MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్, ఎన్టీఆర్ తో నటించాలని ఉంది, హాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్.. ముగ్గురూ కలిస్తే పిడుగుల వర్షమే

రాంచరణ్, ఎన్టీఆర్ తో నటించాలని ఉంది, హాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్.. ముగ్గురూ కలిస్తే పిడుగుల వర్షమే

'థోర్ ' పాత్రతో మార్వెల్ చిత్రాలలో ప్రఖ్యాతి పొందిన క్రిస్ హేమ్స్‌వర్త్ కి ఇండియాపై ప్రత్యేక అభిమానం ఉంది. తన కూతురికి కూడా ఇండియా అని పేరు పెట్టాడు. అలాంటి నటుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో నటించాలని ఉందని తెలిపాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 18 2025, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
RRR Movie

RRR Movie

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన 'RRR' భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన అద్భుత చిత్రం. ఈ సినిమా ద్వారా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఇదే నేపథ్యంలో 2023లో ఇంటర్వ్యూలో హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్‌ ఈ సినిమాపై తన అభిమానాన్ని వ్యక్తపరిచారు.

26
Rajamouli

Rajamouli

'థోర్ ' పాత్రతో మార్వెల్ చిత్రాలలో ప్రఖ్యాతి పొందిన క్రిస్ హేమ్స్‌వర్త్, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశానని గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  “‘RRR’ను ఇటీవల చూశాను. అది అద్భుతమైన సినిమా. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ నటులు. వారితో కలసి పనిచేసే అదృష్టం నాకు  వస్తే, అది గొప్ప విషయం అవుతుంది” అని పేర్కొన్నారు.

 

Related Articles

Related image1
అఫీషియల్: చిరు, అనిల్ చిత్రంలో నయనతార.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ అదరగొట్టేసింది
Related image2
ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి మూవీ చేద్దామనుకుని అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్
36
rrr

rrr

ఇది హేమ్స్‌వర్త్‌కు భారతీయ సినిమా పరిచయం అయిన మొదటి సందర్భం కాదు. 2020లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ఎక్ట్రాక్షన్'లో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కలిసి నటించారు. ఆ సినిమా ఎక్కువ భాగం భారత్‌లో చిత్రీకరించబడింది. ఆయనకు భారతదేశంపై ప్రత్యేక ప్రేమ ఉంది. తన కుమార్తెకు కూడా ‘ఇండియా’ అని పేరు పెట్టారు. ‘RRR’ సినిమా గొప్ప కథనతనం, శక్తివంతమైన నటన, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

 

46
Chris Hemsworth

Chris Hemsworth

ఈ చిత్రం 1920ల బ్రిటిష్ వలస పాలన కాలంలో కధనం సాగుతుంది. గోండ్ తెగకు చెందిన భీమ్ అనే ఆదివాసీ యోధుడు, బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ దంపతులచేత బంధించబడిన మల్లి అనే బాలికను రక్షించేందుకు ముస్లిం యువకుడి రూపంలో ఢిల్లీకి చేరతాడు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించగా, భీమ్ పాత్రలో ఎన్టీఆర్ మెప్పించారు.

 

56

ఇటీవ‌ల 'RRR' చిత్రబృందం లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ అల్బర్ట్ హాల్‌లో జరిగిన సంగీత వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ సినిమాను మళ్లీ గుర్తు చేసుకున్నారు.

66
chris hemsworth

chris hemsworth

‘RRR’ సినిమాపై క్రిస్ హేమ్స్‌వర్త్ వంటి గ్లోబల్ స్టార్‌ ప్రశంసలు తెలపడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. రాబోయే రోజుల్లో ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే, అది ప్రేక్షకులకు గొప్ప ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది.వీళ్ళు ముగ్గురూ కలసి నటిస్తే బాక్సాఫీస్ పై పిడుగుల వర్షం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. హేమ్స్‌వర్త్ పోషించిన థోర్ పాత్ర గాడ్ ఆఫ్ థండర్ గా గుర్తింపు పొందింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Recommended image2
పవన్ కళ్యాణ్ కోసం పోలీసు దెబ్బలు తిన్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Related Stories
Recommended image1
అఫీషియల్: చిరు, అనిల్ చిత్రంలో నయనతార.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ అదరగొట్టేసింది
Recommended image2
ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి మూవీ చేద్దామనుకుని అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved