MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు

2025లో చాలా మంది హీరోయిన్లు  వెండితెరపై సందడి చేశారు. అభిమానుల మనసు దోచుకున్నారు. కానీ, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమాలు ఎక్కువ వసూళ్లు సాధించాయో తెలుసా? టాప్ 5 లో ముందున్న స్టార్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 22 2025, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. రష్మిక మందన్న
Image Credit : X/Maddockfilms

1. రష్మిక మందన్న

2025లో పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా నిలిచింది  రష్మిక మందన్న. ఈ ఏడాది హిందీలో ఆమె నటించిన ఛావా, సికందర్, తమ్మ, తమిళంలో కుబేర, తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ సహా మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఛావా, సికందర్, తమ్మ, కుబేర చిత్రాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ ఐదు చిత్రాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు 1347.71 కోట్లు. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.

25
2. రుక్మిణి వసంత్
Image Credit : Instagram

2. రుక్మిణి వసంత్

రష్మిక తర్వాత అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ ఏడాది ఆమె నటించిన కాంతార చాప్టర్ 1, ఏస్, మదరాసి అనే మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర  విడుదలయ్యాయి. వీటిలో కాంతార ఛాప్టర్ 1,  మదరాసి సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. మదరాసిలో శివకార్తికేయన్‌కు, ఏస్‌లో విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. ఈ ఏడాది రుక్మిణి నటించిన చిత్రాల మొత్తం వసూళ్లు 962.33 కోట్లు.

Related Articles

Related image1
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Related image2
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
35
3. సారా అర్జున్
Image Credit : Facebook

3. సారా అర్జున్

ఈ జాబితాలో ఆశ్చర్యపరిచే పేరు సారా అర్జున్. ఈమె మరెవరో కాదు, 'నాన్న' చిత్రంలో విక్రమ్ కూతురిగా నటించిన నటి. ప్రస్తుతం హిందీలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్' తో నటించి, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే 836.75 కోట్లు వసూలు చేయడంతో, సారా ఈ జాబితాలో 3వ స్థానం సంపాదించింది.

45
4. అనీత్ పడ్డా
Image Credit : Aneet Padda Instagram

4. అనీత్ పడ్డా

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ల జాబితాలో అనీత్ పడ్డా 4వ స్థానంలో ఉంది. ఆమె తన తొలి చిత్రంతోనే 570.33 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది హిందీలో విడుదలై విజయం సాధించిన 'సైయారా' చిత్రంలో అనీత్ పడ్డా హీరోయిన్ గా  నటించింది.

55
5. కియారా అద్వానీ
Image Credit : Instagram

5. కియారా అద్వానీ

2025కి అన్‌లక్కీ హీరోయిన్ ఎవరంటే కియారా అద్వానీ నే. ఈ ఏడాది ఆమె నటించిన 'గేమ్ ఛేంజర్', 'వార్ 2' అనే రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు  ఘోర పరాజయం పొందాయి. ఈ రెండు చిత్రాల మొత్తం వసూళ్లు 550.63 కోట్లు. దీంతో కియారా అద్వానీ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Recommended image2
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved