MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం

నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2025, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిస్ వరల్డ్ ఫైనల్స్
Image Credit : Instagram/Nandini Gupta

మిస్ వరల్డ్ ఫైనల్స్

హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకి చేరుకున్నాయి. మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలే తో మిస్ వరల్డ్ పోటీలు ముగుస్తాయి. 2024 లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా ఈ ఏడాది విజేతగా నిలిచే సుందరీమణికి కిరీటం అందజేస్తారు. క్రిస్టినా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మహిళ.

25
ఈసారి కిరీటం ఎవరిది
Image Credit : Asianet News

ఈసారి కిరీటం ఎవరిది

అయితే ఈసారి మిస్ వరల్డ్ కిరీటం ఏ దేశానికి చెందిన మోడల్ కి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది. మొత్తం 108 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే నందిని గుప్తా టాప్ 40 లో అర్హత సాధించారు.

Related Articles

Related image1
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
35
మిస్ వరల్డ్ పోటీల్లో తిరుగులేని భారత్
Image Credit : Instagram/ Nandini Gupta

మిస్ వరల్డ్ పోటీల్లో తిరుగులేని భారత్

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే. అంటే మిస్ వరల్డ్ టైటిల్స్ లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. 1966లో తొలిసారి ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ముంబై కి చెందిన రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది

45
ఇండియాకి పోటీ ఇస్తున్న బుల్లి దేశం
Image Credit : Instagram/ Nandini Gupta

ఇండియాకి పోటీ ఇస్తున్న బుల్లి దేశం

ఆ తర్వాత 1994 లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని సంచలనం సృష్టించింది. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో మనం మాత్రమే నెంబర్ వన్ కాదు. చిన్న ట్విస్ట్ ఉంది. 2.8 కోట్ల జనాభా కలిగిన బుల్లి దేశం వెనుజులా కూడా ఇండియాకి సమానంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఆరు టైటిల్స్ సాధించింది. ఆ దేశం తరపున 1995, 1981, 1984, 1991, 1995, 2011 సంవత్సరాలలో సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు.

55
రేసులో నందిని గుప్తా
Image Credit : Instagram

రేసులో నందిని గుప్తా

ఇండియా, వెనుజులా తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఐదు టైటిల్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఈసారి ఇండియా తరపున నందిని గుప్తా టైటిల్ సాధిస్తే మనమే నెంబర్ 1 అవుతాం. మిస్ వరల్డ్ 2025 కిరీటం ఎవరిది అనేది శనివారం రోజు జరిగే ఫైనల్స్ లో తేలిపోనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved