MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ బాక్సాఫీసు వసూళ్లు.. టీ ఖర్చులు కూడా రాలేదా?

Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ బాక్సాఫీసు వసూళ్లు.. టీ ఖర్చులు కూడా రాలేదా?

Barabar Premistha Collections: వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన చంద్ర హాస్‌ హీరోగా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి కలెక్షన్లు చూస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 09 2026, 08:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీని కిల్‌ చేసిన కాంట్రవర్సీ
Image Credit : Asianet News

`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీని కిల్‌ చేసిన కాంట్రవర్సీ

యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన సినిమాల కంటే వివాదాలతోనే వైరల్‌గా మారుతున్నాడు. ఇటీవల `గుంజి గుంజి` పాటలో వల్గర్‌ పదాలు వాడి వివాదంలో ఇరుక్కున్నాడు. దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాడు. ఇక ఆయన హీరోగా లేటెస్ట్ గా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. వివాదం నడించినంత బ్యాడ్‌ గా అయితే సినిమా లేదు. కులం, పరువు హత్యల ప్రధానంగా సినిమాని రూపొందించారు, కానీ వివాదంలో పడి దీన్ని ఎవరూ పట్టించుకోలేదు.

25
`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీని పట్టించుకోని ఆడియెన్స్
Image Credit : Asianet News

`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీని పట్టించుకోని ఆడియెన్స్

సాధారణంగా సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి వివాదం చేస్తుంటారు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుందని, కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తుంటారు. కానీ చంద్రహాస్‌ చేసిన వివాదం ఈ మూవీకి ప్లస్‌ కాలేదు కదా, మరింత మైనస్‌గా మారింది. కనీసం సినిమాని పట్టించుకునే నాదుడే లేదు. థియేటర్లలో సీట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. బుక్‌ మై షో వంటి వాటిలో 99శాతం ఖాళీగానే ఉన్నాయి.

Related Articles

Related image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Related image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
35
`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ కలెక్షన్లు

`బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మూవీకి చాలా చోట్ల కనీసం టీ ఖర్చులు కూడా రావడం లేదట. ఈ సినిమాని దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. అయితే వసూళ్లు చూస్తే.. మొదటి రోజు రూ.25లక్షల వరకు వచ్చాయని, అలాగే రెండో రోజు రూ.19లక్షలు వచ్చాయని, మూడో రోజు ఆదివారం రూ.12లక్షలు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా మూడు రోజులు రూ.56 లక్షలు వచ్చాయి. ఇందులో షేర్‌ చూస్తే రూ.30 లక్షల లోపే ఉందని చెప్పొచ్చు.  చాలా చోట్ల కనీసం థియేటర్‌ ఖర్చులు కూడా రావడం లేదని, జీరో షేర్‌ కే పరిమితమయ్యిందని సమాచారం.

45
కుల హత్యలపై సందేశాత్మకంగా `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ
Image Credit : Asianet News

కుల హత్యలపై సందేశాత్మకంగా `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ

చంద్రహాస్‌ హీరోగా నటించిన `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, అభయ్‌ నవీన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఆద్యంతం లవ్‌ అండ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీలో కులానికి సంబంధించి అందించిన సందేశం బాగుంది.

55
బెడిసికొట్టిన వివాదం
Image Credit : Asianet News

బెడిసికొట్టిన వివాదం

అయితే సినిమాని పాజిటివ్‌గా ప్రమోట్‌ చేసి ఉంటే అది మూవీకి హెల్ప్ అయ్యేది. కానీ వివాదాలకు ప్రయారిటీ ఇవ్వడంతో అది కాస్త సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. కంటెంట్‌ని ఆడియెన్స్ కి దగ్గర చేస్తూ వెళితే డీసెంట్‌ కలెక్షన్లు వచ్చేవి, కనీసం ప్రశంసలైనా దక్కేవి. అనవసర వివాదం సినిమాని కిల్‌ చేశాయని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Thrillers: జియో హాట్‌స్టార్ లో అస్సలు మిస్ కాకూడని టాప్ 3 థ్రిల్లర్స్..బుర్రని హీటెక్కించే ట్విస్టులు
Recommended image2
ప్రభాస్ స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్‌ను తీసేశారా? అసలేం జరిగిందంటే..
Recommended image3
సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్
Related Stories
Recommended image1
Sobhan Babu చెప్పిన మాట వినకుండా వేల కోట్లు పోగొట్టుకున్న స్టార్‌ హీరో.. చుట్టూ ఉన్నవాళ్లే మోసం
Recommended image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved