MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాటకు 50 లక్షలు వసూలు చేస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

పాటకు 50 లక్షలు వసూలు చేస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

సినిమాకు డైరెక్టర్, మ్యుూజిక్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో కొరియోగ్రాఫర్ కూడా అంతే ముఖ్యం. వారి వల్లే పాటలకు జీవం వస్తుంది. మన ఇండియన్ కొరియోగ్రాఫర్లలో మల్టీ టాలెంట్ ఉన్నవారు ఎక్కువ. వారిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

సినిమాకు ప్రాణం పోసేది పాటలయితే, ఆ పాటలకు జీవం డాన్స్. ఒక సినిమాలో పాటలు, డాన్స్ కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాటలు తెరకెక్కించడంలో సంగీత దర్శకుల పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ల పాత్ర కూడా కీలకమే. కథలో పాటల స్థానం ఎంత ముఖ్యమో, వాటి విజువల్స్‌ను మలిచే కొరియోగ్రాఫర్లు అంతే ముఖ్యం.

26
Image Credit : Asianet News

సాంగ్స్ కు అంత డిమాండు ఉండబట్టే ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఒక్కో పాటకు లక్షలలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో శేఖర్ మాస్టార్, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసిన పాటలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Related Articles

Related image1
1000 కోట్ల ఆస్తి, 3 పెళ్లిళ్లు, 6 పిల్లలు, ఆస్కార్ సాధించిన ఈ నటి ఎవరో తెలుసా?
Related image2
కోటా శ్రీనివాసరావు ఎందుకు ఇలా అయిపోయారు, షాక్ లో అభిమానులు
36
Image Credit : SOCIAL MEDIA

ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం పొందుతున్న కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ నిలిచారు. బాలీవుడ్‌కి చెందిన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఒక్క పాటకు సుమారుగా 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు.

46
Image Credit : @farah khan

ఫరా ఖాన్ డాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1987లో విడుదలైన జల్వా చిత్రంతో తొలిసారి తెరపై కనిపించిన ఆమె, కభీ హాన్ కభీ నా (1994) సినిమాతో తొలి బ్రేక్‌ను అందుకున్నారు. అప్పట్లో ఒక్కసారి 6 పాటలకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆమెకు కేవలం 30,000 మాత్రమే అందినట్లు ఫరా గుర్తుచేసుకున్నారు.

56
Image Credit : instagram

సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా, ఫరా ఖాన్ దర్శకురాలిగా, నటిగా, టెలివిజన్ రియాలిటీ షోల జడ్జిగా కూడా రాణించారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన మేన్ హూ నా, ఓం శాంతి ఓం, తీస్ మార్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. డైరెక్టర్ గా ఫరా ఖాన్ ను నిలబెట్టాయి.

66
Image Credit : our own

ఇక ఫరా ఖాన్‌తో పాటు రెమో డిసౌజా, గణేష్ హెగ్డే, వైభవి మర్చంట్ వంటి కొరియోగ్రాఫర్లు కూడా బాలీవుడ్ లో స్టార్ కంపోజర్లుగా మంచి పారితోషికాన్ని అందుకుంటున్నారు. అయితే పారితోషిక విషయంలో ఫరా ఖాన్ మిగతావాళ్లకంటే ముందున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచన. ఫరా ఖాన్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆమె కష్టపడి పని చేయడమే కాదు, డాన్స్‌పై ఉన్న ప్యాషన్ కూడా ముఖ్యమైన కారణం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
1000 కోట్ల ఆస్తి, 3 పెళ్లిళ్లు, 6 పిల్లలు, ఆస్కార్ సాధించిన ఈ నటి ఎవరో తెలుసా?
Recommended image2
కోటా శ్రీనివాసరావు ఎందుకు ఇలా అయిపోయారు, షాక్ లో అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved