MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే

ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే

చిరంజీవితో ఓ అగ్ర దర్శకుడికి విభేదాలు వచ్చాయట. దీనితో ఆ దర్శకుడు చిరంజీవితో సినిమాలు తగ్గించి బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు అనే ప్రచారం ఉంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి కెరీర్
Image Credit : Face book/ KChiranjeeviFans, Nandamuri Balakrishna

చిరంజీవి కెరీర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లో రీజినల్ సినిమాల్లో హైయెస్ట్ షేర్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిరంజీవి గత సినిమాలు, కెరీర్ విశేషాలు గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి తన కెరీర్ లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులతో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలో కూడా అనేక చిత్రాల్లో నటించారు. 

25
కోడి రామకృష్ణ తొలి చిత్రం
Image Credit : Youtube/Aditya Music

కోడి రామకృష్ణ తొలి చిత్రం

కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయింది చిరంజీవి సినిమాతోనే. కోడి రామకృష్ణ తొలి చితం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో కోడి రామకృష్ణ.. రాఘవేంద్ర రావు, దాసరి, కోదండ రామిరెడ్డి లాంటి అగ్ర దర్శకులకు పోటీగా సినిమాలు చేసేవారు. 

Related Articles

Related image1
మన శంకర వరప్రసాద్ గారు మూవీపై కొరటాల శివ ఫస్ట్ రియాక్షన్..హిట్ టాక్ రాగానే ఆచార్య డైరెక్టర్ ఏమన్నారంటే
Related image2
Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
35
అందుకే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

అందుకే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు

చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేశారు. కానీ మధ్యలో చిరంజీవికి, కోడి రామకృష్ణకి మధ్య విభేదాలు తలెత్తాయట. దీనితో కోడి రామకృష్ణ చిరంజీవితో సినిమాలు తగ్గించి బాలకృష్ణతో చేయడం ప్రారంభించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు లాంటి సినిమాలు బాలకృష్ణకి తిరుగులేని విజయాలు అందించాయి. 

45
అది నిజమే అంటూ కామెంట్స్
Image Credit : Asianet News

అది నిజమే అంటూ కామెంట్స్

చిరంజీవితో విభేదాలు రావడం వల్లే.. కోడి రామకృష్ణ ఆ సినిమాలని బాలయ్యతో చేశారు అనే ప్రచారం ఉంది. దీనిపై కోడి రామకృష్ణ శిష్యుడు ప్రముఖ దర్శకుడు దేవీ ప్రసాద్ స్పందించారు. ఒక దశలో కోడి రామకృష్ణ గారు చిరంజీవితో సినిమాలు తగ్గించిన మాట వాస్తవమే. మేము కూడా అనుకునేవాళ్లం. చిరంజీవితో గురువుగారు ఒక సినిమా చేస్తే బావుంటుంది.. చాలా గ్యాప్ వచ్చింది అని అనుకునేవాళ్లం. 

55
వ్యక్తిగత గొడవలు లేవు
Image Credit : Chiranjeevi\Twitter

వ్యక్తిగత గొడవలు లేవు

కానీ వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా మాత్రమే ఎలాంటి విభేదాలు లేవు అనేది తన అభిప్రాయం అని దేవి ప్రసాద్ అన్నారు. వాళ్లిద్దరూ ఎక్కడ కలిసినా చాలా సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించేవాళ్ళు. వాళ్ళ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండి ఉండొచ్చు.. నాకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎలాంటి విభేదాలు లేవు అని దేవి ప్రసాద్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
మన శంకర వరప్రసాద్ గారు మూవీపై కొరటాల శివ ఫస్ట్ రియాక్షన్..హిట్ టాక్ రాగానే ఆచార్య డైరెక్టర్ ఏమన్నారంటే
Recommended image2
Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved