ఇండియా హీరోలు కూడా మెగా ప్యామిలీలో ఉన్నారు.
దాదాపు 70 ఏళ్లు వచ్చినా మెగాస్టార్ లో మాత్రం ఏమాత్రం జోరు తగ్గలేదు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఫిట్ నెస్ , డాన్స్ విషయంలో తగ్గేది లేదంటున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో మెగా పవర్ చూపిస్తున్నారు చిరంజీవి. ఇక చిరంజీవికి సబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కామన్ గా జరుగుతుంది. మెగాస్టార్ కూడా పలు సందర్భాల్లో తన గురించి తానే చెప్పుకున్న విషయాలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి.
ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన లైఫ్ లో ఫస్ట్ లవ్ ఎక్స్ పీరియన్స్ ను ఎప్పుడు చేశారు.? ఆయన ఫస్ట్ లవ్ ఎవరు? ఈ విషయాలను స్వయంగా చిరంజీవి ఓ సందర్బంలో వెల్లడించారు. ఓ సినిమా ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ చిరంజీవిని ఈ ప్రశ్న అడిగారు. మీ ఫస్ట్ లవ్ ఎవరు అని. అప్పుడు చిరంజీవి మోహమాటంగానే అసలు విషయం వెల్లడించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. నేను పేరు చెప్పను కాని, 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమించాను. ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండిపోయేవాడిని. అప్పట్లోనే ఆమె సైకిల్ తొక్కుతూ మా వీధిలోకి వచ్చేది. నాకు పెద్దగా సైకిల్ తొక్కడం రాదు. ఆమె నాకు సైకిల్ తొక్కడం పూర్తిగా నేర్పించింది. ఆమె సైకిల్ తొక్కుతుంటే నేను ఆమెనే చూసేవాడిని.. తను మాత్రం నన్ను ముందుకు చూడు అని చెప్పేది. అలా అప్పుడు ఆమెను మొదటి సారిగా ప్రేమించాను అని మెగాస్టార్ చిరంజీవి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. ఇక యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లాడి డైరెక్షన్ లో చేసిన విశ్వంభర సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. కానీ రిలీజ్ డేట్ మాత్రం మూవీ టీమ్ వెల్లడించలేదు.
ఇప్పటికే ఈసినిమా రిలీజ్ రెండు సార్లు పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. మరి విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో మాత్రం నయనతార చిరంజీవికి జంటగా నటిస్తోంది. విశ్వంభరలో త్రిష మెగాస్టార్ కు జోడీగా నటించింది.