MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 3 సెంచరీలు.. 431 పరుగులతో కంగారెత్తించారు

3 సెంచరీలు.. 431 పరుగులతో కంగారెత్తించారు

Australia vs South Africa: ఆస్ట్రేలియా మరోసారి తమ బ్యాటింగ్ పవర్ ను చూపిస్తూ పరుగుల సునామీ రేపింది. దక్షిణాఫ్రికాపై చివరి వన్డేలో 3 సెంచరీలతో 431 పరుగులు చేసింది. 276 రన్స్ తేడాతో ప్రోటిస్ జట్టును చిత్తుచేసింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 24 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా దూకుడు
Image Credit : Getty

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా దూకుడు

మ్యాకై లోని గ్రేట్ బారియర్ రీఫ్ అరీనా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అలాగే, రికార్డుల మోత మోగించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే దూకుడును కొనసాగించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అద్భుత భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 34.1 ఓవర్లలో 250 పరుగులు జోడించి దక్షిణాఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.

ఇద్దరు ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 103 బంతుల్లో 142 పరుగుల (17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ నాక్ ఆడాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 106 బంతుల్లో 100 పరుగులతో (6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ కొట్టాడు.

DID YOU
KNOW
?
వన్డేల్లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగులు
వన్డేల్లో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు గమనిస్తే.. మొదటి స్థానంలో 434/4 vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్‌, 2006 వుండగా, 431/2 vs దక్షిణాఫ్రికా, మ్యాకై, 2025 మ్యాచ్ రెండో స్థానంలో ఉంది.
25
తొలి వన్డే సెంచరీ కొట్టిన కామెరాన్ గ్రీన్
Image Credit : Getty

తొలి వన్డే సెంచరీ కొట్టిన కామెరాన్ గ్రీన్

ఇద్దరు ఓపెనర్ల తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ ఆసీస్ ఇన్నింగ్స్ ను మరింతగా పరుగులు పెట్టించాడు. సునామీ బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 400+ పరుగుల మార్కును అందుకుంది. కేవలం 55 బంతుల్లోనే 118 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. కామెరాన్ గ్రీన్ కు ఇది తొలి వన్డే సెంచరీ. అలాగే, ఆస్ట్రేలియా ఆటగాళ్లలో రెండో వేగవంతమైన వన్డే సెంచరీ కూడా.

కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లు బాదాడు. చివర్లో అలెక్స్ కారీ 50* పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 82 బంతుల్లో 164 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Related Articles

Related image1
ఛెతేశ్వర్‌ పుజారా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణమేంటి?
Related image2
ఆసియా కప్ 2025: టీమిండియా ముందున్న 5 సవాళ్లు ఇవే
35
ఒకే మ్యాచ్‌లో 3 సెంచరీలతో మరో రికార్డు
Image Credit : Getty

ఒకే మ్యాచ్‌లో 3 సెంచరీలతో మరో రికార్డు

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరో ప్రత్యేక ఘనత సాధించింది. 4897 వన్డే మ్యాచ్‌ల చరిత్రలో ఒకే జట్టు తరఫున ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం చాలా అరుదుగా ఉంది. ఆస్ట్రేలియా చరిత్రలో ఇది రెండవ సారి నమోదుకావడం విశేషం. అయితే, మొదటిసారి ఈ ఘనత సాధించిన జట్టు దక్షిణాఫ్రికా. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హషీమ్ ఆమ్లా (153*), రైలి రుసో (128), ఏబీ డివిలియర్స్ (149) సెంచరీలతో అదరగొట్టారు.

45
బౌలింగ్ లోనూ అదరగొట్టిన ఆసీస్.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా
Image Credit : Getty

బౌలింగ్ లోనూ అదరగొట్టిన ఆసీస్.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా

432 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. కంగారు బౌలర్లు రాణించడంతో ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. ఐడెన్ మార్క్రామ్ (2), ర్యాన్ రికెల్టన్ (11), టెంబా బావుమా (19)లు త్వరగానే పెవిలియన్ కు చేరారు. కొంతసేపు డి జోర్సీ (33), బ్రెవిస్ (49) లు పోరాటం చేశారు, కానీ జట్టును విజయం వైపు నడిపించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 24.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.

55
ఆస్ట్రేలియా బౌలర్ల మెరుపులు
Image Credit : Getty

ఆస్ట్రేలియా బౌలర్ల మెరుపులు

ఆస్ట్రేలియా బౌలర్లలో కూపర్ కనోలీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. సేవియర్ బార్ట్లెట్, షాన్ అబాట్ తలో రెండు వికెట్లు సాధించారు. దీంతో ఆస్ట్రేలియా 276 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. 

అయితే, మొదటి రెండు వన్డేల్లో గెలిచిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీనికి ముందు జరిగిన టీ20 సిరీస్‌ను అదే తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో రెండో అత్యధిక స్కోరు (431) సాధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
Recommended image2
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image3
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Related Stories
Recommended image1
ఛెతేశ్వర్‌ పుజారా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణమేంటి?
Recommended image2
ఆసియా కప్ 2025: టీమిండియా ముందున్న 5 సవాళ్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved