MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, విజయకాంత్ హీరోలుగా మూవీ, ఇది కదా కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ దద్దరిల్లే కాంబోలో ఎలా మిస్సయిందబ్బా ?

చిరంజీవి, విజయకాంత్ హీరోలుగా మూవీ, ఇది కదా కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ దద్దరిల్లే కాంబోలో ఎలా మిస్సయిందబ్బా ?

మెగాస్టార్ చిరంజీవి, కెప్టెన్ విజయకాంత్ ఇద్దరూ మాస్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోలు. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది.. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ రావాల్సిన ఒక చిత్రం మిస్ అయింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 03 2025, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుగులేని హీరోగా చిరంజీవి
Image Credit : IMDB

తిరుగులేని హీరోగా చిరంజీవి

80వ దశకంలో చిరంజీవి కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. వరుస చిత్రాలతో చిరంజీవి తిరుగులేని హీరోగా టాలీవుడ్ లో అవతరించారు. ఆ టైంలో చిరంజీవి కృష్ణ, కృష్ణంరాజు లాంటి హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు కూడా చేశారు. ఆ టైంలో బాక్సాఫీస్ దద్దరిల్లే మల్టీస్టారర్ కాంబినేషన్ కి రంగం సిద్ధం అయింది. కానీ ఊహించని విధంగా ఆ చిత్రం ముందుకు సాగలేదు. 

DID YOU
KNOW
?
చిరంజీవి మూవీలో రాజశేఖర్
చిరంజీవి స్నేహం కోసం చిత్రంలో రాజశేఖర్ నటించాల్సింది. చిరంజీవి స్నేహితుడి పాత్రలో రాజశేఖర్ నటించాలి. కానీ రాజశేఖర్ ఏజ్ సరిపోదని చిరంజీవి వద్దన్నారట.
25
చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్
Image Credit : Facebook / Megastar Chiranjeevi

చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్

1981లో నిర్మాత బాబురావు అగ్నిజ్వాల అనే చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అప్పటికే ఆయన నిర్మాతగా రెండు చిత్రాలు నిర్మించారు. మూడవ చిత్రం సూపర్ స్టార్ కృష్ణతో తీయాలనేది ఆయన కోరిక. కృష్ణతో ఈ విషయం చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కథ రెడీ చేసుకోమన్నారు. దీనితో బాబురావు పరుచూరి బ్రదర్స్ తో అగ్నిజ్వాల అనే కథ రాయించారు. ఇది మల్టీస్టారర్ కథ. దీనితో ఈ మూవీలో మరో హీరో కూడా నటించాలి. ఈ మరో హీరోగా చిరంజీవిని అనుకున్నారు. 

Related Articles

Related image1
ఒకరు రోజుకి రూ.1 కోటి, ఇంకొకరు రోజుకి రూ.10 కోట్లు.. సల్మాన్ నుంచి నాగ్ వరకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్
Related image2
తెలుగులో 1300 కోట్ల బడ్జెట్ చిత్రాలు.. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి లకు ప్రేక్షకుల నుంచి దిమ్మ తిరిగే దెబ్బ
35
వాయిదా పడ్డ అగ్నిజ్వాల
Image Credit : Facebook / Megastar Chiranjeevi

వాయిదా పడ్డ అగ్నిజ్వాల

ఓ అక్క, ఇద్దరు తమ్ముళ్ల సెంటిమెంట్ తో సాగే కథ ఇది. కృష్ణ, చిరంజీవి అన్నదమ్ములుగా నటించాలి. కానీ ఆ టైంకి చిరంజీవి డేట్లు దొరకలేదు. కృష్ణతో నటించాలనే ఆసక్తి చిరంజీవికి ఉన్నప్పటికీ డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోయారు. అదే సమయంలో కృష్ణకి 'అసాధ్య అలియా' అనే కన్నడ చిత్రం బాగా నచ్చింది. అగ్నిజ్వాల కంటే ఈ మూవీ ఇంకా బావుంటుందని కృష్ణ అన్నారు. దీనితో రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాత బాబురావు.. ఈ చిత్రాన్ని మాయదారి అల్లుడు పేరుతో రీమేక్ చేశారు. ఆ విధంగా అగ్నిజ్వాల చిత్రం అటకెక్కింది. 

45
చిరంజీవి, విజయకాంత్ కాంబినేషన్
Image Credit : Facebook

చిరంజీవి, విజయకాంత్ కాంబినేషన్

కానీ ఆ చిత్రాన్ని ఎప్పటికైనా కంప్లీట్ చేయాలని బాబురావు అనుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఈ మూవీపై కృష్ణ అంతగా ఆసక్తి చూపలేదు. దీనితో పరుచూరి బ్రదర్స్ చిరంజీవి, విజయకాంత్ కాంబినేషన్ అయితే ఈ చిత్రానికి పర్ఫెక్ట్ గా ఉంటుందని నిర్మాత బాబురావుకి సలహా ఇచ్చారు. దీనితో బాబురావు చిరంజీవి, విజయకాంత్ డేట్ల కోసం ప్రయత్నించారు. విజయకాంత్ తమిళంలో బిజీ, చిరంజీవి తెలుగులో బిజీ.. వీళ్లిద్దరి డేట్లు ఒకేసారి కుదిరేలా చేయడం బాబురావుకి సాధ్యం కాలేదు. 

55
బాక్సాఫీస్ దద్దరిల్లేది
Image Credit : India Today

బాక్సాఫీస్ దద్దరిల్లేది

దీనితో చేసేది లేక ఆ చిత్రాన్ని మోహన్ బాబు, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కించారు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఒక వేళ ఆ చిత్రంలో చిరంజీవి- కృష్ణ లేదా చిరంజీవి- విజయకాంత్ కాంబినేషన్ కనుక సెట్ అయి ఉంటే బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం సాధించేది అని అప్పట్లో అంతా అభిప్రాయ పడ్డారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని
మంచు మోహన్ బాబు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
దళపతి విజయ్ కీలక నిర్ణయం, జన నాయగన్ టీమ్ బ్యాక్ స్టెప్, సెన్సార్ బోర్డ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Recommended image2
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image3
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Related Stories
Recommended image1
ఒకరు రోజుకి రూ.1 కోటి, ఇంకొకరు రోజుకి రూ.10 కోట్లు.. సల్మాన్ నుంచి నాగ్ వరకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్
Recommended image2
తెలుగులో 1300 కోట్ల బడ్జెట్ చిత్రాలు.. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి లకు ప్రేక్షకుల నుంచి దిమ్మ తిరిగే దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved