MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mega Heroes: డైరెక్టర్లను బ్లైండ్ గా నమ్మి మునిగిపోయిన మెగా హీరోలు.. 5 చెత్త సినిమాలు ఇవే

Mega Heroes: డైరెక్టర్లను బ్లైండ్ గా నమ్మి మునిగిపోయిన మెగా హీరోలు.. 5 చెత్త సినిమాలు ఇవే

చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా హీరోలు కొందరు దర్శకులని బ్లైండ్ గా నమ్మేసి సినిమాలు చేశారు. కానీ ఆ చిత్రాలు దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 31 2025, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెగా హీరోల 5 చెత్త సినిమాలు
Image Credit : Instagram/Sai Dharam Tej

మెగా హీరోల 5 చెత్త సినిమాలు

మెగా ఫ్యామిలీ హీరోలు కొందరు అగ్ర దర్శకులని గుడ్డిగా నమ్మి మునిగిపోయారు. చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా హీరోలకు ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలు బ్లైండ్ గా నమ్మిన దర్శకుడు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. 

26
చిరంజీవి
Image Credit : our own

చిరంజీవి

ఆచార్య ముందు వరకు కొరటాల శివకి పరాజయమే లేదు. దీనితో చిరంజీవి కొరటాలపై నమ్మకంతో ఆచార్య సినిమా చేశారు. ఈ చిత్ర కథ చూస్తే చిరంజీవి జడ్జిమెంట్ కూడా పూర్తిగా బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది. అసలు కొరటాల శివ ఇలాంటి సినిమా చేస్తాడని మెగా అభిమానులు అస్సలు ఊహించలేదు. 

Related Articles

Related image1
Sankranti Movies 2026: సంక్రాంతి బరిలో 10 మంది హీరోయిన్లు, అందులో ఏడుగురు ఫ్లాపుల్లో ఉన్నవాళ్లే..
Related image2
Prabhas: రాజాసాబ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ? మళ్ళీ రూమర్స్ షురూ, కానీ
36
రాంచరణ్
Image Credit : our own

రాంచరణ్

2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకులలో ఒకరైన శంకర్ ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడం, శంకర్ దర్శకత్వం కావడం విపరీతంగా అంచనాలు పెరిగేలా చేశాయి. కానీ అభిమానులు పెట్టుకున్న ఆశలని శంకర్ నీరుగార్చారు. రాంచరణ్ గుడ్డిగా శంకర్ ని నమ్మి ఈ సినిమా చేసినట్లు ఉంది. 

46
పవన్ కళ్యాణ్
Image Credit : our own

పవన్ కళ్యాణ్

జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ తో చేసిన హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం అని అభిమానులు అనుకున్నారు. త్రివిక్రమ్ సినిమా ఎలా తీసినా మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ మరీ ఇంత పరమ చెత్త సినిమా చేస్తారని ఎవరూ భావించలేదు. అజ్ఞాతవాసి దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. 

56
అల్లు అర్జున్
Image Credit : our own

అల్లు అర్జున్

డైరెక్టర్ వివి వినాయక్ పై నమ్మకంతోతో అల్లు అర్జున్ బద్రీనాథ్ అనే చిత్రంలో నటించారు. అప్పట్లో ఈ సినిమాపై మగధీర స్థాయిలో అంచనాలు ఉండేవి. కానీ ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. 

66
సాయి ధరమ్ తేజ్
Image Credit : our own

సాయి ధరమ్ తేజ్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ చిత్రానికి కూడా వివి వినాయక్ నే దర్శకుడు. వినాయక్ పై నమ్మకంతోనే ఈ సినిమా చేసినట్లు సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image2
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Recommended image3
50 రూపాయల కూలీతో మొదలై.. 50 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Sankranti Movies 2026: సంక్రాంతి బరిలో 10 మంది హీరోయిన్లు, అందులో ఏడుగురు ఫ్లాపుల్లో ఉన్నవాళ్లే..
Recommended image2
Prabhas: రాజాసాబ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ? మళ్ళీ రూమర్స్ షురూ, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved