MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కుల్దీప్ దూకుడు.. హోప్, క్యాంప్‌బెల్ పోరాటంతో వెస్టిండీస్ కౌంటర్ అటాక్

కుల్దీప్ దూకుడు.. హోప్, క్యాంప్‌బెల్ పోరాటంతో వెస్టిండీస్ కౌంటర్ అటాక్

India vs West Indies : ఫాలోఆన్ తర్వాత వెస్టిండీస్ కౌంటర్ అటాక్ కు దిగింది. జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్ హాఫ్ సెంచరీలో భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో కుల్దీప్ 5 వికెట్లు తీసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 12 2025, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్‌పై వెస్టిండీస్ పోరాటం
Image Credit : instagram/indiancricketteam

భారత్‌పై వెస్టిండీస్ పోరాటం

ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. ఫాలోఆన్ ఆడుతూ వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (87* పరుగులు), షాయ్ హోప్ (66* పరుగులు) హాఫ్ సెంచరీలతో నాటౌట్‌గా నిలిచి తమ జట్టుకు విలువైన 138 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రస్తుతం భారత్ స్కోరును చేరడానికి వెస్టిండీస్ కు 97 పరుగులు అవసరం.

25
ఢిల్లీ టెస్టులో భారత్ ఆధిపత్యం
Image Credit : Insta/indiancricketteam

ఢిల్లీ టెస్టులో భారత్ ఆధిపత్యం

ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 518/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. గిల్ నాయకత్వంలోని భారత బ్యాటర్లు సత్తా చాటారు.

ఆ తర్వాత, భారత బౌలర్లు కూడా అదరగొట్టడంతో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. కేవలం 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి విండీస్ ను దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించడంతో విండీస్ ఫాలోఆన్ కు దిగింది.

Related Articles

Related image1
SA vs NAM : సౌతాఫ్రికాకు షాక్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో నమీబియా కొత్త చరిత్ర
Related image2
IND vs WI: యశస్వి జైస్వాల్ రనౌట్ కు శుభ్‌మన్ గిల్ కారణమా?
35
భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న హోప్, క్యాంప్‌బెల్
Image Credit : X/windiescricket

భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న హోప్, క్యాంప్‌బెల్

ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ప్రారంభంలోనే 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తేజ్ నారాయణ్ చందర్ పాల్ (10) సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, అలిక్ అథనేజ్ (7) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు.

వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన క్యాంప్‌బెల్, షాయ్ హోప్ విండీస్ ను కాపాడారు. ఇద్దరూ స్థిరంగా ఆడి, భారత బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. స్టంప్స్ సమయానికి ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి నాటౌట్ గా నిలిచారు. క్యాంప్‌బెల్ 9 బౌండరీలు, 2 సిక్స్‌లతో 87 పరుగులు చేయగా, షాయ్ హోప్ 8 బౌండరీలు, 2 సిక్స్‌లతో 66 పరుగులతో క్రీజులో ఉన్నారు.

45
భారత బౌలర్ల వికెట్ల వేట
Image Credit : BCCI

భారత బౌలర్ల వికెట్ల వేట

మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత బౌలర్లు విండిస్ రెండో ఇన్నింగ్స్ లో ప్రభావం చూపలేకపోయారు. మూడో రోజు చివరి సెషన్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. కుల్దీప్ యాదవ్, బుమ్రా, సుందర్, రవీంద్ర జడేజా.. అందరూ ప్రయత్నించినా వికెట్ దక్కలేదు. ఫాలోఆన్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

వికెట్ల కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ మార్పులతో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, మూడో రోజు క్యాంప్‌బెల్-హోప్ జోడీని విడదీయలేకపోయారు. దీంతో నాలుగో రోజు కూడా భారత్ బౌలింగ్ కొనసాగుతుంది.

55
ఐదు వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్
Image Credit : X

ఐదు వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్

వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌ను కుల్దీప్ యాదవ్ కూల్చాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఐదోసారి 5 వికెట్లను సాధించాడు. కీలకమైన షాయ్ హోప్ (36), తేవిన్ ఇమ్లాక్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17) వికెట్లను తీశాడు.

హోప్, క్యాంప్‌బెల్ జంట ఎలా ఆడతారనేది మ్యాచ్ దిశను నిర్ణయిస్తుంది. నాలుగో రోజు భారత బౌలర్లు ప్రభావం చూపకపోతే ఫలితం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భారత్ బౌలర్లకు ఇది సవాలు కానుంది. కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండగా, హోప్-క్యాంప్‌బెల్ జోడీ భారత బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
SA vs NAM : సౌతాఫ్రికాకు షాక్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో నమీబియా కొత్త చరిత్ర
Recommended image2
IND vs WI: యశస్వి జైస్వాల్ రనౌట్ కు శుభ్‌మన్ గిల్ కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved