MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Actress: చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ. 43,000 కోట్లకు మహారాణి.. ఈ చిన్నది ఎవరంటే.?

Actress: చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ. 43,000 కోట్లకు మహారాణి.. ఈ చిన్నది ఎవరంటే.?

Actress: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆస్తులు గురించి మీరు వినే ఉంటారు. తాజాగా అతడు బిలినీయర్ల లిస్టులోకి కూడా చేరారు. అయితే షారుఖ్‌కు కంటే అతడి హీరోయిన్ ఆస్తి మూడున్నర రెట్లు ఎక్కువ.. మరి ఆ హీరోయిన్ ఎవరో.? ఏ సినిమా చేసిందో ఇప్పుడు తెలుసుకుందామా..

2 Min read
Author : Pavithra D
| Updated : Oct 08 2025, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు..
Image Credit : Actress Gayatri Joshi Instagram

ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు..

సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవ లేదు. ప్రతీ సినిమాకు కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది. మీరు ఈ మధ్య చూసే ఉంటారు. మన టాలీవుడ్‌లోనే ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన నటీమణులు ఎందరో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం.. ఆమె చేసింది ఒక్క సినిమానే కానీ కోట్లకు యువరాణి. ఎంతలా అంటే.? బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఆస్తికి మూడింతలు.. మరి ఆమె ఎవరంటే.?

25
ఒకే ఒక్క సినిమా చేసిన నటి..
Image Credit : Actress Gayatri Joshi Instagram

ఒకే ఒక్క సినిమా చేసిన నటి..

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ గాయత్రి జోషి. ఈ పేరు టాలీవుడ్‌కు పెద్దగా పరిచయం లేదు. అలా అని బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా గుర్తులేని వ్యక్తే. ఎందుకంటే ఈమె బీ-టౌన్‌లో చేసింది ఒకే ఒక్క సినిమా. ఇక ఈమె భర్త గురించి చెప్పాలంటే.. పేరు వికాస్ ఒబెరాయ్.. బిజినెస్ ప్రపంచంలో టైకూన్ అని చెప్పొచ్చు. 2005లో వికాస్ ఒబెరాయ్‌ను గాయత్రి జోషి వివాహం చేసుకుంది.

Related Articles

Related image1
Telugu Cinema News Live: సీన్‌ సీన్‌కు ఉత్కంఠ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు, ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్
Related image2
Tollywood: ప్రపంచానికి తెలియని ఎంతో మంది ఉదయ్‌ కిరణ్‌లు.. నటీనటుల జీవితాల్లో ట్రాజెడీలకు కారణం ఏంటి.?
35
గాయత్రి జోషి వ్యక్తిగత విశేషాలు..
Image Credit : Actress Gayatri Joshi Instagram

గాయత్రి జోషి వ్యక్తిగత విశేషాలు..

1977, మార్చి 20న ముంబైలో జన్మించింది గాయత్రి జోషి. 48 ఏళ్ల ఆమె 2004లో 'స్వదేస్' అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి హీరో షారుఖ్ ఖాన్ కాగా.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించారు. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఆడకపోగా.. మ్యూజిక్ పరంగా హిట్ సాధించింది. ఇక 'స్వదేస్' సినిమా తర్వాత గాయత్రి జోషి.. ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఆ వెంటనే వికాష్ ఒబెరాయ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కాగా.. ప్రస్తుతం గాయత్రి తన కుటుంబాన్ని, భర్త వ్యాపారాలను చూసుకుంటోంది.

45
వికాస్ ఒబెరాయ్ ఫ్యామిలీ బిజినెస్
Image Credit : Actress Gayatri Joshi Instagram

వికాస్ ఒబెరాయ్ ఫ్యామిలీ బిజినెస్

ఇక వికాస్ ఒబెరాయ్ ఫ్యామిలీ బిజినెస్ విషయానికొస్తే.. ఇటీవల విడుదల చేసిన హురున్ రిచ్ లిస్టు 2025 ప్రకారం.. గాయత్రి జోషి భర్త వికాస్ ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ రూ. 42,960 కోట్లు (అంటే 4.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఈ లిస్టులో షారుఖ్ ఖాన్ కూడా ఉండగా.. అతడి నికర ఆస్తుల విలువ రూ. 12,490 కోట్లు(అంటే 1.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. దీని బట్టి చూస్తే.. షారుఖ్ కంటే.. అతడితో నటించి హీరోయిన్ భర్త ఆస్తుల వులువ మూడున్నర రెట్లు ఎక్కువ. ఈ లిస్టులో వికాస్ ఒబెరాయ్ 58వ స్థానంలో ఉన్నాడు.

55
ఒబెరాయ్ రియాల్టీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌
Image Credit : Actress Gayatri Joshi Instagram

ఒబెరాయ్ రియాల్టీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌

ఒబెరాయ్ రియాల్టీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు వికాస్ ఒబెరాయ్. 2005లో ఇదే కంపెనీకి ప్రమోటర్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు చైర్మన్‌గా ఎదిగారు. ముంబైలోని పలు ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. ఈ కంపెనీ వర్లి ఏరియాలో కట్టిన 360 వెస్ట్ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్ట్ ఇప్పటికీ దేశంలో ఓ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎంతోమంది బాలీవుడ్ నటులు అక్కడ నివాసముంటున్నారు. అక్కడ ఒక్కో ఫ్లాట్ సుమారు రూ. 45 కోట్లు పలుకుతుంది. లగ్జరీయస్ వెస్టిన్ హోటల్ కూడా వికాస్ ఒబెరాయ్ పేరు మీదే ఉండటం గమనార్హం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2: తల్లి కోసం బిడ్డని చంపుకోవడానికి దీప రెడీ , కార్తీక్ కి ఫ్యూజులు అవుట్.. ఏం చేశాడంటే
Recommended image2
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image3
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Related Stories
Recommended image1
Telugu Cinema News Live: సీన్‌ సీన్‌కు ఉత్కంఠ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లు, ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్
Recommended image2
Tollywood: ప్రపంచానికి తెలియని ఎంతో మంది ఉదయ్‌ కిరణ్‌లు.. నటీనటుల జీవితాల్లో ట్రాజెడీలకు కారణం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved