MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..

చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..

మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినిమాలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. అతడెవరు.. ఏంటా సంగతులు అనేది ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 26 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జగదేకవీరుడు అతిలోకసుందరి
Image Credit : Asianet News

జగదేకవీరుడు అతిలోకసుందరి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని దృశ్య కావ్యం లాంటి చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు.

25
లంకేశ్వరుడు చిత్రంలో..
Image Credit : Social Media

లంకేశ్వరుడు చిత్రంలో..

ఈ చిత్రం గురించి చిరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ డ్యాన్స్  కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు అయిన ప్రభుదేవా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుదేవాని ఫాన్స్ ముద్దుగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. డ్యాన్స్ లో ప్రభుదేవా ఆ స్థాయిలో ప్రతిభ చూపించారు. తాను తొలిసారి ప్రభుదేవా కి లంకేశ్వరుడు చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అప్పటికి ప్రభుదేవా వయసు పదహారేళ్లు కూడా నిండలేదు. చిన్నపిల్లాడు అయినప్పటికీ అతని టాలెంట్ నేను గమనించాను.

Related Articles

Related image1
ఈ వారం OTTలో రాబోయే క్రేజీ చిత్రాలు: సికందర్, హిట్ 3, కెప్టెన్ అమెరికా ఇంకా మరెన్నో, ఎందులో చూడాలో తెలుసా
Related image2
కమల్, మణిరత్నం 'థగ్ లైఫ్' గురించి 7 ఆసక్తికర విషయాలు.. ఈ చిత్ర కథకి మూలం ఏంటో తెలుసా ?
35
చిన్న పిల్లాడు వాడికి ఏం తెలుసు
Image Credit : our own

చిన్న పిల్లాడు వాడికి ఏం తెలుసు

తన చిత్రంలో సాంగ్స్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేయమని అడిగాను. అక్కడే ఉన్న అతడి తండ్రి సుందరం మాస్టర్.. వాడికి ఏం తెలుసు సార్ చిన్న పిల్లాడు అని అన్నారు. కానీ నేను బలవంతంగా ప్రభుదేవా అని కొరియోగ్రఫీ చేయమని చెప్పాను. ఆ తర్వాత స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం కోసం మలేషియా తీసుకెళ్లాను. ఆ టైంలో కనీసం వీసా అని పలకడం చేతకాని చిన్న పిల్లాడు ప్రభుదేవా.

45
బంగారు కోడిపెట్ట సాంగ్
Image Credit : our own

బంగారు కోడిపెట్ట సాంగ్

జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది కూడా అతడే. ఆ తర్వాత ఘరానా మొగుడు చిత్రంలో బంగారు కోడిపెట్ట సాంగ్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ అదరగొట్టేశాడు. ఇప్పుడు ప్రభుదేవా స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందనంత ఎత్తులో ఉన్నాడు.

55
చిరంజీవి ప్రశంసలు
Image Credit : our own

చిరంజీవి ప్రశంసలు

ఆరోజు అందరూ చిన్నపిల్లాడు వద్దని చెబుతున్నా ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అంటే ప్రభుదేవా.. ప్రభుదేవా అంటే డ్యాన్స్ అనేంతలా ఎదిగినట్లు చిరంజీవి ప్రశంసించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Recommended image2
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image3
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Related Stories
Recommended image1
ఈ వారం OTTలో రాబోయే క్రేజీ చిత్రాలు: సికందర్, హిట్ 3, కెప్టెన్ అమెరికా ఇంకా మరెన్నో, ఎందులో చూడాలో తెలుసా
Recommended image2
కమల్, మణిరత్నం 'థగ్ లైఫ్' గురించి 7 ఆసక్తికర విషయాలు.. ఈ చిత్ర కథకి మూలం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved