MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Fastest Fifties In Test: టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు బాదిన టాప్-5 భారత ప్లేయ‌ర్లు

Fastest Fifties In Test: టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు బాదిన టాప్-5 భారత ప్లేయ‌ర్లు

Fastest Fifties In Test: టెస్టు క్రికెట్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లు ఆడిన భార‌త బ్యాట‌ర్లు చాలా మంది ఉన్నారు. అయితే, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 03 2025, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు ఇవే
Image Credit : ANI

టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీలు ఇవే

భార‌త్ లో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు.. టెస్టు, వ‌న్డే, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే భార‌త్ లో చాలా మంది క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు. అయితే, క్రికెట్ లో టెస్టు మ్యాచ్ లు ప్ర‌త్యేకం అని చెప్పాలి. ప్రతీ మ్యాచ్‌లో కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి.

టెస్ట్ క్రికెట్‌లో సాధారణంగా ఆట సమయం ఎక్కువగా ఉండేలా కనిపించినా, కొంతమంది భారత బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ఆట‌తో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీల‌ను కూడా బాదారు. వారిలో లెజెండ‌రీ ప్లేయ‌ర్ల నుంచి ప్ర‌స్తుతం ఆడుతున్న యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు.

DID YOU
KNOW
?
టెస్టుల్లో 2 ట్రిపుల్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్
భారత క్రికెట్ చరిత్రలో రెండు ట్రిపుల్ సెంచరీలను వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కరే సాధించారు. మొత్తంగా ట్రిపుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు ఇద్దరే. వారిలో ఒకరు సెహ్వాగ్ (పాకిస్తాన్ పై ఒకటి 2004, సౌతాఫ్రికాపై రెండోది 2008) కాగా, మరొకరు కరుణ్ నాయర్ (ఇంగ్లాండ్ పై 2016లో).
26
1. రిషబ్ పంత్
Image Credit : Getty

1. రిషబ్ పంత్

భారత వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. రిష‌బ్ పంత్ టెస్టు క్రికెట్ లో అనేక అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025 లో కూడా దుమ్మురేపే బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. అయితే, మాంచెస్ట‌ర్ లో గాయం కార‌ణంగా ఓవ‌ల్ టెస్టుకు దూరం అయ్యాడు.

రిష‌బ్ పంత్ 2022లో శ్రీలంకపై ఆడిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఆ తర్వాత 2025లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ లోనూ పంత్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇవి టెస్ట్ ఫార్మాట్‌లో సాధించిన వేగవంతమైన హాఫ్ సెంచ‌రీల‌లో ఒకటిగా నిలిచాయి.

Related Articles

Related image1
IND vs ENG: ఇదెక్క‌డి మాస్ బ్యాటింగ్ సామీ.. ఐదు టెస్టుల్లో 20 సెంచ‌రీలు
Related image2
T20 Double Century: 300+ స్ట్రైక్ రేట్‌తో సునామీ.. టీ20లో డబుల్ సెంచరీలు కొట్టే టాప్ 5 ప్లేయ‌ర్లు వీరే
36
2. కపిల్ దేవ్
Image Credit : Getty

2. కపిల్ దేవ్

భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్, స్టార్ ఆల్ రౌండ‌ర్ క‌పిల్ దేవ్ టీమిండియాకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు. భార‌త్ కు తొలి ప్ర‌పంచ క‌ప్ ను అందించారు. ఎంతో మంది క్రికెట‌ర్ల‌కు ఆదర్శంగా నిలిచారు. 

భారత క్రికెట్‌కు పునాది వేసిన గొప్ప ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1982 లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆయన కేవ‌లం 30 బంతుల్లో 50 పరుగుల నాక్ ఆడారు. మొత్తంగా 53 బంతుల్లో 73 పరుగుల ఇన్నింగ్స్ తో భార‌త్ ను పోటీలో బ‌లంగా నిలబెట్టారు.

46
3. శార్దూల్ ఠాకూర్
Image Credit : Getty

3. శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అత‌ను 31 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించారు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 36 బంతుల్లో 57 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. శార్దూల్ ఠాకూర్ స్ట్రైక్ రేట్ టెస్ట్‌కి అసాధారణంగా ఉండ‌టం విశేషం.

56
4. యశ‌స్వి జైస్వాల్
Image Credit : Getty

4. యశ‌స్వి జైస్వాల్

టీమిండియా యంగ్ సెన్సేషన్ య‌శ‌స్వి జైస్వాల్ దుమ్మురేపే ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. భ‌యంలేని బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించే సునామీ ఇన్నింగ్స్ ల‌ను ఆడుతున్నాడు. 2024లో సూప‌ర్ నాక్ తో మెరిశాడు.

జైస్వాల్ తనదైన శైలిలో 2024లో బంగ్లాదేశ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 31 బంతుల్లో 50 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు. మొత్తం 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్ తో భార‌త్ బ‌లంగా నిలిచింది.

జైస్వాల్ ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస వికెట్లు ప‌డుతున్న క్ర‌మంలో ఓవ‌ల్ లో ఎంతో విలువైన ప‌రుగులతో సెంచ‌రీ బాదాడు.

66
5. వీరేంద్ర సెహ్వాగ్
Image Credit : Getty

5. వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్ లో ఉన్నాడంటే చాలు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ ఎవ‌రైనా స‌రే చెడుగుడు ఆడుకుంటారు. సునామీ బ్యాటింగ్ తో ఉన్నంత సేపు ప‌రుగుల వ‌ర్షం కురిపిస్తారు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ల‌తో భార‌త్ కు అనేక విజ‌యాలు అందించారు.

2008లో ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన టెస్ట్‌లో 32 బంతుల్లోనే సెహ్వాగ్ హాఫ్ సెంచ‌రీ సాధించారు. మొత్తంగా 68 బంతుల్లో 83 పరుగులు నాక్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీరు టెస్ట్ క్రికెట్‌ను కూడా వన్‌డేలా మార్చే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
IND vs ENG: ఇదెక్క‌డి మాస్ బ్యాటింగ్ సామీ.. ఐదు టెస్టుల్లో 20 సెంచ‌రీలు
Recommended image2
T20 Double Century: 300+ స్ట్రైక్ రేట్‌తో సునామీ.. టీ20లో డబుల్ సెంచరీలు కొట్టే టాప్ 5 ప్లేయ‌ర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved