జైలర్ 2 లో పుష్ప 2 విలన్, షెకావత్ తో పోరాడబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్
రజినీకాంత్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు అల్లు అర్జున్ పుష్ప2 విలన్. జైలర్ 2 లో షెకావత్ సార్ విశ్వరూపం చూపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమాలో పుష్ప 2 విలన్ నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత?

2023లో విడుదలై భారీ విజయం సాధించిన సినిమాల్లో జైలర్ ఒకటి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్ గా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. జైలర్ విజయం తర్వాత దాని సీక్వెల్ సినిమా జైలర్ 2 ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?
జైలర్ 2
ఈ సంవత్సరం జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదలైంది. రజినీకాంత్, నెల్సన్ దిలీప్, అనిరుధ్ ఈ ప్రోమోలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ రెండవ భాగానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగంలాగే రెండవ భాగం కూడా యాక్షన్ సన్నివేశాలతో రచ్చ రచ్చ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.
జైలర్ 2 అప్డేట్
జైలర్ 2 షూటింగ్ గత నెలలోనే ప్రారంభమైంది. మొదటి దశ షూటింగ్ చెన్నైలో జరిగింది, రెండవ దశ షూటింగ్ కేరళలో జరుగుతోంది. రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నా నటించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జైలర్ మొదటి భాగంలో అతిథి పాత్రల్లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ జైలర్ 2లో కూడా నటిస్తారని చెబుతున్నారు.
Also Read: 50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?
ఫహాద్ ఫాసిల్, రజినీకాంత్
జైలర్ 2లో మరో స్టార్ నటుడు చేరుతున్నట్లు సమాచారం. మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ జైలర్ 2లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వేటైకారన్ సినిమాలో రజినీకాంత్ తో కలిసి నటించారు. జైలర్ 2 కోసం వీరిద్దరూ మళ్ళీ కలిసి నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. జైలర్ 2ను వచ్చే ఏడాది విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read:సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?