- Home
- Entertainment
- ఆగస్ట్ లో కాదు, `బిగ్ బాస్ తెలుగు 9` ప్రారంభమయ్యేది ఆ రోజే, ఈ సారి మూడో హీరోకి ఛాన్స్?
ఆగస్ట్ లో కాదు, `బిగ్ బాస్ తెలుగు 9` ప్రారంభమయ్యేది ఆ రోజే, ఈ సారి మూడో హీరోకి ఛాన్స్?
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ప్రారంభమయ్యే డేట్‌కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

`బిగ్ బాస్ తెలుగు 9` సందడి షురూ
`బిగ్ బాస్ తెలుగు 9` సందడి షురూ అయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు రెండు ప్రోమోలు విడుదల చేశారు. `బిగ్ బాస్ తెలుగు 9` ని ప్రకటిస్తూ లోగోని పరిచయం చేశారు. ఈ సారి చాలా కొత్తగా డిజైన్ చేశారు.
అదే సమయంలో బిగ్ బాస్ సందడి ప్రారంభమైందని తెలిపారు. దీంతోపాటు బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ మరో ప్రోమోని విడుదల చేశారు. ఇందులో కామన్ మ్యాన్‌కి అవకాశం కల్పించడం విశేషం.
బిగ్ బాస్ షోని ఆదరిస్తున్న ఆడియెన్స్ కి రిటర్న్ గిఫ్ట్ గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటరయ్యే అవకాశం కల్పించారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. మరి ఒక్కరినే తీసుకుంటారా? ఇద్దరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.
`బిగ్ బాస్ తెలుగు 9` ఎప్పుడు ప్రారంభం ?
ఇదిలా ఉంటే `బిగ్ బాస్ తెలుగు 9`వ షో కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి.
ఈ సారి త్వరగానే ప్రారంభమవుతుందనే టాక్ వినిపించింది. ఆగస్ట్ లోనే స్టార్ట్ అవుతుందని, ఈ సారి నెల రోజుల ముందే ఈ రియాలిటీ షోని స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది.
ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ లీక్ బయటకు వచ్చింది. `బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్ ప్రారంభమయ్యేది ఎప్పుడో తేలిపోయింది.
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్ ప్రారంభమయ్యేది అప్పుడే
టీమ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌ని సెప్టెంబర్‌లోనే ప్రారంభిస్తారట. ముందు రాబోతుందనే దాంట్లో నిజం లేదని తెలుస్తుంది. గత సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యింది.
ఈ సారి కూడా అలానే స్టార్ట్ చేస్తారట. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో లాంఛ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్టు సమాచారం.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ టీమ్ నుంచి కూడా ఇదే సమాచారం అందుతుంది. ఆగస్ట్ 31న ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు.
ఆ ఆలోచన ఇప్పటికైతే లేదు, దీనికి మరో రెండు నెలలు ఉంది కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 7న ప్రారంభ తేదీ అని ఇప్పటి వరకు ఉన్న సమాచారం.
బిగ్ బాస్ హౌజ్‌లోకి హీరో రోహిత్?
ఇక బిగ్ బాస్ షోకి ఈ సారి ఎవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరు హీరోలు రాబోతున్నారట. రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.
వీరితోపాటు తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఒకప్పటి హీరో రోహిత్ కూడా రాబోతున్నారని టాక్. `సిక్స్‌టీన్` చిత్రంతో ఆయన హీరోగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా చేశారు.
లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాలతో మెప్పించారు. బాగా వెలిగిన ఆయన కనుమరుగయ్యారు. ఆ మధ్య ఓ మూవీలో కనిపించారు. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన పేరు వినిపించడం విశేషం.
`బిగ్ బాస్ తెలుగు 9` షోకి వస్తున్నట్టు వినిపిస్తోన్న పేర్లు
ఇక కంటెస్టెంట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో రీతూ చౌదరీ, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల, శివ కుమార్, కావ్య, దీపికా, దేబ్ జానీ, ఇమ్మాన్యుయెల్, కల్పికా గణేష్, ఛత్రపతి శేఖర్, సాయి కిరణ్, తేజస్విని, టీవీ ఆర్టిస్ట్ సీతా కాంత్, సీనియర్ నటుడు ప్రదీప్, హరికా ఏక్‌నాథ్, మై విలేజ్ షో అనిల్ వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి.
మరి వీరిలో ఎంత మంది వస్తారనేది చూడాలి. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుందట. అయితే ఈ సారి లాంచింగ్ రోజు 18 మంది కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపిస్తారట. 9 మంది బాయ్స్, 9 మంది గర్ల్స్ గా 9 జంటలుగా వీరిని పంపించబోతున్నారట.
వీరికి `నవరత్నాలు` అనే పేరు పెట్టినట్టు, ఓ కాన్సెప్ట్ ప్రకారం వీరిని గేమ్స్ ఆడించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి కాస్త కొత్తగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.