MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rinku Singh: రింకూ సింగ్-ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఫోటోలు చూశారా

Rinku Singh: రింకూ సింగ్-ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఫోటోలు చూశారా

Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం లక్నోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 09 2025, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం
Image Credit : ANI

రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం

Rinku Singh and Priya Saroj : భారత క్రికెట్ జట్టు స్టార్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. లక్నో నగరంలోని 5 స్టార్ హోటల్ ‘ది సెంట్రమ్’ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

25
చేతులు పట్టుకుని స్టేజీ పైకి వచ్చిన రింకూ సింగ్, ప్రియా సరోజ్
Image Credit : X

చేతులు పట్టుకుని స్టేజీ పైకి వచ్చిన రింకూ సింగ్, ప్రియా సరోజ్

రింకూ, ప్రియా నిశ్చితార్థ వేడుకలో ఒకరినొకరు చేతులు పట్టుకుని స్టేజీ పైకి వచ్చారు. ఆ తర్వాత రింకూ సింగ్ ప్రియకు నిశ్చితార్థం రింగ్ పెట్టగా, ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో రింకూ ఆమెను ఓదార్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
odi debut century: వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరు?
Related image2
Team India: రోహిత్ భాయ్.. చాలా మిస్ అవుతున్నాం.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్
35
లైట్ పింక్ కలర్ లెహంగా చున్నీలో ప్రియా సరోజ్
Image Credit : X

లైట్ పింక్ కలర్ లెహంగా చున్నీలో ప్రియా సరోజ్

నిశ్చితార్థ వేడుకలో ప్రియా సరోజ్ లైట్ పింక్ కలర్ లెహంగా చున్నీ ధరించగా, రింకూ క్రీమ్ కలర్ షేర్వానీలో దర్శనమిచ్చారు. ఈ జంట అద్భుతంగా కనిపించగా, ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ జంట ఆకర్షించింది.

45
రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం వేడుకలో మెరిసిన ప్రముఖులు
Image Credit : X

రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం వేడుకలో మెరిసిన ప్రముఖులు

ఈ వేడుకలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ఎంపీ ఇక్రా హసన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దాదాపు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 300 మంది గౌరవ అతిథులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయగా, వీటిలో బార్కోడ్ స్కానింగ్ వ్యవస్థను అమలు చేశారు.

55
రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Image Credit : Twitter

రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

సురక్షిత వాతావరణం కోసం హోటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 గదులు ముందుగానే బుక్ చేయగా, వాటిలో 5 గదులు రింకూ సింగ్ స్నేహితుల కోసం కేటాయించారు.

ఈ వేడుకకు ముందు రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి వాలీ ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా, ప్రియా, రింకూ సింగ్ లు నవంబర్ 2025లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
odi debut century: వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరు?
Recommended image2
Team India: రోహిత్ భాయ్.. చాలా మిస్ అవుతున్నాం.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved