MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Bengaluru: పెద్ద ఈవెంట్లకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. షాకింగ్ రిపోర్టు

Bengaluru: పెద్ద ఈవెంట్లకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదు.. షాకింగ్ రిపోర్టు

Chinnaswamy Stadium : బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియం భద్రతా లోపాల కారణంగా పెద్ద ఈవెంట్లకు సుర‌క్షిత‌మైన‌ది కాద‌ని జాన్ మైఖేల్ కున్హా కమిషన్ నివేదిక పేర్కొంది. దీంతో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయా? లేదా? అనే  ప్రశ్నలు వస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 12 2025, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్నస్వామి స్టేడియంపై భద్రతా ఆందోళనలు
Image Credit : Getty

చిన్నస్వామి స్టేడియంపై భద్రతా ఆందోళనలు

మహిళల ప్రపంచకప్ 2025కు ముందు బెంగళూరులోని ఎం. చిన్న‌స్వామి స్టేడియం భద్రతా సమస్యలతో మ‌రోసారి వార్తల్లో నిలిచింది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా కమిషన్ త‌న నివేదిక‌లో షాకింగ్ విష‌యాలు పేర్కొంది. 

పెద్ద ఎత్తున జన స‌మూహంతో ఉండే ఈవెంట్లకు బెంగ‌ళూరు స్టేడియం సుర‌క్షిత‌ం కాద‌ని పేర్కొంది. ఈ నివేదిక మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది.

DID YOU
KNOW
?
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం
బెంగళూరు చినాస్వామి స్టేడియం 1970లో పూర్తి కాగా, 1972లో తొలి మ్యాచ్, 1974లో తొలి టెస్టు, 1982లో తొలి వన్డేను ఆడారు.
25
బెంగళూరు తొక్కిస‌లాట‌తో విచార‌ణ‌ క‌మిష‌న్ ఏర్పాటు
Image Credit : Asianet News

బెంగళూరు తొక్కిస‌లాట‌తో విచార‌ణ‌ క‌మిష‌న్ ఏర్పాటు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన వేడుకల్లో తొక్కిస‌లాట జ‌రిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కున్హా కమిషన్.. ఎం. చిన్న‌స్వామి స్టేడియానికి పెద్ద ఈవెంట్ల నిర్వహణకు తగిన మౌలిక సదుపాయాలు లేవని తేల్చింది.

నివేదికలో స్టేడియం బహిరంగ రహదారుల నుండి వేరు చేసిన క్యూలైన్లు, లోప‌లికి, బ‌య‌ట‌కు రావ‌డానికి ఏర్పాటు చేసిన ద్వారాలు పెద్ద ఈవెంట్ల‌కు స‌రిప‌డే విధంగా లేవు. సమగ్ర అత్యవసర తరలింపు ప్రణాళికలు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు సరిపడే పార్కింగ్, ప్రజా రవాణా అనుసంధానం వంటి అవసరాలు స్టేడియంలో లేవని కున్హా క‌మిష‌న్ నివేదిక పేర్కొంది.

Related Articles

Related image1
Bollywood Stars: అది దయ కాదు.. బహిష్కరణే.. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పుపై బాలీవుడ్ తార‌ల అసంతృప్తి
Related image2
Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరికలు
35
మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం
Image Credit : X/BCCIWomen

మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం

ఎం. చినాస్వామి స్టేడియంలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు వేదికగా ఎంపికైంది. భారత్-శ్రీలంక ఓపెనింగ్ మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్‌ను ఇక్కడ నిర్వహించాలనే ప్రణాళిక ఉంది. అయితే, తాజా నివేదికలతో ఈ మ్యాచ్‌లు ఇతర నగరాలకు మారే అవకాశం పెరిగింది.

బీసీసీఐ కూడా భద్రతా కారణాలతో వేదికను మార్చే దిశగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

45
బెంగళూరు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరిగేనా?
Image Credit : Getty

బెంగళూరు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరిగేనా?

చిన్న‌స్వామి స్టేడియంలో రాబోయే మహారాజా టీ20 ట్రోఫీ, కర్ణాటక టీ20 దేశీయ టోర్నమెంట్ కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. కానీ ఈ టోర్నమెంట్‌ను ప్రేక్షకుల లేకుండా నిర్వహించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది.

నివేదికలో స్టేడియంలో పెద్ద ఈవెంట్లు జరపడం ప్రజా భద్రత, పట్టణ రవాణా, అత్యవసర సేవల సిద్ధతపై ఆందోళ‌న‌ల‌ను  కున్హా కమిషన్ ప్ర‌స్తావించింది.

55
బెంగ‌ళూరు తొక్కిస‌లాట బాధ్యులపై చర్యలకు సిఫార్సు
Image Credit : ANI Photos

బెంగ‌ళూరు తొక్కిస‌లాట బాధ్యులపై చర్యలకు సిఫార్సు

జాన్ మైఖేల్ కున్హా కమిషన్ బెంగ‌ళూరు తొక్కిస‌లాట బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు రఘురామ్ భట్, మాజీ కార్యదర్శి ఏ. శంకర్, మాజీ ఖజాంచి ఈఎస్ జైరామ్, ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మేనన్, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి. వెంకట్ వర్ధన్, వైస్ ప్రెసిడెంట్ సునీల్ మాథూర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది. తొక్కిస‌లాట త‌ర్వాత ఏ. శంకర్, ఈఎస్ జైరామ్ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
బెంగళూరు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
Bollywood Stars: అది దయ కాదు.. బహిష్కరణే.. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పుపై బాలీవుడ్ తార‌ల అసంతృప్తి
Recommended image2
Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరికలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved