MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi : విధ్వంసానికి మరో పేరే వైభవ్ సూర్యవంశీ ! ఇదేం బాదుడు సామీ !

Vaibhav Sooryavanshi : విధ్వంసానికి మరో పేరే వైభవ్ సూర్యవంశీ ! ఇదేం బాదుడు సామీ !

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలనంగా మారాడు. దుమ్మురేపే ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డులు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 11 2026, 12:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైభవ్ సూర్యవంశీ పరుగుల విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే !
Image Credit : X

వైభవ్ సూర్యవంశీ పరుగుల విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే !

వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన 16వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంచిన 202 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ స్టేడియంను హోరెత్తించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 కళ్లు చెదిరే సిక్సర్లు ఉండటం విశేషం.

25
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వైభవ్ రికార్డుల వేట !
Image Credit : ANI

15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వైభవ్ రికార్డుల వేట !

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్ (14 బంతులు) తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు, ఐపీఎల్‌లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు (3 సార్లు) యాభై పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ వైభవ్ చోటు సంపాదించాడు. అతని ఈ మెరుపు దాడికి బెంగళూరు బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు.

Related Articles

Related image1
అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 భారత స్పిన్నర్లు ఎవరో తెలుసా?
Related image2
Vaibhav Sooryavanshi : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు.. కోహ్లీ రికార్డుకు ఎసరు!
35
స్టార్ బౌలర్లను వణికించిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : X/rajasthanroyals

స్టార్ బౌలర్లను వణికించిన వైభవ్ సూర్యవంశీ

జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వైభవ్ ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 4, 4, 6 బాది హాజిల్‌వుడ్‌కే చుక్కలు చూపించాడు. కేవలం హాజిల్‌వుడ్ మాత్రమే కాదు, భువనేశ్వర్ కుమార్ వేసిన 5వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తీరు అద్భుతం. పవర్‌ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోరును 97 పరుగులకు చేర్చడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.

45
ధ్రువ్ జురెల్‌తో వైభవ్ రికార్డు భాగస్వామ్యం
Image Credit : X/rajasthanroyals

ధ్రువ్ జురెల్‌తో వైభవ్ రికార్డు భాగస్వామ్యం

ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, వైభవ్ ఏమాత్రం తగ్గలేదు. ధ్రువ్ జురెల్‌తో కలిసి రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ ఐపీఎల్‌లో అత్యధిక రన్ రేట్‌తో (17.51) 100 కంటే ఎక్కువ పరుగులు జోడించిన భాగస్వామ్యాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ వేసిన 8వ ఓవర్లో వైభవ్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

55
వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్
Image Credit : BCCI

వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్

అద్భుతమైన ఫామ్‌లో ఉండి సెంచరీ వైపు దూసుకెళ్తున్న వైభవ్, కృనాల్ పాండ్యా వేసిన 9వ ఓవర్ మొదటి బంతికే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ, అతను చేసిన 78 పరుగుల విధ్వంసంతో రాజస్థాన్ విజయాన్ని అందుకోవడం ఈజీగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
SRH: ధోని కంబ్యాక్.! హైదరాబాద్ జట్టుకు రెండు గుడ్‌న్యూస్‌లు.. అవేంటంటే.?
Recommended image2
Mumbai Indians: ప్రపంచకప్ హీరో.. ఐపీఎల్‌లో జీరో.? బుమ్రా పేలవ ప్రదర్శన వెనుక షాకింగ్ నిజాలు!
Recommended image3
Vaibhav Suryavanshi: అరె బుడ్డోడా.! ఇలా వేస్తే చాలు డకౌట్ అయిపోతావ్.. వీక్‌నెస్ తెలిసిపోయిందిగా..
Related Stories
Recommended image1
అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 భారత స్పిన్నర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Vaibhav Sooryavanshi : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు.. కోహ్లీ రికార్డుకు ఎసరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved