MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి

Swivel Seat: ఎంత కాస్లీ కారు అయినా స‌రే వృద్ధులు, దివ్యాంగులు ఎక్క‌డానికి ఇబ్బంది ప‌డుతుంటారు. క‌చ్చింగా ఒక‌రి స‌హాయం ఉండాల్సిందే. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 18 2025, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృద్ధులు, దివ్యాంగులకు ఊరటగా కొత్త ఫీచర్
Image Credit : marutisuzuki.com

వృద్ధులు, దివ్యాంగులకు ఊరటగా కొత్త ఫీచర్

కారు ఎక్కడం, దిగడం వృద్ధులకు చాలాసార్లు కష్టంగా మారుతుంది. నాన్నమ్మ–తాతయ్యలు కారు సీట్లో కూర్చోవాలంటే ప‌క్క‌వారి స‌హాయం తీసుకోవాల్సిందే అని తెలిసిందే. అయితే ఈ సమస్యను గుర్తించిన మారుతీ సుజుకి, తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగ‌నార్‌లో Swivel Seat అనే ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీటు వల్ల వృద్ధులు, దివ్యాంగులు చాలా సులభంగా కారులో కూర్చోవచ్చు.

25
Swivel Seat అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
Image Credit : MARUTI SUZUKI, FREEPIK

Swivel Seat అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

Swivel Seat ప్రత్యేకత ఏంటంటే, కారు తలుపు తెరిచిన వెంటనే సీటు బయట వైపు తిరుగుతుంది. దీంతో కూర్చోవడం, లేవ‌డం చాలా ఈజీ అవుతుంది. సీటు తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ సాధారణ సీటులాగే లాక్ అవుతుంది. ముఖ్యంగా ఈ సీటు కోసం కారు బాడీ లేదా మెకానికల్ భాగాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ సీటును పూర్తిగా తొలగించకుండా, దానిపైనే ఈ సదుపాయాన్ని అమర్చవచ్చు.

Related Articles

Related image1
Bike: ర్యాపిడో, జొమాటో వాళ్ల‌కు ఈ బైక్ వ‌రం.. ఒక్క‌సారి ట్యాంక్ నింపితే 600 కి.మీలు ఖాయం
Related image2
ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
35
సీటు అమర్చడానికి ఎంత సమయం పడుతుంది?
Image Credit : Freepik, MARUTI

సీటు అమర్చడానికి ఎంత సమయం పడుతుంది?

మారుతీ సుజుకి అధికారిక సమాచారం ప్రకారం, Swivel Seat అమరికకు సుమారు ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. ఎలాంటి క్లిష్టమైన మార్పులు అవసరం ఉండవు. పూర్తిగా సేఫ్‌గా, కంపెనీ సూచనల ప్రకారమే అమ‌ర్చుతారు. కొత్త WagonR కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే 2019 తర్వాత విక్ర‌యించిన WagonR కార్లలో కూడా ఈ సీటును అమర్చించుకునే అవకాశం ఉంది.

45
ఎక్కడ అందుబాటులో ఉంది? వారంటీ ఎంత?
Image Credit : Maruti Suzuki

ఎక్కడ అందుబాటులో ఉంది? వారంటీ ఎంత?

ప్రస్తుతం ఈ వేరియంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా 11 నగరాల్లో ప్రారంభించారు. 200కు పైగా ఏరియా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. వినియోగదారుల స్పందనను బట్టి మిగతా నగరాలు, రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ Swivel Seat కోసం మారుతీ సుజుకి, బెంగళూరుకు చెందిన TRUEAssist Technology Private Limitedతో ఒప్పందం చేసుకుంది. ఈ సీటుకు 3 సంవత్సరాల మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వారంటీ కూడా ఇస్తున్నారు.

55
వినియోగదారుల అవసరాలపై కంపెనీల దృష్టి
Image Credit : maruti suzuki

వినియోగదారుల అవసరాలపై కంపెనీల దృష్టి

వృద్ధులు, దివ్యాంగుల కోసం WagonRలో Swivel Seat అందించడం మారుతీ సుజుకి తీసుకున్న మంచి అడుగు. ఇదే తరహాలో టాటా మోటార్స్ కూడా సిఎన్‌జీ కార్లలో డిక్కీ సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు సిఎన్‌జీ ఉన్నా కూడా ఫుల్ డిక్కీ సౌకర్యం ఇస్తోంది. యూజ‌ర్ల‌ సమస్యలపై దృష్టి పెట్టడం వల్లే భారత ఆటో మార్కెట్‌లో కొత్త కొత్త ఉపయోగకరమైన ఫీచర్లు వ‌స్తున్నాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cars: CNG కారులో క‌చ్చితంగా పెట్రోల్ ఉండాలా.? లేక‌పోతే ఏమ‌వుతుందో తెలుసా.?
Recommended image2
Renault Duster 2026 : లుక్ అదిరింది.. ఫీచర్లు మతిపోగొడుతున్నాయి.. మైలేజ్ మాస్టర్ కొత్త రెనాల్ట్ డస్టర్
Recommended image3
TATA Punch: రూ. 6 ల‌క్ష‌ల‌కే క‌ళ్లు చెదిరే కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Related Stories
Recommended image1
Bike: ర్యాపిడో, జొమాటో వాళ్ల‌కు ఈ బైక్ వ‌రం.. ఒక్క‌సారి ట్యాంక్ నింపితే 600 కి.మీలు ఖాయం
Recommended image2
ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved