MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Sourav Ganguly : సౌరవ్ గంగూలీతో లవ్.. నటి నగ్మా ఏం చెప్పారో తెలుసా?

Sourav Ganguly : సౌరవ్ గంగూలీతో లవ్.. నటి నగ్మా ఏం చెప్పారో తెలుసా?

Sourav Ganguly - Nagma relationship: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో త‌న సంబంధం ఎందుకు ముగిసిందో నటి నగ్మా ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2025, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నగ్మా సౌరవ్ గంగూలీ ప్రేమాయణం మళ్లీ హాట్ టాపిక్
Image Credit : our own

నగ్మా - సౌరవ్ గంగూలీ ప్రేమాయణం మళ్లీ హాట్ టాపిక్

Sourav Ganguly - Nagma relationship: క్రికెట్ ఆటగాళ్లు, సినీ తారల మధ్య ప్రేమాయణాలు కొత్త కాదు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ లాంటి జంటలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే, 2000ల ప్రారంభంలో మరో హాట్ టాపిక్ అయిన జంట సౌరవ్ గంగూలీ - నగ్మా. ఇప్పుడు మళ్లీ ఈ బంధం పై చర్చ జరుగుతోంది. అందుకు కారణం నటి నగ్మా ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్,  అలాగే దాదా బర్తే డే.

26
అప్పట్లో బోలెడన్ని పుకార్లు, దేవాలయాల్లో కనిపించిన గంగూలీ జోడీ
Image Credit : Getty

అప్పట్లో బోలెడన్ని పుకార్లు, దేవాలయాల్లో కనిపించిన గంగూలీ జోడీ

సుమారు 25 ఏళ్ల క్రితం, అంటే 1999లో మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మా ప్రేమలో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి.

1997లో గంగూలీ తన స్నేహితురాలు డోనాను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి జరిగిన రెండేళ్లకు అంటే 1999 నాటికి గంగూలీ నగ్మాతో ప్రేమాయణం నడిపారనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ దేవాలయాల్లో కలిసి కనిపించారన్న వార్తలతో పాటు, రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా అప్పట్లో బాగా చక్కర్లు కొట్టాయి. 

కానీ, వీరి బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఏం జరిగిందనే విషయంపై చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఈ స్టార్స్ దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Related Articles

Related image1
India vs England: ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు
Related image2
Shubman Gill: ఇంగ్లాండ్ పై గెలుపు.. శుభ్‌మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులు
36
గంగూలీతో లవ్.. నగ్మా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే…
Image Credit : our own

గంగూలీతో లవ్.. నగ్మా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే…

ఈ పుకార్ల నేపథ్యంగా నగ్మా ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గంగూలీ పేరును నేరుగా చెప్పకపోయినా, ఆమె మాట్లాడిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి.

“ఒక విషయంలో హాట్ టాపిక్ అయినప్పుడు ఇద్దరూ ఏమీ మాట్లాడకపోతే.. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అలాంటిదే జరుగుతోంది” అని ఆమె అన్నారు.

“మా మధ్య ఏం జరిగిందని మీరు ఊహిస్తున్నారు?  నాకు క్రికెట్‌పై ఆసక్తి లేకపోవడం వల్ల చాలా విషయాలు తప్పుగా మలుపు తిరిగాయి. కొన్ని విషయాలు వర్కవుట్ కాలేదు, అందుకే మేము మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాం” అని చెప్పారు.

దాదా పేరు చెప్పకపోయినా.. అప్పటి పుకార్ల మధ్య చేసిన కామెంట్స్ తో అది గంగూలీతోనే అనీ, వారి సంబంధం ఎందుకు ముగిసిందన్న విషయాన్ని ఈ ప్రకటనతో నగ్మ స్పష్టంగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు.

46
గంగూలీ విడాకులపై రూమర్లు
Image Credit : Google

గంగూలీ విడాకులపై రూమర్లు

గంగూలీ, నగ్మ ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారిన సమయంలో గంగూలీ భార్య డోనాతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు కూడా ప్రముఖ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాలేదు. గంగూలీ, డోనా దంపతులు ఇంకా కలిసి జీవిస్తున్నారు. కానీ గంగూలీ-నగ్మా బంధం మాత్రం పుకార్లుగానే మిగిలిపోయింది.

56
నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన నగ్మా
Image Credit : Google

నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన నగ్మా

1990లలో సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో స్టార్ గా వెలుగొందిన నగ్మా.. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. 2008 తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

నగ్మా వయస్సు ప్రస్తుతం 49 ఏళ్లు. ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడూ మీడియాలో చర్చ వస్తూనే ఉంటుంది. 2020లో గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఆమె ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్‌ ఇప్పటికీ డిలీట్ చేయలేదు.. ఇది ఆ బంధం లో మరక మిగిలిందనే సూచనగా కొందరు భావిస్తున్నారు.

66
ఈ ప్రేమ కథలో ఎలాంటి ముగింపు లేదు... కానీ గుర్తుండిపోయేదే
Image Credit : our own

ఈ ప్రేమ కథలో ఎలాంటి ముగింపు లేదు... కానీ గుర్తుండిపోయేదే

ఈ ప్రేమ కథలో హ్యాపీ ఎండింగ్ లేకపోయినా, భారత క్రికెట్ చరిత్రలో, సినీ ప్రపంచంలో మరిచిపోలేని సంచలనంగా మిగిలిపోయింది.

నగ్మా తన ఇంటర్వ్యూలో మళ్లీ ఆ పేజిని తిప్పడంతో, ఈ బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె స్పష్టంగా “వర్కవుట్ కాలేదు” అని చెప్పడం, ఈ బంధం ఒకచోట ఆగిపోయిందని తెలిపింది. 

సినిమా, క్రికెట్ అభిమానులకు ఈ కథ గుడ్ న్యూస్ లా మారకపోయినా.. వారి బంధంలో ఎంతో బాధను కూడా భరించారనే చర్చ కూడా సాగింది. ప్రస్తుతం గంగూలీ పుట్టిన రోజు నేపథ్యంలో మరోసారి నగ్మతో సంబంధం వైరగ్ గా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
India vs England: ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు
Recommended image2
Shubman Gill: ఇంగ్లాండ్ పై గెలుపు.. శుభ్‌మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved