MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు

అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు

జబర్థస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీ మధ్య గొడవలు ఉన్నాయా? వాటిని తాజాగా ఈ ఇద్దరు స్టార్లు ప్యాచప్ చేసుకున్నారా? జబర్ధస్త్ స్టేజ్ పై ఇద్దరు యాకర్లు ఎందుకు ఏడ్చారు? కారణం ఏంటి? 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 06 2025, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube / mallemala

టాలీవుడ్ కు కమెడియన్లను అందించిన జబర్ధస్త్

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంగా నిలిచింది జబర్ధస్త్ కామెడీ షో. మారుమూల దాగిఉన్న టాలెంట్ ను బయటకు తీసుకువచ్చిన కామెడీ షో జబర్దస్త్. ఊళ్లో సరదాగా పంచ్ లు వేసేవారిని కూడా తెరపై కమెడియన్స్ గా జీవితం ఇచ్చింది జబర్థస్త్. పుష్కరానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న జబర్ధస్త్ వల్ల వదలమంది ఆర్టిస్ట్ లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. . 2013లో ప్రారంభమైన ఈషో వల్ల ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారారు. అంతే కాదు టాలీవుడ్ కు స్టార్ యాంకర్లను కూడా ఇచ్చింది జబర్ధస్త్.జబర్ధస్త్ కు చాలామంది యాంకర్లు పనిచేశారు. కాని మొదటి నుంచి అనసూయ, రష్మీ మాత్రమే ఎక్కువ కాలం ఈషోను హోస్ట్ చేసిన రికార్డ్ ఉంది. అంతే కాదు ఈ షో చేస్తూనే ఈ ఇద్దరు చాలా సినిమాల్లో నటించారు. అనసూయ అయితే వెండితెరపై ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు కూడా చేశారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈ ఇద్దరికి జబర్థస్త్ రష్మీ. జబర్థస్త్ అనసూయ అనే పేరు మాత్రమే ఇండస్ట్రీలో అందరికి గుర్తుండిపోయింది. అంతలా జబర్థస్త్ వీరి జీవితంలో భాగం అయ్యింది.

DID YOU
KNOW
?
జబర్ధస్త్ 12 ఏళ్ల ఉత్సవాలు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న కామెడీషో జబర్దస్త్. ఈ షో స్టార్ట్ అయ్యి 12 ఏళ్లు పూర్తయ్యింది. 2013 నుంచి ఆడియన్స్ ను నవ్విస్తూనే ఉంది జబర్దస్త్ కామెడీ షో.
25
Image Credit : Youtube / mallemala

జబర్థస్త్ 12 ఏళ్ల ఉత్సవాలు

తెలుగు టెలివిజన్ లో సంచలన కామెడీ షో జబర్దస్త్ తన 12 ఏళ్ల సెలబ్రేషన్స్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్ కు సబంధించిన స్పెషల్ ప్రోమోను కూడా టీమ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జబర్థస్త్ లో ప్రస్తుతం ఉన్న కమెడియన్లు, పాత కమెడియన్లతో పాటు జబర్ధస్త్ పాత యాంకర్ అయిన అనసూయ, మాజీ జడ్జ్ నాగబాబు కూడా ఈ షోలో సందడి చేశారు. ఈసందర్భంగా అందరు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అందులో హ్యాపీ మూమెంట్స్ తో పాటు బాధపడ్డ సంఘటనలు కూడా ఉండటంతో.. ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఈ ప్రోమోలో కనిపించాయి. ఈక్రమంలోనే యాంకర్లు అనసూయ, రష్మీ ఎమోషనల్ అయ్యారు. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని స్టేజ్ మీదనే ఏడ్చారు. అయితే వీరిమధ్య గతంలో ఏదో జరిగినట్టు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. వారి కామెంట్లు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అసలు వీరి మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Related image1
శంకర్ కంటే ముందే, 30 ఏళ్ల క్రితమే రోబో సినిమా చేసిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
Related image2
బాక్సాఫీస్ పై దండయాత్ర కు రెడీగా ముగ్గురు మెగా మొనగాళ్లు
35
Image Credit : ETV Jabardasth

అనసూయ వ్యాఖ్యలు వైరల్

ప్రోమోలో స్టేజీకి రావడంతోనే ఎమోషనల్ గా కనిపించింది రష్మీ, ఒక సందర్భంలో ఏడవడం మొదలు పెట్టింది. అదే సమయంలో అనసూయ భావోద్వేగంతో వెళ్లి రష్మీని హత్తుకుంది. కాసేపు అంతా నిశబ్ధంగా మారింది. ఈక్రమంలో అనసూయ మాట్లాడుతూప.. "జీవితం బోల్డ్ అనేక అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండా ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆమె రష్మీ దగ్గరకు వెళ్లి హత్తుకున్నారు. దాంతో అందరికి అర్ధం అయ్యింది. వీరిమధ్య ఏదో జరిగిందని. అనసూయ మాట్లాడుతూ.. "ఎవరికీ తెలియనివి ఇప్పుడు తెలిసిపోయేలా ఉన్నాయి అని డైలాగ్ వేసింది.

45
Image Credit : ETV / Jabardasth

రష్మీ మాట్లాడుతూ..

అనసూయ కామెంట్స్ కు రష్మీ కూడా స్పందించింది. "అదేం వాట్సాప్‌లో గాని ఫోన్ చేసి గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా", ఇలా ఎందుకు అని సీక్రేట్ ను దాచే ప్రయత్నం చేసింది. అప్పుడు అనసూయ కల్పించుకుంటూ.. "అలా అయితే చాలా ఇగోలు అడ్డు వస్తాయి కదా '' అని అన్నారు. దాంతో ఈమొత్తం సీన్ లో వీరిద్దరిమధ్య గతంలో ఏవో జరిగాయి. దాంతో ఇద్దరు దూరం అయ్యారు. ఈ షోద్వారా మళ్లీ ప్యాచప్ చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

55
Image Credit : Youtube / mallemala

ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

జబర్ధస్త్ 12 ఏళ్ల ఉత్సవాలకు సబంధించిన ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోమో చూసి ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఆగస్టు 8,9 తేదీల్లో ఈ జబర్థస్త్ స్పెషల్ ఎపిసోడ్ ఈటీవీ ద్వారా ప్రసారం కాబోతోంది. ఇక ఈ ప్రోమో ద్వారా చాలామంది ఎమోషనల్ కామెంట్స్ ను పూర్తిగా చూడాల్సి ఉంది. చంద్రతో పాటు, ఆది, రచ్చ రవి, రాకెట్ రాఘవలాంటి వారు ఈ షోలో తమ గతాన్ని పంచుకున్నారు. పంచ్ లు వేస్తూ నవ్వుకున్నారు. ఈ షో ద్వారా నాగబాబు కూడా చాలా కాలం తరువాత నవ్వులతో సందడి చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
రష్మీ గౌతమ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
శంకర్ కంటే ముందే, 30 ఏళ్ల క్రితమే రోబో సినిమా చేసిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
బాక్సాఫీస్ పై దండయాత్ర కు రెడీగా ముగ్గురు మెగా మొనగాళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved