- Home
- Entertainment
- కన్నప్ప రిలీజ్ తర్వాత క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన కాజల్.. పార్వతీదేవిగా ఎలా ఉందో చూశారా
కన్నప్ప రిలీజ్ తర్వాత క్రేజీ ఫొటోస్ షేర్ చేసిన కాజల్.. పార్వతీదేవిగా ఎలా ఉందో చూశారా
కన్నప్ప విడుదల తర్వాత కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రకు సంబంధించిన BTS ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం తాజాగా విడుదలయింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ పార్వతి దేవి పాత్రలో నటించారు.
కన్నప్ప విడుదలైన తర్వాత కాజల్ సోషల్ మీడియా వేదికగా మొదటి పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్ లో ఆమె పార్వతి దేవి పాత్రకు సంబంధించిన బీహైండ్-ది-సీన్స్ (BTS) ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ లో కాజల్ సంప్రదాయ తెలుపు చీరలో, బంగారు ఆభరణాలతో అలంకరించబడిన రూపంలో కనిపించారు. పార్వతి దేవి పాత్రలో కాజల్ అందంగా కనిపిస్తూనే ఫైరీ లుక్ తో సర్ప్రైజ్ చేశారు.
ఈ చిత్రంలో ఆమె నటనను అభినందిస్తూ పలువురు అభిమానులు కామెంట్లు చేశారు. ఒక్కరు స్పందిస్తూ, "కన్నప్ప చిత్రంలో పార్వతి దేవి పాత్రకి మీరు జీవం పోశారు మేడం" అని కామెంట్ చేశారు. మరొకరు “మనలోని శక్తిని మేల్కొలిపే సమయం వచ్చింది. నమః శివాయ్!” అంటూ ఆధ్యాత్మికంగా స్పందించారు.
కాజల్ తన పోస్ట్‌కు "మనల్ని మేల్కొలిపే మా శక్తి.. ఓం నమః శివాయ" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది సినిమాకు చెందిన ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఆమె పోస్ట్ అభిమానుల నుండి విపరీతమైన స్పందనను అందుకుంది.
జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రం శైవ భక్తుడు, ధీరుడైన గిరిజన యోధుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. దేవుడిపై అతని విశ్వాసం ఎలా అతని జీవితం మార్చిందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మంచు విష్ణు నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు.