MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 2 కోట్లు ఖర్చు పెట్టి.. పల్లెటూరిలో తల్లీతండ్రులకు ఇల్లు కట్టిన.. జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా?

2 కోట్లు ఖర్చు పెట్టి.. పల్లెటూరిలో తల్లీతండ్రులకు ఇల్లు కట్టిన.. జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా?

జబర్థస్త్ కామెడీ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. టాలీవుడ్ ఉండి పేదరికంలో ఉన్న కమెడియన్స్ ను కోటీశ్వరులను చేసింది. ఈ ఖత్తర్నాక్ కామెడీ షోలో వెలుగు వెలుగుతున్న ఓ కమెడియన్, పల్లెటూరిలో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడంటే మీరు నమ్ముతారా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 23 2025, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జీవితాలు మర్చేసిన జబర్థస్త్
Image Credit : ETV

జీవితాలు మర్చేసిన జబర్థస్త్

ఎక్కడో మారుమూల పల్లెటూరిలో సరదాగా పంచులు వేసే వ్యక్తిని కూడా, వెండితెరపై కమెడియన్ గా మార్చేసిన షో జబర్థస్త్. టాలెంట్ ఉండీ.. అక్కడే ఆగిపోయిన ఎంతో మందికి ఈ షో మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలిచింది. అంతే కాదు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడినవారు, జబర్థస్త్ వల్ల కోటీశ్వరులు అయ్యారు. ప్రస్తుతం రాజా లైఫ్ ను అనుభవిస్తున్నారు. పలు ఇంటర్వ్యూలలో తాముపడ్డ కష్టాలు చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా జబర్ధస్త్ స్టార్ సీనియర్ కమెడియన్ చమ్మకు చంద్ర మాట్లాడుతూ... మారుమూల పల్లెటూరిలో 2 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినట్టు వెల్లడించారు. పల్లెటూరిలో అంత ఖర్చుపెట్టి ఎందుకు ఇల్లు కట్టాడో తెలుసా?

24
బస్సు సౌకర్యంకూడా లేని ఊరు..
Image Credit : Asianet News

బస్సు సౌకర్యంకూడా లేని ఊరు..

చమ్మక్ చంద్ర మారుమూల పల్లెటూరు నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరు నుంచి వచ్చి జబర్ధస్త్ ను ఏలాడు. వ్యవసాయ కూలీలుగా ఉన్న తన తల్లీ తండ్రులు, ఇకపై ఏమాత్రం కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో.. తన ఊరిలో.. అన్ని సౌకర్యాలతో.. అద్భుతమైన ఇంటిని నిర్మించాడు. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించాడు చంద్ర. ఓ ఇంటర్వ్యూలో చంద్ర మాట్లాడుతూ..'' నా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న కష్టపడటమే నేను చూశాను.. ఆ ఊర్లోనే వాళ్లు ఉన్నంత వరకూ హ్యాపీగా ఉండాలి, ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలి, అందుకే వారికోసమే 2 కోట్లు ఖర్చు పెట్టి మాఊరిలో ఇల్లు కట్టాను. ఇప్పటికీ.. మా ఊరికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు'' అని చంద్ర వెల్లడించాడు.

Related Articles

Related image1
5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్
Related image2
8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
34
జబర్ధస్త్ లో చంద్ర మార్క్..
Image Credit : Asianet News

జబర్ధస్త్ లో చంద్ర మార్క్..

కమెడియన్ గా చంద్ర మార్క్ సెపరేట్ గా ఉంటుంది. ఆయన కామెడీ స్టైల్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోర్ కొట్టకుండా డిఫరెంట్ థీమ్స్ ను తీసుకుని, తన సోలో పెర్ఫామెన్స్ తో స్కిట్ ను సక్సెస్ చేస్తుంటాడు చంద్ర. మగవారి కష్టాలు, ఆడవారి వేదింపులు, కుటుంబంలో కలహాలు సృష్టించి.. కామెడీ చేసేవారి వ్యక్తిత్వాలను తన స్కిట్ ద్వారా ప్రెసెంట్ చేస్తుంటాడు చమ్మక్ చంద్ర. నిత్యం మన చుట్టు జరిగే గొడవలు, అందులో చూసే పాత్రలను తీసుకుని కడుపుబ్బా నవ్వించడం చంద్రాకు అలవాటైన పని. అందుకే చమ్మక్ చంద్రకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.

44
ఎంతో మందికి జీవితాన్నిచ్చిన చంద్ర
Image Credit : Youtube / mallemala

ఎంతో మందికి జీవితాన్నిచ్చిన చంద్ర

కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు.. తన స్కిట్స్ లో అవకాశాలు ఇచ్చి, చాలామందికి కమెడియన్స్ కు జీవితాన్ని ఇచ్చాడు చంద్ర. రచ్చ రవి టాలీవుడ్ లో కమెడియన్ గా స్థిరపడటానికి చంద్రనే కారణం. ఈ విషయాన్ని ఎన్నో వేదికలపై వెల్లడించాడు రవి. ఇక లేడీ గెటప్ వినోద్, జీవన్, ఆనంద్, సత్య, సత్తిపండు, కొమురం, ఇలా చాలా మంది కమెడియన్స్ కు అవకాశాలు ఇచ్చి.. ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగడానికి సహాయపడ్డాడు చంద్ర. ఇప్పటికీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నా.. తనకు లైఫ్ ఇచ్చిందిమాత్రం జబర్దస్త్ అని గర్వంగా చెప్పుకుంటుంటాడు చమ్మక్ చంద్ర.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్
Recommended image3
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Related Stories
Recommended image1
5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్
Recommended image2
8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved