- Home
- Entertainment
- కమల్ తో రొమాన్స్ చేసి, రజినీకాంత్ కు హ్యాండ్ ఇచ్చిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
కమల్ తో రొమాన్స్ చేసి, రజినీకాంత్ కు హ్యాండ్ ఇచ్చిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. కొన్ని కాంబోలతో సినిమాలే రాలేదు.ఈక్రమంలోనే కమల్ హాసన్‌తో జంటగా నటించిన కొంత మంది స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వారెవరో చూద్దాం.

1980లలో తమిళ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఊర్వశి, కమల్ హాసన్‌తో జంటగా మైఖేల్ మదన కామరాజన్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో కమల్ - ఊర్వశి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా సుందరి నీవు పాటలో ఇద్దరూ రొమాన్స్‌లో అదరగొట్టారు. ఇలా కమల్‌తో మాస్టర్ పీస్ సినిమాలో నటించిన ఊర్వశి, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు.
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ దేవయాని. 1990లలో వరుసగా హిట్ చిత్రాలు ఇచ్చి, స్టార్ హీరోయిన్ గా మారిన దేవయాని, కమల్ హాసన్‌తో కలిసి తెనాలి, పంచతంత్రం వంటి రెండు సినిమాల్లో నటించారు. కానీ ఆమె సూపర్ స్టార్‌తో ఒక్కసారి కూడా జతకట్టలేదు. రజనీతో నటించే అవకాశం రాలేదని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
1990లలో స్టార్ డమ్ సాధించిన హీరోయిన్లలో సుకన్య కూడా ఒకరు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సుకన్య, ఏ పాత్ర ఇచ్చినా దానిలో తన వంద శాతం ప్రతిభ చూపించేవారు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కు జంటగా నటించిన సుకన్య..కమల్ మాదిరిగానే ముసలి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. భారతీయుడు మాత్రమే కాదు కమల్‌తో మహానది సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాల్లో కమల్‌తో నటించిన సుకన్య, రజనీతో ఒక్కసారి కూడా నటించలేదు.
బాలీవుడ్ సినిమాల కోసం సౌత్ లో తెలుగు, తమిళ సినిమా అవకాశాలను వదిలేసిన హరోయిన్ అసిన్. సౌత్ లో బాలకృష్, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, అజిత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటించారు ఆసిన్. అదేవిధంగా ఆమె కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించిన సినిమాల్లో కమల్ హాసన్ దశావతారం కూడా ఒకటి. ఆ సినిమాలో కమల్‌కు జంటగా నటించిన అసిన్, ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే సినిమాలకు దూరమయ్యింది. దాంతో రజనీతో నటించే అవకాశం రాలేదు.
రజనీతో నటించే అవకాశం దక్కని మరో హీరోయిన్ స్నేహ. ఆమె కమల్ హాసన్‌తో కలిసి వసూల్ రాజా MBBS సినిమాలో నటించారు. అందులో ఆమె పోషించిన పప్పు పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఇంకా పార్తాలే పరవశం, పమ్మల్ కె. సాంబంధం వంటి చిత్రాలలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో కలిసి నటించిన స్నేహ ఒక్కసారి కూడా రజనీకాంత్ కు జోడీగా నటించలేదు.