MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Asia Cup Final : భారత్ vs పాకిస్థాన్.. 41 ఏళ్లలో తొలిసారి.. గెలిచేది ఎవరు?

Asia Cup Final : భారత్ vs పాకిస్థాన్.. 41 ఏళ్లలో తొలిసారి.. గెలిచేది ఎవరు?

India vs Pakistan : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్ తొలిసారి పోటీ పడుతున్నాయి. 41 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి ఈ రెండు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 26 2025, 11:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
41 ఏళ్లలో తొలి భారత్–పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్
Image Credit : stockPhoto

41 ఏళ్లలో తొలి భారత్–పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్

ఆసియా కప్ 2025 చరిత్ర సృష్టించనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన 41 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్, పాకిస్థాన్ ఫైనల్‌లో తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా, భారత్ కూడా సూపర్ 4లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

25
భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వివాదాలు
Image Credit : X/ Baba Umar

భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వివాదాలు

గత రెండు మ్యాచ్‌లలో భారత్–పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫైనల్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. “మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. జట్టుకు కావలసిన సామర్థ్యం ఉంది. ఆదివారం భారత్‌ను ఓడించేందుకు కృషి చేస్తాం” అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నాడు. అలాగే, ఇప్పటికే ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లలో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్ ఫైనల్ లో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.

Related Articles

Related image1
Asia Cup : ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు.. ఫైనల్ నుంచి భారత కెప్టెన్ సూర్యకుమార్ ఔట్..?
Related image2
IND vs PAK : పాకిస్తాన్ కు షాకిచ్చిన ఐసీసీ.. హారిస్ రౌఫ్‌, ఫర్హాన్‌లకు వార్నింగ్
35
భారత్–పాకిస్థాన్ ఫైనల్స్ రికార్డులు ఎలా ఉన్నాయి?
Image Credit : stockPhoto

భారత్–పాకిస్థాన్ ఫైనల్స్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ లు ఐదు సార్లు మల్టీనేషన్ టోర్నమెంట్లలో ఫైనల్స్‌లో తలపడ్డాయి. భారత్ రెండు సార్లు గెలిచింది. పాకిస్థాన్ మూడు సార్లు విజయం సాధించింది.

• భారత్ విజయాలు: 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్, 2007 తొలి T20 వరల్డ్ కప్.

• పాకిస్థాన్ విజయాలు: 1986 ఆస్ట్రల్ ఆసియా కప్, 1994 ఆస్ట్రల్ ఆసియా కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.

అయితే ఆసియా కప్‌లో మాత్రం ఇంతవరకు ఫైనల్ పోరులో ఇరు జట్లు పోటీ పడలేదు. 2025లోనే తొలిసారి ఈ రెండు జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. అయితే, ఆసియా కప్ లో భారత్ కు సూపర్ రికార్డు ఉంది.

45
ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం
Image Credit : ANI

ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం

ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 టైటిళ్లు గెలిచింది. వీటిలో 1984, 1988, 1990–91, 1995, 2010, 2016 (T20), 2018, 2023 ఉన్నాయి. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు టైటిల్ గెలిచాయి. భారత్ మూడు సార్లు రన్నరప్‌గా కూడా నిలిచింది.

2023లో శ్రీలంకపై విజయం సాధించి భారత్ 8వ టైటిల్ అందుకుంది. విరాట్ కోహ్లీ 2012లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేయడం, మొహమ్మద్ సిరాజ్ 2023 ఫైనల్‌లో శ్రీలంకపై 6/21 బౌలింగ్ చేయడం ఆసియా కప్ చరిత్రలో ప్రత్యేక రికార్డులుగా ఉన్నాయి.

55
సూర్యకుమార్ కెప్టెన్సీలో సూపర్ పవర్ గా భారత్
Image Credit : ANI

సూర్యకుమార్ కెప్టెన్సీలో సూపర్ పవర్ గా భారత్

ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ జట్టు చాలా బలంగా ఉంది. ఆసియా కప్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, దుబేలు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తుననారు. అలాగే, బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
Asia Cup : ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు.. ఫైనల్ నుంచి భారత కెప్టెన్ సూర్యకుమార్ ఔట్..?
Recommended image2
IND vs PAK : పాకిస్తాన్ కు షాకిచ్చిన ఐసీసీ.. హారిస్ రౌఫ్‌, ఫర్హాన్‌లకు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved