MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందా? బీసీసీఐ క్లారిటీ

ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందా? బీసీసీఐ క్లారిటీ

India vs Pakistan : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వివాదం మధ్య బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. సర్కార్ పాలసీ ప్రకారం ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2025, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్‌లో భారత్ పాక్ మ్యాచ్‌పై వివాదం
Image Credit : AFP

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై వివాదం

ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై చాలా మంది ప్రముఖులు వ్యతిరేక గళం వినిపించారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అభిమానులు, మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను కొనసాగించవద్దని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వివాదం మొదలైంది.

DID YOU
KNOW
?
శుభ్ మన్ గిల్
ఆసియా కప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉన్నారు. టీమిండియా 9వ టైటిల్ టార్గెట్ గా ముందుకు సాగుతోంది.
25
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ ఏమన్నారంటే?
Image Credit : AFP

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ ఏమన్నారంటే?

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై వివాదం నెలకొన్ని నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వివరణ ఇచ్చారు. "భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త పాలసీ ప్రకారం ఐసీసీ, ఏసీసీ లేదా బహుళ దేశాల టోర్నమెంట్‌లలో భారత్ ఆడవచ్చు. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగవు" అని ఆయన తెలిపారు. అంటే ఇప్పట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు వుండవు.

Related Articles

Related image1
ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌లు
Related image2
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల కోసం కొత్త షెడ్యూల్ విడుదల
35
పాకిస్తాన్ తో మ్యాచ్ లు.. కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం
Image Credit : ANI

పాకిస్తాన్ తో మ్యాచ్ లు.. కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం

ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అందులో, భారత ఆటగాళ్లు బహుళ దేశాల క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు, కానీ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక పోటీలు మాత్రం జరగవని స్పష్టం చేశారు. దీనిని గురించి సైకియా ప్రస్తావిస్తూ.. "ఏదైనా మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆడకపోతే అంతర్జాతీయంగా భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది" అని హెచ్చరించారు.

45
క్రికెట్ మాత్రమే కాదు, ఇతర క్రీడలు కూడా
Image Credit : ANI

క్రికెట్ మాత్రమే కాదు, ఇతర క్రీడలు కూడా

ఇది క్రికెట్ కు మాత్రమే పరిమితం కాదని సైకియా అన్నారు. "ఈ విధానం క్రికెట్‌కే కాదు, ఇతర క్రీడలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు, అథ్లెటిక్స్‌లో ఒక ఆటగాడు పాకిస్థాన్ ప్రత్యర్థిని ఎదుర్కొనకపోతే, భారత అథ్లెటిక్స్ సమాఖ్యపై ఆంక్షలు పడవచ్చు. ఆ పరిస్థితిలో నీరజ్ చోప్రా వంటి క్రీడాకారులు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్‌ల్లో ఆడే అవకాశం కోల్పోతారు" అని వివరించారు.

55
ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే బీసీసీఐ పాలసీ
Image Credit : ANI

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే బీసీసీఐ పాలసీ

బీసీసీఐ సెక్రటరీ మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "ప్రభుత్వం నిర్ణయించిన పాలసీని బీసీసీఐ కచ్చితంగా అనుసరిస్తుంది. భారత్ ఏ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లోనైనా అన్ని దేశాలతో ఆడాల్సిందే. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం పాకిస్తాన్ తో జరగవు" అని సైకియా అన్నారు.

దీంతో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తప్పనిసరి అని బీసీసీఐ స్పష్టం చేసింది. రాజకీయ, భద్రతా కారణాల వలన ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయినప్పటికీ, మల్టీనేషనల్ టోర్నమెంట్‌లలో ఆడక తప్పదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఆసియా కప్ 2025

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌లు
Recommended image2
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల కోసం కొత్త షెడ్యూల్ విడుదల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved