MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్: కేకేఆర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు అవుట్..

ఐపీఎల్: కేకేఆర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు అవుట్..

IPL 2026 KKR : ఐపీఎల్ 2026 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ పలువురు ప్లేయర్లను వదులుకోనుంది. ఆ లిస్టులో కెప్టెన్ తో పాటు పలువురు స్టార్లు కూడా ఉన్నారు. ఆ ప్లేయర్ల వివరాలు  ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 10 2025, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2025లో కేకేఆర్ చెత్త ప్రదర్శన
Image Credit : ANI

ఐపీఎల్ 2025లో కేకేఆర్ చెత్త ప్రదర్శన

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2025 ఐపీఎల్ సీజన్‌లో తమ టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. 2024లో జట్టుకు విజయం సాధించిపెట్టిన ఫిల్ సాల్ట్, మిచెల్ స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లను ఈసారి మళ్లీ జట్టులోకి తీసుకోలేకపోయింది. జట్టు మేనేజ్‌మెంట్ వెంకటేష్ అయ్యర్ కోసం ఏకంగా ₹23.75 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడంతో పర్సులో మరింత మనీ లేకపోపవడంతో కీలక ప్లేయర్లను జట్టులోకి తీసుకోలేదు.

అజింక్య రహానే నాయకత్వంలో కేకేఆర్ ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపించింది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు గెలిచి, ఏడింట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కేవలం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కంటే మాత్రమే ముందుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు కేకేఆర్ టీమ్ కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసి.. కొత్త ఆటగాళ్లను తీసుకోవాలనుకుంటోంది. కేకేఆర్ విడుదల చేసే ప్లేయర్లను గమనిస్తే..

26
5. క్వింటన్ డి కాక్
Image Credit : Twitter/KKR

5. క్వింటన్ డి కాక్

దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను గత సీజన్‌కు ముందు కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ సీనియర్ స్టార్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌ పై జట్టుతో పాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, అతని ప్రదర్శన అంచనాలను అందుకోలేదు.

ఎనిమిది మ్యాచ్‌లలో డి కాక్ కేవలం 152 పరుగులే చేశాడు. 21.71 సగటు, 129.91 స్ట్రైక్‌రేట్ తో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ 32 ఏళ్ల ప్లేయర్ విడుదల చేస్తే, కేకేఆర్‌ పర్సులో ₹3.6 కోట్ల మొత్తం చేరుతుంది.

Related Articles

Related image1
Richa Ghosh: విశాఖలో కొత్త చరిత్ర.. 28 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన రిచా ఘోష్
Related image2
విశాఖపట్నంలో భారత జట్టు ఓటమికి 5 కారణాలు
36
4. స్పెన్సర్ జాన్సన్
Image Credit : Facebook

4. స్పెన్సర్ జాన్సన్

లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను కేకేఆర్ ₹2.8 కోట్లకు జట్టులోకి తీసుకుంది. అతని పొడవు కారణంగా బంతితో బౌన్స్, స్వింగ్ చేయగలగడం అతని ప్రత్యేకత. కానీ, ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో అతను తన స్థాయిలో ఆడలేకపోయాడు. జాన్సన్ మొత్తం నాలుగు మ్యాచ్‌లలో ఒకే వికెట్ సాధించాడు. ఎకానమీ రేట్ 11.74. ఈ ప్రదర్శన దృష్ట్యా అతన్ని జట్టు విడుదల చేసే అవకాశం ఉంది.

46
3. అన్రిచ్ నోర్జే
Image Credit : Getty

3. అన్రిచ్ నోర్జే

దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే కెరీర్ గాయాల కారణంగా తరచూ ఆగిపోతోంది. కేకేఆర్ అతన్ని ₹6.50 కోట్ల భారీ మొత్తానికి సైన్ చేసింది. కానీ, గాయాల కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.

ఏడు ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. ఎకానమీ రేట్ 11.86. జట్టు ప్రధాన బౌలర్‌గా ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.

56
2. అజింక్య రహానే
Image Credit : PTI

2. అజింక్య రహానే

అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ అజింక్య రహానే గత ఏడాది వేలంలో మొదట అన్‌సోల్డ్‌గా మిగిలాడు. అయితే, ఆ తరువాత కేకేఆర్ అతన్ని ₹1.5 కోట్ల బేస్ ప్రైస్‌కు సైన్ చేసింది. ఆశ్చర్యకరంగా, జట్టు అతన్ని కెప్టెన్‌గా నియమించింది. రహానే ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. కానీ, కెప్టెన్ గా సక్సెస్ కాలేదు. రహానే కెప్టెన్సీ నిర్ణయాలపై అభిమానులు, నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కేకేఆర్ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో ఉంది.

66
1. వెంకటేష్ అయ్యర్
Image Credit : ANI

1. వెంకటేష్ అయ్యర్

2021 నుండి కేకేఆర్‌ జట్టులో ఉన్న వెంకటేష్ అయ్యర్, 2024లో జట్టుకు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా 2025 వేలంలో కేకేఆర్ అతన్ని తిరిగి ₹23.75 కోట్లకు జట్టులోకి తీసుకుంది. కానీ, అయ్యర్ దీనికి న్యాయం చేయలేకపోయాడు.

అయ్యర్ ఆ పెట్టుబడికి సరితూగే ప్రదర్శనలు ఇవ్వలేదు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే సాధించాడు. 20.29 సగటు, 139.22 స్ట్రైక్‌రేట్ తో అతని బ్యాటింగ్ కొనసాగింది. అంతేకాకుండా, మొత్తం సీజన్‌లో ఒక్క ఓవరూ బౌలింగ్ వేయలేదు.

ఈ కారణాలతో అతన్ని ప్రస్తుత కాంట్రాక్ట్ విలువతో కొనసాగించే అవకాశం తక్కువ. అయితే, కేకేఆర్ మినీ వేలంలో తక్కువ ధరకు అతన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
Richa Ghosh: విశాఖలో కొత్త చరిత్ర.. 28 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన రిచా ఘోష్
Recommended image2
విశాఖపట్నంలో భారత జట్టు ఓటమికి 5 కారణాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved