- Home
- Entertainment
- 1500లకు అసిస్టెంట్‌గా చేసి, ఇప్పుడు 100కోట్లు తీసుకుంటూ ఇండియన్ సినిమాని షేక్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
1500లకు అసిస్టెంట్‌గా చేసి, ఇప్పుడు 100కోట్లు తీసుకుంటూ ఇండియన్ సినిమాని షేక్ చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
హీరోలు ఇప్పుడు వంద కోట్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో చాలా మంది వంద కోట్లు తీసుకుంటున్నారు. కానీ దర్శకులు వంద కోట్ల పారితోషికం తీసుకోవడం చాలా అరుదు.

హీరోలే కాదు దర్శకులకు కూడా వంద కోట్ల పారితోషికం
ప్రస్తుతం భారతీయ సినిమా రేంజ్ పెరిగింది. ఒకప్పుడు వంద కోట్లు వసూలు చేస్తే గొప్పగా భావించేవారు. ఆ తర్వాత ఐదు వందల కోట్లు కామన్ అయిపోయింది. అంతేకాదు ఈ రెండు మూడేళ్లలో వెయ్యి కోట్లు కూడా లైట్ అయిపోయింది.
రెండు వేల కోట్లు టార్గెట్ చేసే పరిస్థితిలో ఉంది. ఇక హీరోల పారితోషికం కూడా అదే మారిదిగా పెరుగుతుంది. ప్రభాస్, విజయ్, అల్లు అర్జున్, రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి హీరోలు రూ.150-200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు.
అయితే వీరి జాబితాలో ఇప్పుడు దర్శకులు కూడా చేరిపోయారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వంద కోట్లు తీసుకోవడం విశేషం. మరి ఆయన ఎవరో తెలుసుకుందాం.
రూ.1500 జీతంతో కెరీర్ స్టార్ట్ చేసిన సుకుమార్
రూ.1500 జీతంతో కెరీర్‌ని ప్రారంభించిన ఒక దర్శకుడు ఇప్పుడు వంద కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు క్రియేటివ్ జీనియస్‌గా పేరుతెచ్చుకున్న సుకుమార్ కావడం విశేషం.
సుకుమార్ `ఆర్య` సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. అల్లు అర్జున్, దిల్ రాజు ఆయనకు లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ మూవీతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమాని దున్నేస్తున్నారు.
ఆయన తొలి పారితోషికం అందుకుంది మాత్రం `హనుమాన్ జంక్షన్` మూవీతోనే. అంతకు ముందే ఎడిటర్ మోహన్ వద్ద పనిచేశారు, రెండు మూడు సినిమాలకు రైటింగ్‌లో సహకరించారు.
`హనుమాన్ జంక్షన్` చిత్రానికి అసిస్టెంట్‌గా చేసిన సుకుమార్
`ఎమ్‌రాజా దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ సమర్పణలో వచ్చిన `హనుమాన్ జంక్షన్` చిత్రంలో అర్జున్, జగపతిబాబు, వేణు తొట్టెంపూడి హీరోలుగా నటించారు. స్నేహ, లయ హీరోయిన్లుగా నటించారు.
ఇందులో కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఈ శనివారం(జూన్28న) ఈ మూవీ రీ రిలీజ్ అయ్యింది. దీనికి మంచి ఆదరణే దక్కింది. ఈ మూవీతోనే సుకుమార్‌కి అసిస్టెంట్‌గా మంచి గుర్తింపు దక్కింది.
ఈ మూవీకి అసిస్టెంట్‌గా పనిచేసినందుకు ఆయనకు రూ.1500 పారితోషికం ఇచ్చారట. ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన సుకుమార్ `ఆర్య`తో దర్శకుడి ఎంట్రీ ఇచ్చారు.
`పుష్ప 2`కి వంద కోట్ల పారితోషికం అందుకున్న సుకుమార్
ఇక ఇటీవల అల్లు అర్జున్‌తో `పుష్ప2` సినిమా చేశారు. `పుష్ప`కి రెండో పార్ట్ గా ఈ మూవీ వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
`బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాని షేక్ చేసింది. ఈ మూవీకిగానూ సుకుమార్ తీసుకున్న పారితోషికం ఏకంగా రూ.100 కోట్లు.
అయితే ఈ మూవీ నిర్మాణంలోనూ తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ భాగమైంది. ఆయన పారితోషికం తీసుకోలేదు. కలెక్షన్లలో షేర్ తీసుకున్నారు. అలా ఆయన వాటా కింద వంద కోట్లకుపైగానే వచ్చిందని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్.
నెక్ట్స్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్న సుకుమార్
`పుష్ప 2` తర్వాత ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు సుకుమార్. ఇప్పుడు నెక్ట్స్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఆయన రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నారు.
దీనికి సంబంధించిన కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు సుకుమార్. ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం సుకుమార్ చిత్రం పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.