MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుదల.. జూన్ 3 ఫైనల్.. ఎప్ప‌టి నుంచి ప్రారంభమంటే?

IPL: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుదల.. జూన్ 3 ఫైనల్.. ఎప్ప‌టి నుంచి ప్రారంభమంటే?

IPL 2025 new schedule: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ కొత్త  షెడ్యూల్ వ‌చ్చింది. జూన్ 3న ఫైనల్ జ‌ర‌గ‌నుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 13 2025, 12:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 new schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025కి సంబంధించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా మే 9న టోర్నమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అభిమానులు కొత్త షెడ్యూల్ కోసం ఎదురుచూస్తుండగా, బీసీసీఐ సోమ‌వారం అధికారిక ప్రకటన చేసింది.

25

ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లు మే 17న ప్రారంభమవుతాయి. అదే రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య మ్యాచ్‌తో టోర్నీ తిరిగి మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశం కాగా, కేకేఆర్ కోసం డూ ఆర్ డై తరహా పోరుగా మారనుంది.

ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా, ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టేందుకు ఆర్సీబీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Related Articles

Related image1
IPL 2025: ఐపీఎల్ ఆగినందుకు బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం
Related image2
ఐపీఎల్ 2025: అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్
35

ఇక మే 24న, మునుపటి ఆటలో భద్రతా కారణాల వల్ల నిలిపివేసిన పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ను జైపూర్‌లో నిర్వహించనున్నారు. మే 8న ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌ 10.1 ఓవర్ల వరకు మాత్రమే సాగి, పంజాబ్ 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. భార‌త్-పాక్ ఉద్రిక్త‌త కార‌ణంగా మ్యాచ్ ఆపివేయాల్సి వచ్చింది.

45

పూర్తి టోర్నీని ముగించేందుకు మిగిలిన 17 మ్యాచ్‌లు మొత్తం 6 వేదికలపై నిర్వహించనున్నారు. మొదట 25 మేకు నిర్ణయించిన ఫైనల్ మ్యాచ్‌కు కూడా వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న జరగనుంది.

 

 

55

ఈ మేరకు మే 29 నుండి నాక్‌ఔట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తాజా షెడ్యూల్‌తో ఐపీఎల్ 2025 మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. టోర్నీ తిరిగి ప్రారంభమవడం క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించే అంశం.

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌ షెడ్యూల్

క్వాలిఫైయర్ 1 – మే 29
ఎలిమినేటర్ – మే 30
క్వాలిఫైయర్ 2 - జూన్ 1
ఫైనల్ - జూన్ 3

ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదిక వివరాలను త్వ‌ర‌లోనే ప్రకటిస్తారు. ఐపీఎల్ 2025 పూర్తి కొత్త షెడ్యూల్ ఇక్కడ చూడండి

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ ఆగినందుకు బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం
Recommended image2
ఐపీఎల్ 2025: అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved