MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` ఈ శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రానికి మొదటి రోజు బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 13 2025, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీసు వద్ద `అఖండ 2` రచ్చ
Image Credit : Asianet News

బాక్సాఫీసు వద్ద `అఖండ 2` రచ్చ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ 2` ఈ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. గత వారం విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్స్ ఇష్యూస్‌ వల్ల వాయిదా పడింది. అది ఎట్టకేలకు సెటిల్‌ అయ్యింది. మద్రాస్‌ కోర్ట్ కూడా క్లీయరెన్స్ ఇవ్వడంతో గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాలయ్య అభిమానులకు నచ్చుతుందని అంటున్నారు. సాధారణ ఆడియెన్స్ మాత్రం దారుణంగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదంటున్నారు.

25
`అఖండ 2` మొదటి రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

`అఖండ 2` మొదటి రోజు కలెక్షన్లు

ఈ క్రమంలో `అఖండ 2` మూవీ కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. డివైడ్‌ టాక్‌తోనూ దుమ్ములేపినట్టు సమాచారం. ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ డేతో కలిసి ఇండియాలో భారీ వసూళ్లని రాబట్టింది. ఏకంగా రూ.36కోట్లు వసూలు చేసినట్టు sacnilk.com పేర్కొంది. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి రూ.9.6 కోట్లు వస్తే, మొదటి రోజు 26.58 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా రూ.36.18 కోట్లని వసూలు చేసింది. అయితే చిత్ర బృందం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఏకంగా రూ.59.5కోట్లు వసూలు చేసినట్టు ప్రకటించడం విశేషం. 

Related Articles

Related image1
Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Related image2
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
35
`డాకు మహారాజ్‌`ని దాటేసిన `అఖండ 2`
Image Credit : Youtube/14reels plus

`డాకు మహారాజ్‌`ని దాటేసిన `అఖండ 2`

ఇదిలా ఉంటే `అఖండ 2` మూవీ వసూళ్లు బాలయ్య గత చిత్రం `డాకు మహారాజ్‌`ని దాటేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.56కోట్లు వసూళు చేసింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు `అఖండ 2` పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అయ్యింది. దీంతో దాన్ని దాటేసింది.  అయితే టీమ్‌ ప్రకటించిన వసూళ్లలో రియాలిటీ ఎంతనేది తెలియాల్సి ఉంది. 

45
బాలయ్య మూవీస్‌ టాప్‌ 5 డే 1 కలెక్షన్లు
Image Credit : our own

బాలయ్య మూవీస్‌ టాప్‌ 5 డే 1 కలెక్షన్లు

బాలయ్య టాప్‌ ఓపెనింగ్‌ మూవీస్‌ చేస్తే, రూ.59.5కోట్లతో `అఖండ 2` నెంబర్‌ `1గా నిలిచింది. `డాకు మహారాజ్‌` రూ.56కోట్లతో  రెండో స్థానంలో నిలిస్తే, రూ.54కోట్ల కలెక్షన్లతో `వీరసింహారెడ్డి` మూడో స్థానంలో ఉంది. రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ వసూళ్ల పరంగా దుమ్ములేపింది. ఇక రూ.32కోట్ల ఓపెనింగ్‌ కలెక్షన్లతో `భగవంత్‌ కేసరి` నాల్గో స్థానంలో ఉంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ 2` మూవీ రూ.30కోట్లతో టాప్‌ 5లో ఉంది.  

55
`అఖండ 2`లో ఏం చూపించారంటే
Image Credit : Asianet News

`అఖండ 2`లో ఏం చూపించారంటే

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2`లో ఆదిపినిశెట్టి విలన్‌గా నటించారు. పూర్ణ, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌ సంయుక్త మరో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె బాలయ్యతో కలిసి డాన్సు కూడా చేసింది. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీలో ఎక్కువగా శివతత్వాన్ని చూపించారు. అయితే బాలయ్య ఇందులో యాక్షన్‌ సీన్లలో, హిందుత్వం గురించి చెప్పే సీన్లలోనే కనిపించారని, ఆయన మిగిలిన సీన్లలో పెద్దగా కనిపించలేదనే టాక్‌ వినిపిస్తోంది. రొటీన్‌ యాక్షన్‌ మూవీ తప్ప, ఇందులో ఏమీ కొత్తదనం లేదని, శివుడు, నరసింహ స్వామి సీన్లతో హడావుడు చేసే ప్రయత్నం చేసినట్టుగా ఆడియెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెగటివ్‌ టాక్‌ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని, రెండో రోజు దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి పెరుగుతాయా? పడిపోతాయా? అనేది చూడాలి. ఈ శని, ఆదివారం వసూళ్లని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image2
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image3
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Related Stories
Recommended image1
Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Recommended image2
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved