MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ మూవీలో హీరోయిన్ కి అవమానం, ఆమె ముఖం చూసి కెమెరామెన్ చేసిన పని ఇదే.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెలుసా

పవన్ మూవీలో హీరోయిన్ కి అవమానం, ఆమె ముఖం చూసి కెమెరామెన్ చేసిన పని ఇదే.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తెలుసా

అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ మూవీలో అవమానం ఎదురైంది. కెమెరామెన్ చేసిన పని వల్ల స్టార్ హీరోయిన్ బాగా అప్సెట్ అయ్యారట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 17 2025, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్, భూమిక ఖుషి మూవీ
Image Credit : X/DVV Entertainments

పవన్ కళ్యాణ్, భూమిక ఖుషి మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో నటించిన చిత్రాలలో తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలు మెమొరబుల్ గా నిలిచిపోతాయి. ముఖ్యంగా ఖుషి మూవీ యువతని విపరీతంగా ఆకట్టుకున్న టాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

25
గుడిలో సన్నివేశం చిత్రీకరణ
Image Credit : Instagram/Bhumika Chawla

గుడిలో సన్నివేశం చిత్రీకరణ

ఈ మూవీ షూటింగ్ సమయంలో భూమికకి ఊహించని అనుభవం ఎదురైందట. ఆ సంఘటన వల్ల చాలా అప్సెట్ అయ్యానని భూమిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గుడిలో దీపం ఆరిపోకుండా నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఒకేసారి చేతులు పెట్టే సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. ఆ సీన్ కోసం నేను లైట్ మేకప్ రెడీ అయ్యాను.

Related Articles

Related image1
ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్
Related image2
ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలు కాదు.. రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ అదే, సింహాద్రి తర్వాత ఇలా..
35
అందరి ముందు భూమికకు అవమానం
Image Credit : Instagram/Bhumika Chawla

అందరి ముందు భూమికకు అవమానం

షాట్ కోసం రెడీ అయిన తర్వాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ గారు నన్ను చూశారు. నా మేకప్ చూసి అందరి ముందు అరిచేశారు. ఏంటి ఆ మేకప్, వెళ్లి మేకప్ తీసేసి ముఖం కడుక్కుని రా అని చెప్పారు. నేను వేసుకున్నది చాలా తక్కువ మేకప్ అని చెప్పినా వినలేదు. ఆయనే ఫేస్ వాష్ ఇచ్చి వెళ్లి క్లీన్ చేసుకుని రా అని చెప్పారు. నేను చాలా అప్సెట్ అయ్యాను.

45
అప్సెట్ అయిన భూమిక
Image Credit : Instagram/Bhumika Chawla

అప్సెట్ అయిన భూమిక

సాధారణంగా నా చిత్రాల్లో నేను చాలా తక్కువ మేకప్ తో కనిపిస్తాను. అది కూడా ఆయనకు నచ్చలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో మేకప్ తొలగించి ఆ సీన్ లో నటించాను. కానీ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పీసీ శ్రీరామ్ గారు నన్ను చాలా బాగా చూపించారు.

55
నేచురల్ అందంతో భూమిక
Image Credit : Instagram/Bhumika Chawla

నేచురల్ అందంతో భూమిక

ఖుషి మూవీ లో 80 శాతం సన్నివేశాల్లో నాకు ఆశాలు మేకప్ ఉండదు. నేచురల్ లుక్ తోనే కనిపిస్తాను. కొన్ని సన్నివేశాల్లో మాత్రం తక్కువ మేకప్ ఉంటుంది అని భూమిక తెలిపింది. ఖుషి మూవీ రిలీజ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Recommended image2
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Related Stories
Recommended image1
ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్
Recommended image2
ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలు కాదు.. రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ అదే, సింహాద్రి తర్వాత ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved