MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో మిస్ అయిన సినిమాను మరో హీరో చేయడం సహజంగా జరుతూనే ఉంటుంది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం అయ్యే చేసుంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్ వస్తుంది.డిజాస్టర్ అయితే ఆ సినిమా చేయకపోవడమే మంచిదయ్యింది అనిపిస్తుంది.  ఇక ఈక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ అయిన ఓ సినిమాను మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? మహేష్ బాబు ఎందుకు మిస్ అయ్యాడు?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Ramcharan, mahesh

Ramcharan, mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో డిపరెంట్ షేడ్స్ చూపించాడు. రాజకుమారుడు, యువరాజు, మురారి.. ఈ సినిమాల వరకూ మహేష్ బాబు ఒకరకంగా కనిపిస్తాడు.. ఆతరువాత ఒక్కడు, అర్జున్, లాంటి సినిమాల్లో మరో కోణం కనిపిస్తుంది. ఇక పోకిరి తరువాత మహేష్ బాబు లైఫ్ మారిపోయింది.

కెరీర్ స్పీడ్ అందుకుంది.  టాలీవుడ్ లో స్టార్ హీరోగా.. సూపర్ స్టార్ గా మహేష్ బాబును పోకిరి సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మహేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. డిజాస్టర్ సినిమాలు కూడా లేకపోలేదు.

అంతే కాదు కొన్నిసినిమాలు మిస్అయ్యాడు కూడా. అలా మిస్ అయిన సినిమాల్లో ఓ సినిమాను మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు ఇంతకీ ఆసినిమా ఏదో తెలుసా. 
 

23

ఆమూవీ ఏదో కాదు ఎవడు. అవును ఈసినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడట డైరెక్టర్ వంశీ పైడిపల్లి.  మహేష్ బాబుతో వంశీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మహర్షిలాంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. అయితే ఎవడు సినిమాను కూడా మహేష్ తో చేయాలి అనుకున్నాడట వంశీ. అయితే ఆ టైమ్ లో మహేష్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో రెండేళ్ళు ఆగమన్నాడట. అంతే కాదు ఈసినిమాలో అల్లు అర్జున్ చేసిన గెస్ట్ రోల్ కోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలి అని అడిగాడట. కాని తారక్ కూడా  అప్పుడు ఏదో కారణంతో ఈసినిమాను రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు ప్లేస్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లు అర్జున్ వచ్చి చేరారు.  
 

33

ఇలా మహేష్ బాబు మిస్ అయిన సినిమాను రామ్ చరణ్ చేసి సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు, పాన్ వరల్డ్ మూవీగా  తెరకెక్కతున్న ఈసినిమా షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. 2027 లో ఈసినిమాన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈమూవీ హిట్ అయితే మహేష్ బాబు ఇమేజ్ ఎక్కడికెళ్తుందో చెప్పడం కష్టం. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు. ఈమూవీతో మరోసారి సాలిడ్ సక్సెస్ ను కోరుకుంటున్నాడు చరణ్. పెద్ది తరువాత సుకుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
మహేష్ బాబు ఘట్టమనేని
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image2
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image3
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved