MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. ర‌షీద్ ఖాన్ అద‌ర‌గొట్టాడు భ‌య్యా

Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. ర‌షీద్ ఖాన్ అద‌ర‌గొట్టాడు భ‌య్యా

IPL 2025 SRH vs GT: గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ కు ర‌షీద్ ఖాన్ దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. అద్భుత‌మైన క్యాచ్ ను ప‌ట్టి జీటీకి హెడ్ త‌ల‌నొప్పిని దూరం చేశాడు. ర‌షీద్ ఖాన్ ప‌రుగెత్తుకుంటూ బౌండ‌రీలైన్ వ‌ద్ద ప‌ట్టిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 లో బెస్ట్ క్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 02 2025, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 SRH vs GT: ఐపీఎల్ 2025 51వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డింది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలోని గుజ‌రాత్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది.

భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొద‌లుపెట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 ప‌రుగుల భాగ‌స్వామ్యం ల‌భించింది. ట్రావిస్ హెడ్ దూకుడుగా అడుతూ మంచి ట‌చ్ లో క‌నిపంచాడు. 

25

వ‌రుస‌గా ఫోర్లు కొడుతూ దూకుడు పెంచాడు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 5వ ఓవ‌ర్ 3వ బంతికి ట్రావిస్ హెడ్ బిగ్ షాట్ ఆడాడు. కానీ, బంతి బౌండ‌రీ లైన్ ను దాట‌లేదు. అంత‌లోనే ట్రావిస్ హెడ్ కు దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలింది. ర‌షీద్ ఖాన్ అద్భుత‌మైన క్యాచ్ తో హెడ్ ను పెవిలియ‌న్ కు పంపాడు. 

Related Articles

Related image1
Shubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జ‌రిగిందంటే?
35

ర‌షీద్ ఖాన్ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి ముందుకు దూకి అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు. దీంతో ట్రావిస్ హెడ్ 21 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు బాదాడు. 

రషీద్ ఖాన్ పట్టిన సూపర్ క్యాచ్ వీడియో ఇక్కడ చూడండి  

45

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 224/6 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో  76 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 37 బంతుల్లో 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.  సాయి సుదర్శన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

55

భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొద‌లుపెట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 ప‌రుగుల భాగ‌స్వామ్యం ల‌భించింది. ట్రావిస్ హెడ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో హైదరాబాద్ కు ఓటమి త‌ప్ప‌లేదు. హైదరాబాద్ టీమ్ 186-6 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
Shubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జ‌రిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved