- Home
- Entertainment
- అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ స్పెషల్ అట్రాక్షన్.. సూపర్ స్టార్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలుసా ?
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ స్పెషల్ అట్రాక్షన్.. సూపర్ స్టార్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలుసా ?
అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ వెడ్డింగ్ రిసెప్షన్ కి మహేష్ బాబు ఫ్యామిలీతో హాజరయ్యారు.

సినీ ప్రముఖుల సందడితో అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్
అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. రిసెప్షన్ వేడుకకు మహేశ్ బాబు, రామ్ చరణ్, సూర్య, యష్, నాని, అల్లు అరవింద్, ప్రశాంత్ నీల్, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు, సుకుమార్ తదితరులు హాజరయ్యారు.
ఫ్యామిలీతో హాజరైన మహేష్ బాబు
అయితే ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు తన హ్యాండ్సమ్ లుక్ తో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఫ్యామిలీతో కలసి మహేష్ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే సింపుల్ గానూ స్టైలిష్‌గా కనిపించిన మహేశ్ బాబు, ఒక ఫ్లోరల్ స్వెట్‌షర్ట్‌లో హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. మొదట దాన్ని ఓ సాధారణ డిజైన్‌గానే ఫ్యాన్స్ భావించినా, ఆ తర్వాత దాని బ్రాండ్, ధర గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.
మహేష్ ధరించిన స్వెట్‌షర్ట్ ధర ఎంతో తెలుసా ?
ఆ స్వెట్‌షర్ట్ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హెర్మెస్‌కి చెందినదిగా వెల్లడైంది. దీని ధర అమెరికాలో $1,775 (భారత కరెన్సీలో సుమారుగా రూ.1.5 లక్షలు). దీనితో మహేష్ బాబు ధరించిన ఆ స్వెట్‌షర్ట్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ మొదలైంది. మహేశ్ బాబు ఎంత సింపుల్‌గా కనిపించినా, ఆయన స్టైల్‌లోని క్లాస్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
SSMB 29 కోసం వెయిటింగ్
మహేశ్ బాబు లుక్ చూసి SSMB29పై అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిసెప్షన్‌లో మహేశ్ హాజరైన తీరు, ఆయన డ్రెస్ సెలెక్షన్ మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రాజకీయ ప్రముఖులు
ఇక అఖిల్-జైనబ్ రిసెప్షన్ వేడుక వైభవంగా జరిగింది. టాలీవుడ్ సెలెబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను గ్రాండ్‌గా మార్చారు. నాగార్జున ప్రతి ఒక్క అతిథిని రిసీవ్ చేసుకుని స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు.