MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ కెరీర్ కు ఎండ్ కార్డు పడినట్టేనా?

వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ కెరీర్ కు ఎండ్ కార్డు పడినట్టేనా?

Mohammed Shami : ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పై టీమిండియా స్టార్ పేసర్ మమ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “నేను రంజీ ఆడగలిగితే వన్డేలు ఎందుకు ఆడలేను” అంటూ బీసీసీఐ తీరుపై హాట్ కామెంట్స్ చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 15 2025, 06:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత జట్టు నుంచి షమీ అవుట్ పై వివాదం
Image Credit : Getty

భారత జట్టు నుంచి షమీ అవుట్ పై వివాదం

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై చర్చలు జరుగుతుండగా, షమీని తప్పించడంపై మొదట పెద్దగా చర్చ రాలేదు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా స్పందిస్తూ బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

26
ఫిట్నెస్‌ ఇష్యూ ఉంటే నేను రంజీ ఎందుకు ఆడతాను? : షమీ
Image Credit : Instagram/mdshami.11

ఫిట్నెస్‌ ఇష్యూ ఉంటే నేను రంజీ ఎందుకు ఆడతాను? : షమీ

ఈడెన్ గార్డెన్స్‌లో రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన షమీ.. “నేను ఎన్నోసార్లు చెప్పాను, సెలక్షన్ నా చేతుల్లో ఉండదు. ఫిట్నెస్ సమస్య ఉంటే నేను ఇక్కడ బెంగాల్‌ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుంది. నేను నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగితే, 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను” అని అన్నారు.

ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా బీసీసీఐ నిర్ణయంపై అసహనాన్ని సూచిస్తున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “షమీ ఫిట్నెస్‌పై ఎటువంటి తాజా సమాచారం లభించలేదని” చెప్పారు. దీనికి షమీ సమాధానంగా తన ఫిట్నెస్‌ను రంజీ ట్రోఫీలో పాల్గొనడంతో నిరూపిస్తున్నానని తెలిపారు.

Related Articles

Related image1
ఢిల్లీలో టీమిండియా ఐదు సూపర్ రికార్డులు
Related image2
నో షేక్ హ్యాండ్ వివాదం : భారత్–పాక్ హాకీ ఆటగాళ్ల మధ్య హై ఫైవ్
36
ఫిట్నెస్ అప్‌డేట్ ఇవ్వడం పై బీసీసీఐకి బాధ్యత లేదా?
Image Credit : X/Vishal.

ఫిట్నెస్ అప్‌డేట్ ఇవ్వడం పై బీసీసీఐకి బాధ్యత లేదా?

అలాగే, షమీ తన ఫిట్ నెస్ అప్డేట్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎవరికి ఫిట్నెస్ అప్‌డేట్ ఇవ్వాలి, ఎవరు అడగాలి అన్నది నా బాధ్యత కాదు. నా పని నేషనల్ క్రికెట్ అకాడమీ వెళ్లి ప్రాక్టీస్ చేయడం, మ్యాచ్‌లు ఆడడం. ఎవరు ఎవరికి అప్‌డేట్ ఇస్తారు అనేది నా పని కాదు” అని మరోసారి అన్నారు.

2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో షమీ అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత గొంతు, కాలి గాయాల కారణంగా సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక కాలేదు.

46
షమీ చివరి సారి భారత జట్టుకుకు ఎప్పుడు ఆడాడు?
Image Credit : Getty

షమీ చివరి సారి భారత జట్టుకుకు ఎప్పుడు ఆడాడు?

షమీ చివరిసారి మార్చ్ 2025లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడారు. ఆ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తితో కలిసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు.

56
జట్టులోకి ఎంపిక అనేది మీ నిర్ణయం, నేను మ్యాచ్‌లు ఆడుతూనే ఉంటాను : షమీ
Image Credit : ANI

జట్టులోకి ఎంపిక అనేది మీ నిర్ణయం, నేను మ్యాచ్‌లు ఆడుతూనే ఉంటాను : షమీ

సీనియర్ బౌలర్‌గా తన బాధ్యతను వివరించిన షమీ.. “సెలక్షన్ నా చేతుల్లో లేదు. నేను చేయగలిగేది ప్రాక్టీస్ చేసి, మ్యాచ్‌లు ఆడడం మాత్రమే. మీరు నన్ను ఎంపిక చేయకపోతే నేను బెంగాల్ కోసం ఆడతాను, నాకు దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు” అని తెలిపాడు.

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని ఆయన అన్నారు. “దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. గెలుపు దేశానికే చెందాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

66
షమీ ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నాడు: బెంగాల్ కోచ్
Image Credit : Getty

షమీ ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నాడు: బెంగాల్ కోచ్

బెంగాల్ జట్టు కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా షమీ ఫిట్నెస్‌పై స్పందించారు. అతను ఇప్పుడు మరిత ఫిట్ గా ఉన్నారని తెలిపాడు. “గత సంవత్సరం శస్త్రచికిత్స తర్వాత కొంత ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు, సాఫీగా  పరుగెత్తుతున్నారు. గత ఏడాదికంటే ఈసారి మరింత ఫిట్‌గా ఉన్నారు” అని రతన్ శుక్లా తిలపారు.

అయితే, భారత జట్టులో స్థానం దక్కకపోవడం పట్ల షమీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నాననీ, ఆడగలననీ తెలిపాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయం పై అంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. భారత జట్టుకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన ఈ సీనియర్ బౌలర్ తన ఫిట్నెస్, పట్టుదలతో మరోసారి రీ-ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. అయితే, ప్రస్తుతం యంగ్ బౌలర్లతో పోటీ పడుతూ మళ్లీ భారత జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే షమీ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డు పడే అవకాశాలున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?
Recommended image2
24 గంటల్లో 4గురు అవుట్.! టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్లకు టెన్షన్.. టెన్షన్..
Recommended image3
ఎవడు మమ్మీ వీడు.! కేవలం 44 బంతుల్లోనే కాటేరమ్మ కొడుకు రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఎవరంటే.?
Related Stories
Recommended image1
ఢిల్లీలో టీమిండియా ఐదు సూపర్ రికార్డులు
Recommended image2
నో షేక్ హ్యాండ్ వివాదం : భారత్–పాక్ హాకీ ఆటగాళ్ల మధ్య హై ఫైవ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved