- Home
- Entertainment
- నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మోహన్ బాబు బర్త్ డే విషెస్ చెబుతూ మంచు మనోజ్ సంచలన పోస్ట్
నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మోహన్ బాబు బర్త్ డే విషెస్ చెబుతూ మంచు మనోజ్ సంచలన పోస్ట్
మంచు మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ గొడవలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే మోహన్‌బాబు బర్త్ డే సందర్భంగా మనోజ్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

manchu manoj, mohanbabu
మంచు ఫ్యామిలీలో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్‌కి.. తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణులకు మధ్య ఈ గొడవలు అవుతున్నాయి.
మోహన్‌బాబు యూనివర్సిటీ, స్కూల్స్ లో అవకతవకలు జరిగాయంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనే తండ్రి మోహన్‌బాబు, మంచు విష్ణులతో గొడవ పడుతున్నాడు. ఇంటి గొడవలు బజారున పడే స్థాయికి వెళ్లాయి.
manchu manoj, mohanbabu, manchu vishnu
తరచూ ఈ విషయాలపై మనోజ్ తన గళం ఎత్తుతున్నాడు. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు. యూనివర్సిటీ, స్కూల్స్ లోకి ఆయన్ని అనుమతించడం లేదు. బయట ఉన్న హాస్టల్స్ పిల్లలను వేధిస్తున్నారని, భయపెడుతున్నారని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మనోజ్ ఆరోపిస్తున్నాడు.
మొన్నటి వరకు ఈ విషయంలోనే హడావుడి చేశాడు మనోజ్. ఇటీవల ఈ వివాదం కాస్త సర్దుమనిగినట్టు అనిపిస్తుంది. మనోజ్ సైలెంట్‌గా ఉండటం దీనికి కారణమని చెప్పొచ్చు.
manchu manoj, mohanbabu
నాన్న, అన్నలకు దూరంగా ఉంటున్న మనోజ్ తాజాగా తండ్రిని ఉద్దేశించి సంచలన పోస్ట్ పెట్టాడు. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా నాన్న పక్కన లేనందుకు చాలా బాధగా ఉందంటూ కామెంట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది.
ఇందులో మనోజ్ చెబుతూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకల రోజున నీ పక్కన లేనందుకు చాలా మిస్ అవుతున్నా. నీ చుట్టూ ఉండటానికి ఆతృతగా ఉన్నా నాన్నా. అన్నిరకాలుగా నిన్ను ప్రేమిస్తున్నా` అని తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భం చిన్ననాటి ఫోటో ఒకటి పంచుకున్నారు మనోజ్.
అంతేకాదు నాన్న మీద వచ్చే సాంగ్‌ని జోడించి మోహన్‌బాబు సినిమాలోని సీన్లతో వీడియోచేశాడు. ఇది ఆద్యంతం ఎమోషనల్‌గా ఉంది. హృదయాన్ని బరువెక్కించేలా ఉంది. తండ్రి మోహన్‌బాబుపై తనకున్న ప్రేమకిది నిదర్శనంగా నిలుస్తుంది.
దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది మంచు ఫ్యామిలీలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
manchu manoj, manchu vishnu
నిజానికి మోహన్ బాబుపై మనోజ్‌కి కోపం లేదు. కానీ మంచు విష్ణు విషయంలోనే ఆయన ఆవేదన అని తెలుస్తుంది. యూనివర్సిటీ, స్కూల్స్ విషయంలో తనని ఇన్‌వాల్వ్ కానివ్వడం లేదని, తనకు ఇవ్వడానికి(ఆస్తులు) వాళ్లు సిద్ధంగా లేదని, ఆస్తుల విషయంలోనే మనోజ్ గొడవ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
manchu vishnu
మనోజ్.. మౌనికా రెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం మోహన్‌బాబు, విష్ణులకు ఇష్టం లేదని, దీని కారణంగానే ఆయన్ని దూరం పెడుతున్నారనే మరో వాదన వినిపిస్తుంది. ఏది నిజమనేది వాళ్లకే తెలియాలి. కానీ మంచు గొడవలు మాత్రం గత కొంత కాలంగా ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అవుతున్నాయి. మరి దీనికి మంచు మనోజ్ ట్వీట్ ఫుల్ స్టాప్ పెడుతుందా? అనేది చూడాలి.
read more: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?, కట్ చేస్తే తన సినిమాలోనే సైడ్ రోల్
also read: రాజశేఖర్, సుమన్ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్ హీరో, స్ట్రాంగ్ వార్నింగ్.. చివరికి ఇద్దరికీ ఝలక్