MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RCB: ప్రత్యర్థి ఎవరైనా సరే ఆర్సీబీదే ఐపీఎల్ 2025 టైటిల్ !

RCB: ప్రత్యర్థి ఎవరైనా సరే ఆర్సీబీదే ఐపీఎల్ 2025 టైటిల్ !

RCB: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై విక్టరీతో ఆర్సీబీ ఫైనల్ లోకి ప్రవేశించింది. అయితే, ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందని ఒక లెజెండరీ ప్లేయర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 29 2025, 11:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
Image Credit : Getty

ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ఆర్‌సీబీ గెలుస్తుందని లెజెండరీ క్రికెటర్ ఖచ్చితంగా చెప్పారు. ఆర్‌సీబీ కప్ ఎందుకు గెలుస్తుందో కారణాలను కూడా వివరించారు.

25
IPL 2025 ఫైనల్లో ఆర్సీబీదే గెలుపు !
Image Credit : ANI

IPL 2025 ఫైనల్లో ఆర్సీబీదే గెలుపు !

ఆస్ట్రేలియా జట్టు సీనియర్ ఆటగాడు, లెజెండరీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఐపీఎల్ 2025 విజేతగా ఎవరు నిలుస్తారో చెప్పారు. షేన్ వాట్సన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఐపీఎల్ 2025 విజేత ఎవరో నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నా. నా దృష్టిలో ఆర్సీబీ ఛాంపియన్ అవుతుంది. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారు" అని షేన్ వాట్సన్ అన్నారు.

Related Articles

Related image1
IPL : ఐపీఎల్‌లో 40,000+ పరుగులు చేసిన టాప్ 3 జట్లు ఇవే!
Related image2
PBKS vs RCB: పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
35
సూపర్ ఫామ్ లో ఆర్సీబీ
Image Credit : Getty

సూపర్ ఫామ్ లో ఆర్సీబీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ సూపర్ ఫామ్ లో ఉంది. ఐపీఎల్ 2025 లో మంచి ఆరంభం తర్వాత  ద్వితీయార్థంలో కొన్ని కఠినమైన మ్యాచ్‌లను ఎదుర్కొంది. విరాట్ కోహ్లీకి తోడుగా ఇప్పుడు జోష్ హేజిల్ వుడ్ తిరిగి జట్టులోకి రావడంతో ఈ సంవత్సరం ఆర్సీబీ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉందని వాట్సన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

45
IPL 2025 ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ !
Image Credit : ANI

IPL 2025 ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ !

ఫైనల్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారని షేన్ వాట్సన్ అన్నారు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 60.20 సగటుతో 602 పరుగులు చేశారు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాబట్టి ఫైనల్లో విరాట్ కోహ్లీ అదరగొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో బిగ్ ఇన్నింగ్స్ వస్తుందని చెప్పారు.

55
9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ
Image Credit : Getty

9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరిసారిగా 2016లో ఐపీఎల్ ఫైనల్ ఆడింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఫైనల్ ఆడనుంది. జూన్ 3న 18వ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాకిస్థాన్ డిమాండ్లను ఐసీసీ తిరస్కరించినా నఖ్వీ ఎందుకు నవ్వుతున్నాడు?
Recommended image2
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image3
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Related Stories
Recommended image1
IPL : ఐపీఎల్‌లో 40,000+ పరుగులు చేసిన టాప్ 3 జట్లు ఇవే!
Recommended image2
PBKS vs RCB: పంజాబ్ పై ఈజీ విక్టరీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరిన ఆర్సీబీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved