MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..

కృష్ణ కి ఇచ్చిన మాట తప్పిన శోభన్ బాబు, సూపర్ స్టార్ చేసిన పనితో సోగ్గాడికి షాక్..

సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న శోభన్ బాబును.. ఆదుకోవాలని కృష్ణ ముందుకు వస్తే.. శోభన్ బాబు ఏం చేశాడో తెలుసా? సోగ్గాడు చేసిన పనికి కృష్ణ ఎలా సమాధానం చెప్పాడు. అందులో అక్కినేని పాత్ర ఏంటి? అసలు విషయం ఏంటంటే?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 01 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్ హీరోల మధ్య విభేదాలు..
Image Credit : facebook.com/ghattamanenisuperstar

స్టార్ హీరోల మధ్య విభేదాలు..

ఆ కాలంలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు.. ఎంత కలిసి మెలిసి ఉండేవారో.. వారి మధ్య విభేదాలు కూడా అదే రేంజ్ లో కనిపించేవి. సినిమాల విషయంలో పోటీ పడుతూనే.. మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి సినిమాలు చేశారు.. ఈ ఇద్దరి స్టార్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ హీరోల తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు మధ్య కూడా ఇలాంటి సందర్భాలే రిపిట్ అయ్యాయి. ఈక్రమంలో శోభన్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

26
కృష్ణ కంటే శోభన్ బాబు సీనియర్
Image Credit : Asianet News

కృష్ణ కంటే శోభన్ బాబు సీనియర్

సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న శోభన్ బాబును ఆదుకోవాలని ముందుకు వచ్చారు కృష్ణ. కానీ శోభన్ బాబు మాత్రం సూపర్ స్టార్ కు హ్యాండ్ ఇచ్చారు. అదే టైమ్ లో కృష్ణ చేసిన పనికి శోభన్ బాబు షాక్ అయ్యారట. కృష్ణ కంటే ఇండస్ట్రీలో శోభన్ బాబు కాస్త సీనియర్.. దాంతో ఆ గౌవరం ఎప్పుడూ ఇస్తూ ఉండేవారు కృష్ణ. 

ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసినా.. కృష్ణ మాత్రం ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను శోభన్ బాబుకే ఇవ్వండని మేకర్స్ కు చెప్పేవారట. ఈ విషయాలు కూడా కృష్ణ కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. కానీ శోభన్ బాబు మాత్రం ఓసారి కృష్ణ నమ్మకాన్ని పోగోట్టుకున్నారట. సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న శోభన్ బాబుకు సాయం చేయడానికి వస్తే.. ఆయన ఏం చేశారంటే?

Related Articles

Related image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Related image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
36
శోభాన్ బాబును ఆదుకోడానికి కృష్ణ ప్రయత్నం..
Image Credit : Asianet News

శోభాన్ బాబును ఆదుకోడానికి కృష్ణ ప్రయత్నం..

ఓ పాత ఇంటర్వ్యూలో కృష్ణ.. శోభన్ బాబు గురించి మాట్లాడుతూ.. '' ఒక సారి శోభన్ బాబు బాగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. నిర్మాతలు సినిమా చేయడానికి కూడా ముందుకు రావడంలేదు. అదే టైమ్ లో నా దగ్గరకు మేనేజర్ తో కబురు పంపించాడు. నాకు ప్రొడ్యూసర్లు రావడం లేదు.. ఫెయిల్యూర్ లో ఉన్నాను... విజయ్ కృష్ణ, పద్మాలయ కాంబినేషన్ లో సినిమా చేస్తే బాగుంటుంది అని కబురు పెట్టారు. అప్పుడు నేనే స్వయంగా శోభన్ బాబు ఇంటికి వెళ్లాను. సినిమా చేద్దాం.. విజయ్ కృష్ణ ప్రొడక్షన్ లో.. విజయ నిర్మల డైరెక్ట్ చేస్తుంది అని 25 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చాను. '' అని కృష్ణ అన్నారు.

46
కృష్ణకు హ్యాండ్ ఇచ్చిన శోభన్ బాబు..
Image Credit : suresh productions

కృష్ణకు హ్యాండ్ ఇచ్చిన శోభన్ బాబు..

కృష్ణ మాట్లాడుతూ.. ''సరిగ్గా అప్పుడే శోభన్ బాబు మల్లెపూవ్వు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పుడు నేను మద్రాస్ నుంచి హైదరాబాద్ మార్నింగ్ ప్లైట్ కు బయలుదేరుతూ.. విజయ నిర్మలతో అన్నాను.. మల్లెపువ్వు హిట్ అయ్యింది.. ఇక శోభన్ బాబు మన సినిమా చేయడేమో అని. ఆమాట చెప్పి నేను హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను.. గెస్ట్ హౌస్ కు వెళ్లే సరికి విజయ నిర్మల నుంచి ఫోన్ వచ్చింది.. 

శోభన్ బాబు మన సినిమా చేయను అన్నాడు. కథలో మార్పుల కోసం పంపిస్తే.. ఆ కథ నాకు నచ్చలేదు.. నేను చేయడంలేదు.. ఈ అడ్వాన్స్ కృష్ణగారికి ఇచ్చేయండి అని డబ్బలు వెనక్కి పంపించాడు. నేను నిర్మలతో అన్నాను.. అతనికంటే పెద్ద హీరోతో ఈ సినిమా చేద్దాం.. సాయంత్రానికి ఏదో ఒకటి తేల్చేద్దాం అని నేను వెంటనే నాగేశ్వరావు దగ్గరకు వెళ్లాను. అని కృష్ణ అన్నారు.

56
నాగేశ్వరరావు తో విభేదాలు పక్కన పెట్టి..
Image Credit : Facbook / Superstar Krishna

నాగేశ్వరరావు తో విభేదాలు పక్కన పెట్టి..

అప్పటికే నాగేశ్వరరావుతో కృష్ణకు దేవదాసు సినిమా వివాదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. అయినా సరే కృష్ణ రావడంతో.. ఆశ్చర్యపోయిన అక్కినేని.. ఏమిటోయ్ ఇలా వచ్చావ్ అని అడిగాడట. దానికి కృష్ణ సమాధానం చెపుతూ.. '' ఏం లేదు.. మీతో సినిమా చేద్దాం అని వచ్చాను.. నాతో నువ్వు సినిమా చేస్తా.. సరే మన పాత గొడవలు మర్చిపోయి.. ఫ్రెండ్లీగా, జ్యోవియల్ గా , హ్యాపీగా మాట్లాడుకుందాం.. దీనికి ఒకే అంటే.. నేను యాక్ట్ చేస్తాను.. కానీ కథ నాకు నచ్చాలి అని అక్కినేని అన్నారు. 

అప్పుడు నేను శోభన్ బాబుతో చేయాలి అనుకున్న కథను క్యాన్సిల్ చేసి.. హిందీలో అమితాబ్ చేసిన డాన్ సినిమా కథను మార్పించి.. నా పాత్ర, విజయ నిర్మాల పాత్ర యాడ్ చేసి.. హేమా హేమిలు సినిమా చేశాం. కథ ఆయనకు నచ్చింది. సినిమా కోసం బాగా కోఆపరేట్ చేశారు కూడా'' కృష్ణ అన్నారు.

66
కృష్ణ దెబ్బకు షాక్ అయిన శోభన్ బాబు..
Image Credit : Asianet News

కృష్ణ దెబ్బకు షాక్ అయిన శోభన్ బాబు..

కృష్ణ తో సినిమాను క్యాన్సల్ చేసిన వారం రోజుల్లోనే అక్కినేనితో ఆయన సెట్స్ మీదకు వెళ్లడంతో.. శోభన్ బాబు షాక్ అయ్యారు. అదేంటి ఇంత త్వరగా నాగేశ్వరరావు గారు ఒప్పుకోవడం సినిమా స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయిందిగా అంటూ శోభన్ బాబు షాక్ అయ్యారట. అంతే కాదు నిర్మాత రామానాయుడు కూడా ఈ విషయం నమ్మలేకపోయారు. కారంచేడులో ఉన్న ఆయన పేపర్ లో విషయం చూసి.. నిజంగా ఇది నమ్మలేకపోతున్నా అని అన్నారట. ఇలా కృష్ణ శోభన్ బాబుకు సాయం చేద్దాం మని వెళ్తే.. ఆయన చేసిన పని వల్ల.. అక్కినేనితో హేమా హేమీలు మూవీ చేయాల్సి వచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్, పవన్, రాంచరణ్ అస్సలు మరచిపోలేని హీరోయిన్లు వీళ్ళే.. పెళ్లయ్యాక అడ్రెస్ లేకుండా పోయారు
Recommended image2
సెలబ్రిటీ బాడీగార్డ్‌ల జీతం కోట్లలో ఉంటుందా? షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ చెప్పిన అసలు నిజం..
Recommended image3
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Recommended image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved