MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ లేడు.. భారత్ మళ్లీ తప్పుడు నిర్ణయం తీసుకుందా?

IND vs ENG: బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ లేడు.. భారత్ మళ్లీ తప్పుడు నిర్ణయం తీసుకుందా?

India vs England Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టులో మూడు కీలక మార్పులు జరిగాయి. అయితే, బుమ్రా జట్టు నుంచి అవుట్ కావడం, కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోవడం పై కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. భారత మళ్లీ తప్పు చేసిందా? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
India vs England Test: కుల్దీప్‌ యాదవ్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు?
Image Credit : Getty

India vs England Test: కుల్దీప్‌ యాదవ్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు రెండవ టెస్టులో కూడా చోటు దక్కలేదు. మొదటి టెస్టులో కుల్దీప్‌కు అవకాశమొస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ కుల్దీప్ కు ఛాన్స్ ఇవ్వలేదు. తొలి మ్యాచ్ పై ఇది తీవ్ర ప్రభావం చూపించింది.

ఇక రెండో మ్యాచ్ తో జట్టులోకి వస్తాడని భావించారు కానీ, వాషింగ్టన్ సుందర్‌ను ఎంచుకోవడం ద్వారా కుల్దీప్‌కు ఛాన్స్ రాలేదు. ఈ నిర్ణయంపై కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. "కుల్దీప్‌ను ఆడించాలనే అంశం ఉంది. కానీ, బ్యాటింగ్‌లో మరింత సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే వాషింగ్టన్‌ సుందర్ ను ఎంపిక చేశాం" అని చెప్పారు.

25
బుమ్రా విశ్రాంతిపై విమర్శలు
Image Credit : Getty

బుమ్రా విశ్రాంతిపై విమర్శలు

భారత బౌలింగ్ దళానికి నేతృత్వం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్టులో నుంచి విశ్రాంతి తీసుకున్నారు. శుభ్ మన్ గిల్ వెల్లడించిన ప్రకారం, ఇది వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తీసుకున్న నిర్ణయం. 

"మూడో టెస్టు లార్డ్స్ వేదిక కావడంతో బౌలర్లకు కొంత సహాయంగా ఉండొచ్చు అనిపించింది. అందుకే బుమ్రాను అక్కడ ఆడించాలనుకుంటున్నాం" అని గిల్ పేర్కొన్నాడు.

గతంలో టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌ను, ఏడు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ విశ్రాంతికి పంపడం అర్థంలేని విషయం" అని శాస్త్రి స్కైస్పోర్ట్స్ తో అన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా మద్దతు ఇచ్చారు.

Related Articles

Related image1
Rishabh Pant: సెంచరీలు కొట్టకు సామీ.. రిషబ్ పంత్ ను వేడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్ !
Related image2
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత జట్టులో మూడు కీలక మార్పులు
35
కుల్దీప్‌ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు
Image Credit : ANI

కుల్దీప్‌ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు

అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ఫామ్ లో ఉన్న కుల్దీప్‌ యాదవ్ జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ, అతన్ని ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎడ్జ్‌బాస్టన్ వేదిక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది, కుల్దీప్ ను ఎంపిక చేయకపోవడం అన్యాయమని సునీల్ గవాస్కర్ అన్నారు.

"ఈ పిచ్‌లో మరింత టర్న్ ఉండవచ్చని అందరూ చెబుతున్నారు. బ్యాటింగ్‌లో 830 పరుగులు చేసిన జట్టుకు, బౌలింగ్ విఫలం కావడం అసలు సమస్య. కుల్దీప్‌కు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అని గవాస్కర్ సోనీ స్పోర్ట్స్ తో అన్నారు.

స్పిన్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై కుల్దీప్ యాదవ్ ను ఆడించకపోవడం భారత జట్టు అవకాశాలను దెబ్బతీసే అంశంగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

తప్పకుండా గెలిచిన సిరీస్ ను కొనసాగించాలని చూస్తున్న భారత్ కుల్దీప్ ను జట్టులోకి తీసుకోకుండా మళ్లీ తప్పు చేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

45
బాజ్‌బాల్ ఎఫెక్ట్: భారత్‌కు మరింత ముప్పు
Image Credit : Getty

బాజ్‌బాల్ ఎఫెక్ట్: భారత్‌కు మరింత ముప్పు

ఇంగ్లాండ్ తమ ‘బాజ్‌బాల్’ శైలితో టెస్టు క్రికెట్‌ను వేగంగా మార్చేస్తోంది. ఎక్కువ రన్‌రేట్‌తో ఎదురైనా ప్రతిస్పర్థుల్ని గెలవనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్పెషలిస్ట్ బౌలర్ అయిన కుల్దీప్‌ను ఎంపిక చేయకపోవడం భారత జట్టు గెలుపు అవకాశాలపై కొంత ప్రభావం చూపవచ్చు.

ఎడ్జ్‌బాస్టన్‌ గ్రౌండ్ గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఎడ్జ్‌బాస్టన్‌లో విదేశీ పేసర్లు అత్యధికంగా 4.96 ఎకానమీ రేట్ ను కలిగి ఉన్నారు. విదేశీ స్పిన్నర్ల విషయానికి వస్తే బెస్ట్ స్ట్రైక్‌రేట్ 55.1, తక్కువ బౌలింగ్ సగటు 29 గా ఉంది. కుల్దీప్ vs ఇంగ్లాండ్ గణాంకాలు గమనిస్తే.. ఇంగ్లాండ్ స్పిన్ కు వ్యతిరేకంగా 30.5 సగటుతో ఆడింది. ఇందులో 51 వికెట్లలో కుల్దీప్ 19 వికెట్లు తీసి, 20.6 సగటు, 36 స్ట్రైక్‌రేట్‌తో మెరిశాడు.

55
ఇండియా ప్లేయింగ్ 11లో మార్పలు
Image Credit : Getty

ఇండియా ప్లేయింగ్ 11లో మార్పలు

• బ్యాట్స్‌మెన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్

• ఆల్‌రౌండర్లు: నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్

• బౌలర్లు: ముహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ (డెబ్యూట్), ప్రసిద్ధ్ క్రిష్ణ

• జట్టు నుంచి ఔట్ అయిన వారు: జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయ్ సుదర్శన్

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

భారత్ టెస్ట్ జట్టులో స్పెషలిస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్‌ను వదిలేసి, బ్యాటింగ్‌లో లోతును ప్రాధాన్యతనిచ్చిన నిర్ణయం పెద్ద ప్రశ్నగా మారింది. ఇది సరైన నిర్ణయమా లేక తప్పుడు అంచనాన అనేది ఈ టెస్ట్ ఫలితంతో తేలనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
Rishabh Pant: సెంచరీలు కొట్టకు సామీ.. రిషబ్ పంత్ ను వేడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్ !
Recommended image2
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత జట్టులో మూడు కీలక మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved