MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 7 కోట్ల మూవీని 22 కోట్లకు వదిలించుకుందాం అనుకున్న బడా నిర్మాత, కట్ చేస్తే 70 కోట్ల వసూళ్లు

7 కోట్ల మూవీని 22 కోట్లకు వదిలించుకుందాం అనుకున్న బడా నిర్మాత, కట్ చేస్తే 70 కోట్ల వసూళ్లు

చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు అనుకోకుండా అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రం గురించి ఒక బడా నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్మాత ఎవరో కాదు అశ్విని దత్. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ashwini Dutt

Ashwini Dutt

చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు అనుకోకుండా అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రం గురించి ఒక బడా నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్మాత ఎవరో కాదు అశ్విని దత్. ఆలీతో సరదాగా కార్యక్రమంలో అశ్వినీ దత్ జాతి రత్నాలు చిత్రం గురించి కొన్ని విషయాలు రివీల్ చేశారు. ముందుగా తనకి జాతి రత్నాలు చిత్రం పై ఏమాత్రం ఆసక్తి లేదని అన్నారు.

25

ఇలాంటి చిత్రం నిర్మించాలని ఆలోచన ఎవరిది? మీ నిర్ణయమా లేక నాగ్ అశ్విన్, స్వప్నల నిర్ణయమా అని అలీ ప్రశ్నించారు. అశ్విని దత్ బదులిస్తూ అది నాగి నిర్ణయమే అని అన్నారు. వాళ్ల కోరిక మేరకు ఒప్పుకున్నాను. షూటింగ్ చివరి దశకు వచ్చేసరికి రిలీజ్ టైం ఆలస్యం అవుతోంది.
 

Related Articles

Related image1
భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారో తెలుసా
35
Nag Ashwin

Nag Ashwin

ఈ చిత్ర కథ చెప్పమంటే మొత్తం కామెడీ సీన్లే చెప్పారు. ఎందుకో ఈ మూవీ తేడాగా అనిపించింది. ఈ చిత్రానికి 7 కోట్ల బడ్జెట్ అయింది. అదే టైంలో అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ చిత్రానికి 22 కోట్ల ఆఫర్ వచ్చింది. థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా తమకి ఆ మూవీ ఇచ్చేస్తే 22 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అద్భుతమైన ఆఫర్.. ఇంతటితో ఈ చిత్రాన్ని వదిలించుకుంటే మంచిది. అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేయమని నాగికి చెప్పాను.

45

కానీ నాది ఒప్పుకోలేదు. అంకుల్.. ఇది థియేటర్లో ఆడియన్స్ నవ్వుకోవడం కోసం చేసిన చిత్రం. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీకి ఇస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అదే థియేటర్లో అయితే విజయం సాధిస్తుంది. దీన్ని థియేటర్ లోనే రిలీజ్ చేద్దాం అని నాగి చెప్పాడు.
 

55

నాగి జడ్జిమెంట్ కరెక్ట్. థియేటర్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. ఒకవేళ అశ్వినీ దత్ అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసి ఉంటే చాలా నష్టపోయేవాళ్ళు. ఎందుకంటే జాతి రత్నాలు చిత్రం థియేటర్స్ లో ఏకంగా 70 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కలసి చేసిన కామెడీ హంగామా అంతా ఇంతా కాదు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved