MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 517 పరుగులు.. ఎవరూ ఊహించివుండరు.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు

517 పరుగులు.. ఎవరూ ఊహించివుండరు.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు

T20 World Record : సౌతాఫ్రికా vs వెస్టిండీస్ మధ్య 2023లో జరిగిన టీ20 మ్యాచ్ లో 517 పరుగుల అద్భుత రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు మ్యాచ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 క్రికెట్ లో 517 పరుగుల రికార్డులు
Image Credit : Instagram/romarioshepherd

టీ20 క్రికెట్ లో 517 పరుగుల రికార్డులు

టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 517 పరుగులు సాధించడం అసాధ్యం అనిపించే విషయం. కేవలం 120 బంతుల మ్యాచ్ లో ఇంత భారీ స్కోరు రావడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2023 మార్చి 26న సెంచూరియన్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా - వెస్టిండీస్ టీ20 మ్యాచ్ లో ఈ పరుగుల రికార్డు సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు మొత్తం 46 ఫోర్లు, 35 భారీ సిక్సర్లు బాదారు.

25
వెస్టిండీస్ సునామీ బ్యాటింగ్ తో భారీ స్కోర్
Image Credit : our own

వెస్టిండీస్ సునామీ బ్యాటింగ్ తో భారీ స్కోర్

ఈ మ్యాచ్ లో మొదట ధనాధన్ బ్యాటింగ్ తో వెస్టిండీస్ అదరగొట్టింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్సన్ చార్ల్స్ కేవలం 46 బంతుల్లో 118 పరుగుల సెంచరీ నాక్ ఆడాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. 

కైల్ మేయర్స్ 27 బంతుల్లో 51 పరుగులు చేసి 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రొమారియో షెపర్డ్ సునామీ బ్యాటింగ్ తో కేవలం 18 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. మొత్తం వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్సర్లు వచ్చాయి. దీంతో భారీ స్కోర్ చేసింది.

Related Articles

Related image1
టీమిండియా: ఆసియా కప్‌లో 5 అద్భుత రికార్డులు
Related image2
క్రికెట్ నా క్లాస్‌రూం.. బ్రియాన్ లారా పాఠాలే నన్ను మార్చాయి.. బైజూస్ రవీంద్రన్ ఇన్స్పైరింగ్ స్టోరీ
35
బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బ్యాటర్లు
Image Credit : Getty

బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బ్యాటర్లు

వెస్టిండీస్ బ్యాటర్లు ఒకరికి మించి ఒకరు అద్భుతంగా ఆడారు. సౌతాఫ్రికా బౌలింగ్ ను దంచికొట్టారు. వెస్టిండీస్ బ్యాటర్ల ముదు ప్రోటీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. జాన్సన్ చార్ల్స్ స్ట్రైక్‌రేట్ 256.52 ఉండగా, కైల్ మేయర్స్ 188.88 స్ట్రైక్‌రేట్‌తో తన ఆటను కొనసాగించారు. రొమారియో షెపర్డ్ కూడా 227 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ఈ బ్యాటింగ్ దాడి ముందు సౌతాఫ్రికా బౌలర్ల వ్యూహాలు ఫలించలేదు.

45
అసాధ్యం అనుకున్న టార్గెట్
Image Credit : Getty

అసాధ్యం అనుకున్న టార్గెట్

259 పరుగుల టార్గెట్‌ని ఏ టీమ్ కూడా అంతకుముందు ఛేజ్ చేయలేదు. అందుకే వెస్టిండీస్ ఆటగాళ్లు తమ విజయాన్ని ఖాయం చేసుకున్నట్టే భావించారు. కానీ సౌతాఫ్రికా బ్యాటర్లు రికార్డులను బద్దలు కొట్టారు. అసాధ్యం అనుకున్న రికార్డు విజయాన్ని సుసాధ్యం చేశారు. సూపర్ విక్టరీ కొట్టి సంచలనం రేపారు.

55
టీ20 క్రికెట్ లో సౌతాఫ్రికా ప్రపంచ రికార్డు
Image Credit : Getty

టీ20 క్రికెట్ లో సౌతాఫ్రికా ప్రపంచ రికార్డు

సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇది టీ20 ఇంటర్నేషనల్‌లో అప్పటివరకు జరిగిన అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 13 సిక్సర్లు వచ్చాయి. 

క్వింటన్ డికాక్ 100 పరుగులు, రీజా 68 పరుగులు, ఐడెన్ మార్క్రామ్ 38 పరుగుల సునామీ నాక్ లు ఆడారు. మొత్తం మ్యాచ్‌లో 517 పరుగులతో టీ20 చరిత్రలో రికార్డుల మోత మోగించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
టీమిండియా: ఆసియా కప్‌లో 5 అద్భుత రికార్డులు
Recommended image2
క్రికెట్ నా క్లాస్‌రూం.. బ్రియాన్ లారా పాఠాలే నన్ను మార్చాయి.. బైజూస్ రవీంద్రన్ ఇన్స్పైరింగ్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved