MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు.. ఆసియా కప్ లో పరుగుల సునామీ.. ఎవరా ప్లేయర్?

ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు.. ఆసియా కప్ లో పరుగుల సునామీ.. ఎవరా ప్లేయర్?

Asia Cup 2025: ఆసియా కప్ టీ20లో హాంకాంగ్‌ ప్లేయర్ బాబర్ హయాత్ ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు కొట్టి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 01 2025, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ లో బాబర్ హయాత్ సునామీ నాక్
Image Credit : Instagram / babar_hayat_10

ఆసియా కప్ లో బాబర్ హయాత్ సునామీ నాక్

ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్‌ జట్టు బాట్స్‌మన్‌ బాబర్ హయాత్ తన అద్భుతమైన ధనాధన్ బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 సిక్సులు కొట్టి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. 

విరాట్ కోహ్లీ 429 పరుగులతో ఆసియా కప్ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నా, ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఘనత మాత్రం బాబర్ హయాత్‌కే దక్కింది.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో అత్యధిక వికెట్లు
ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ. అతను మొత్తం 33 వికెట్లు పడగొట్టాడు.
25
ఓమన్‌ తో జరిగిన మ్యచ్ లో సూపర్ ఇన్నింగ్స్‌
Image Credit : X/Cricket Hong Kong

ఓమన్‌ తో జరిగిన మ్యచ్ లో సూపర్ ఇన్నింగ్స్‌

2016 ఫిబ్రవరి 19న ఫతుల్లాలోని ఖాన్‌ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో హాంకాంగ్‌-ఓమన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఓమన్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. జీషాన్ మసూద్, జతీందర్ సింగ్‌లు మంచి ఆరంభం ఇచ్చారు. జీషాన్ మసూద్ 13 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత జతీందర్ సింగ్ 35 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. వాఘవ్ వాటెగావంకర్ 14 పరుగులు, ఆమిర్ అలీ 32 పరుగులు, మెహ్రాన్ ఖాన్ 28 పరుగులు చేశారు. 20 ఓవర్లలో ఓమన్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హాంకాంగ్ బౌలర్ నదీమ్ అహ్మద్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు.

Related Articles

Related image1
Nitish Rana: 8 ఫోర్లు, 15 సిక్స‌ర్లు.. 42 బంతుల్లో సెంచ‌రీ. ఏం కొట్టుడు సామీ ఇది.
Related image2
హర్భజన్-శ్రీశాంత్ కొట్లాట వీడియో: 17 ఏళ్ల తర్వాత ఎందుకు బయటకొచ్చింది?
35
హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌లో బాబర్ హయాత్ సూపర్ బ్యాటింగ్‌
Image Credit : Getty

హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌లో బాబర్ హయాత్ సూపర్ బ్యాటింగ్‌

లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన హాంకాంగ్‌ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కిన్చిత్ షా 0 పరుగులకే ఔటవడంతో జట్టు 5 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి బాబర్ హయాత్ తన దాడి ప్రారంభించాడు. అంషుమాన్ రథ్‌తో కలిసి రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. కానీ రథ్ 11 పరుగులకే ఔటవడంతో జట్టు మళ్లీ ఒత్తిడిలోకి చేరింది. 

45
బాబర్ హయాత్ పోరాటం
Image Credit : Instagram / babar_hayat_10

బాబర్ హయాత్ పోరాటం

వికెట్లు పడిపోతున్నా బాబర్ హయాత్ మాత్రం క్రీజులో నిలబడి దుమ్మురేపాడు. 60 బంతుల్లో 122 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 9 ఫోర్లు బాదడం విశేషం. అతని ఇన్నింగ్స్‌ కారణంగానే హాంకాంగ్‌ పోరాడగలిగింది. చివరి వరకు పోరాడినా హాంకాంగ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. ఓమన్ 5 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.

55
బాబర్ హయాత్ సిక్సర్ల రికార్డు
Image Credit : Instagram / babar_hayat_10

బాబర్ హయాత్ సిక్సర్ల రికార్డు

ఈ మ్యాచ్‌లో బాబర్ హయాత్ బాదిన 7 సిక్సులు ఇప్పటికీ ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధికం. ఈ రికార్డు బాబర్ పేరుతో నిలిచిపోగా, ఆసియా కప్‌ చరిత్రలోని అత్యుత్తమ వ్యక్తిగత ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటిగా గుర్తింపుపొందింది. బాబర్ హయాత్ ప్రదర్శన క్రికెట్ అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
Nitish Rana: 8 ఫోర్లు, 15 సిక్స‌ర్లు.. 42 బంతుల్లో సెంచ‌రీ. ఏం కొట్టుడు సామీ ఇది.
Recommended image2
హర్భజన్-శ్రీశాంత్ కొట్లాట వీడియో: 17 ఏళ్ల తర్వాత ఎందుకు బయటకొచ్చింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved