MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: లీడ్స్ లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul: లీడ్స్ లో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్

KL Rahul: లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. ఇది తనకు 9వ టెస్టు సెంచరీ.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 23 2025, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ సెంచరీ
Image Credit : ANI

ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ సెంచరీ

KL Rahul hits ninth Test century : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాల్గవ రోజు కేఎల్ రాహుల్ తన 9వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టుకు బలమైన పునాది వేశాడు. ఇది రాహుల్‌కు సుమారు 18 నెలల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం విశేషం.

26
కేఎల్ రాహుల్ అసాధారణ ఇన్నింగ్స్
Image Credit : X/BCCI

కేఎల్ రాహుల్ అసాధారణ ఇన్నింగ్స్

భారత జట్టు నాల్గవ రోజు ఉదయం శుభ్ మన్ గిల్ వికెట్ ను త్వరగా కోల్పోయింది. కేల్ రాహుల్ - రిషభ్ పంత్ జోడి సమయోచితంగా ఆడి జట్టును నిలబెట్టింది. రాహుల్ తన సెంచరీని 202 బంతుల్లో 13 బౌండరీలతో పూర్తి చేశాడు.

కేఎల్ రాహుల్ సెంచరీ షోయబ్ బషీర్ వేసిన 62వ ఓవర్‌లో వచ్చింది. కేఎల్ రాహుల్ కు ఇది మూడో ఇంగ్లాండ్ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కు ఇది ఎనిమిదవ సెంచరీ.

Related Articles

Related image1
IND vs ENG: హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్.. బుమ్రాకు 5 వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్
Related image2
BCCI: బెంగళూరు తొక్కిసలాట.. బీసీసీఐ కఠిన చర్యలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి
36
మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కోల్పోయిన కేఎల్ రాహుల్
Image Credit : X/BCCI

మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కోల్పోయిన కేఎల్ రాహుల్

మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ మంచి టచ్ లో కనిపించాడు. అయితే, 42 పరుగుల వద్ద అవుటయ్యాడు. బ్రైడన్ కార్స్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి, కీపర్‌కు క్యాచ్ గా దొరికిపోయాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో అతను మరింత పట్టుదలతో ఆడి ఈసారి తన అవకాశాన్ని వృథా చేయలేదు. సెంచరీతో కదం తొక్కాడు.

46
గిల్ ఔట్ అయిన తర్వాత రాహుల్, పంత్ ఇన్నింగ్స్ లతో నిలబడిన భారత్
Image Credit : X/BCCI

గిల్ ఔట్ అయిన తర్వాత రాహుల్, పంత్ ఇన్నింగ్స్ లతో నిలబడిన భారత్

భారత్ జట్టు నాల్గవ రోజు ఆట ప్రారంభించిన 7 బంతులకే కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్స్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని గిల్ స్టంప్స్‌కి ఆడడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది.

అయితే వెంటనే వచ్చిన రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌కు తోడుగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదర్కొన్నాడు. వారి మధ్య ముప్పై ఓవర్లకు పైగా భాగస్వామ్యం కొనసాగింది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. 118 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్ లో పంత్ 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 

56
కేఎల్ రాహుల్ పై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
Image Credit : X/BCCI

కేఎల్ రాహుల్ పై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

కేఎల్ రాహుల్ సెంచరీ తర్వాత క్రికెట్ దిగ్గజాల నుంచి కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, “రాహుల్ అసాధారణ ఆటగాడు. తన సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీయలేదు. శాంతమైన వూహాశక్తితో ఆడుతున్నాడు” అని పేర్కొన్నారు.

నాసర్ హుస్సేన్ రాహుల్ సెంచరీపై స్పందిస్తూ, “అత్యుత్తమ స్థాయి ఆటగాడు ఇచ్చిన అద్భుత ప్రదర్శన. తప్పకుండా గొప్ప గౌరవం లభించిన క్షణం ఇది” అని చెప్పారు. మైకల్ అథర్టన్ రాహుల్ శతకాన్ని "అద్భుత కవర్ డ్రైవ్‌తో" వచ్చిందని కొనియాడారు.

రాహుల్ సెంచరీ పూర్తయినప్పుడు కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇది ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి నిదర్శనం.

66
ఇంగ్లాండ్‌కు భారీ లక్ష్యం ఉంచే దిశగా భారత్
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్‌కు భారీ లక్ష్యం ఉంచే దిశగా భారత్

కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ లంచ్ సమయానికి మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. అప్పటికి భారత్ 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. లీడ్స్ పిచ్ అధికంగా క్షీణించకపోవడంతో, భారత్ 400 పరుగులకుపైగా లక్ష్యం ఇవ్వాలని చూస్తోంది. కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలతో ప్రస్తుతం భారత్ 303 పరుగులు ఆధిక్యంతో ఆటను కొనసాగిస్తోంది.

రోహిత్ శర్మ గాయంతో టెస్టుల నుంచి తప్పుకోవడం, ఆసీస్‌తో పెర్త్ టెస్టులో రాహుల్ కు ఓపెనింగ్ చేయడానికి అవకాశం దొరికింది. మెల్బోర్న్ టెస్టులో రోహిత్ తిరిగి వచ్చినప్పటికీ, అతని రిటైర్మెంట్ తర్వాత రాహుల్ మరోసారి ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.

ప్రస్తుతం భారత్ 298/4 (74.1 ఓవర్లు) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో కేఎల్ రాహుల్ 120 పరుగులు, కరుణ్ నాయర్ 4 పరుగులతో ఆడుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
IND vs ENG: హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్.. బుమ్రాకు 5 వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్
Recommended image2
BCCI: బెంగళూరు తొక్కిసలాట.. బీసీసీఐ కఠిన చర్యలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved