MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున కొడుకు సినిమా అట్టర్ ఫ్లాప్, చిరంజీవి చెప్పింది విని డైరెక్టర్ కి మైండ్ బ్లాక్.. అసలేం జరిగిందంటే

నాగార్జున కొడుకు సినిమా అట్టర్ ఫ్లాప్, చిరంజీవి చెప్పింది విని డైరెక్టర్ కి మైండ్ బ్లాక్.. అసలేం జరిగిందంటే

సినిమా విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ బావుంటుంది. నాగార్జున కొడుకు అఖిల్ నటించిన ఓ మూవీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 13 2025, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివి వినాయక్ సినిమాలు
Image Credit : Asianet News

వివి వినాయక్ సినిమాలు

తెలుగు చిత్ర పరిశ్రమకి అద్భుతమైన మాస్ చిత్రాలు అందించిన దర్శకులలో వివి వినాయక్ ఒకరు. వివి వినాయక్ చిత్రాలు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటాయి. హీరోల ఎనర్జీని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఆయన. ఆది, ఠాగూర్, బన్నీ, కృష్ణ, నాయక్, దిల్, అదుర్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వినాయక్ దర్శకత్వంలో వచ్చాయి. వినాయక్ కెరీర్ లో భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు కూడా ఉన్నాయి. 

25
వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అఖిల్
Image Credit : Asianet News

వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అఖిల్

వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిస్సప్పాయింట్మెంట్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ' అఖిల్' చిత్రం గురించే. ఈ మూవీని హీరో నితిన్ భారీ బడ్జెట్ లో నిర్మించారు. నితిన్ ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఖాయం అని అనుకున్నారు. 

Related Articles

Related image1
హౌస్ లోకి రాగానే శ్రీజని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసిన దివ్వల మాధురి, రమ్య.. చెప్పిన కారణం ఏంటో తెలుసా ?
Related image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు.. బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'తో పాటు మరిన్ని
35
చిరంజీవి ఇచ్చే సలహాలు బాగుంటాయి
Image Credit : our own

చిరంజీవి ఇచ్చే సలహాలు బాగుంటాయి

కానీ అఖిల్ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఫైట్స్, డ్యాన్సులతో అఖిల్ అదరగొట్టాడు. కానీ ఈ చిత్ర కథ ఎవరికీ కనెక్ట్ కాలేదు. ఈ మూవీ ఫెయిల్యూర్ గురించి వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీ తప్పులని ఎవరైనా చెబితే సరిచేసుకుంటారా అని యాంకర్ ప్రశ్నించగా వినాయక్ ఇలా సమాధానం ఇచ్చారు. 'పాజిటివ్ గా చెబితే తప్పకుండా తీసుకుంటాను. అలా నాకు పాజిటివ్ వేలో చిరంజీవి గారు సలహాలు ఇస్తుంటారు. ఆయన చెప్పే విధానం చాలా బావుంటుంది. అఖిల్ మూవీ రిలీజైన నెల రోజుల తర్వాత ఒకసారి చిరంజీవి గారిని కలిశాను. 

45
అఖిల్ మూవీపై చిరంజీవి కామెంట్స్
Image Credit : Asianet News

అఖిల్ మూవీపై చిరంజీవి కామెంట్స్

అఖిల్ మూవీ చూశానని చిరంజీవి గారు అన్నారు. మూవీ అంతా బావుంది వినాయక్. పాటలు, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ బావున్నాయి. సినిమా క్వాలిటీ చాలా బావుంది. కానీ కథ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అల్లిక లేదు. స్క్రీన్ ప్లే వల్ల కథతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. అదొక్కటే లోపం. నెక్స్ట్ టైం నుంచి అది జాగ్రత్తగా చూసుకో' అని చిరంజీవి చెప్పినట్లు వినాయక్ తెలిపారు. 

55
అది వర్కౌట్ కాదని ముందే చెప్పేసిన చిరంజీవి
Image Credit : Asianet News

అది వర్కౌట్ కాదని ముందే చెప్పేసిన చిరంజీవి

చిరంజీవి గారు చెప్పిన విధానం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన ఇచ్చిన సలహాతో కాంప్లికేటెడ్ కథలని పక్కన పెట్టేయాలి అనే లెసన్ నేర్చుకున్నట్లు వినాయక్ తెలిపారు. అఖిల్ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారు లోపాలు చెప్పారు. కానీ నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ మూవీకి చిరంజీవి ముందే జోస్యం చెప్పేశారు. కనీసం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే జోష్ మూవీ వర్కౌట్ కాదు అని చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయాన్ని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాస్తవానికి జోష్ కథ అనుకున్నది రాంచరణ్ కోసం. దీనితో కథని చిరంజీవికి వినిపించారు. ఇది వర్కౌట్ అయ్యే కథ కాదు అని దిల్ రాజుకి చిరంజీవి చెప్పేశారు. ఎలాగైనా ఈ చిత్రాన్ని హిట్ చేయాలి అనే కసితో దిల్ రాజు.. నాగ చైతన్యతో మూవీ చేశారు. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Recommended image2
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
Recommended image3
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Related Stories
Recommended image1
హౌస్ లోకి రాగానే శ్రీజని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసిన దివ్వల మాధురి, రమ్య.. చెప్పిన కారణం ఏంటో తెలుసా ?
Recommended image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు.. బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'తో పాటు మరిన్ని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved