MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI: ఇక‌పై ఫోన్‌పే ఉచితం కాదు..? పేమెంట్ చేయడానికి ఛార్జీలు..!

UPI: ఇక‌పై ఫోన్‌పే ఉచితం కాదు..? పేమెంట్ చేయడానికి ఛార్జీలు..!

దేశంలో యూపీఐ పేమెంట్స్‌కి భారీగా ఆద‌ర‌ణ ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావ‌డంతో చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 06 2025, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూపీఐలో కొత్త మార్పుల సూచన
Image Credit : Getty

యూపీఐలో కొత్త మార్పుల సూచన

దేశంలో డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న ఈ సేవలపై కొన్ని బ్యాంకులు కొత్త ఛార్జీలు వసూలు చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. పేమెంట్ అగ్రిగేటర్లు (పీఏ) నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మొదలవగా, భవిష్యత్తులో వ్యాపారులు, అక్కడి నుంచి వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

DID YOU
KNOW
?
భారీగా పెరిగిన లావాదేవీలు
దేశంలో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. 2025 జూన్ నెల‌లోనే ఏకంగా 18.4 బిలియన్ లావాదేవీలు జరిగాయి.
25
ప్రస్తుతం ఉచిత సేవలు
Image Credit : Gemini

ప్రస్తుతం ఉచిత సేవలు

ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించడం లేదు. బిల్‌డెస్క్, రాజోర్‌పే, సీసీఅవెన్యూ, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్లు వ్యాపారులకు వినియోగదారులకు మధ్య వంతెనగా పని చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పద్ధతులను ఈ అగ్రిగేటర్లు సమన్వయం చేస్తున్నారు. ఆర్‌బీఐ వివరాల ప్రకారం ప్రస్తుతం 8 లైసెన్స్ పొందిన పీఏలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, మరో 30 సంస్థల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

Related Articles

Related image1
Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లండి.. గురువారం ఈ ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు
Related image2
8th pay commission: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. రూ. 18 వేలున్న కనీస జీతం ఎంత కానుందో తెలుసా.?
35
బ్యాంకుల కొత్త ఛార్జీలు
Image Credit : Gemini\Meta AI

బ్యాంకుల కొత్త ఛార్జీలు

కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్లపై 6-9 బేసిస్ పాయింట్ల వరకు రుసుములు విధించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానంలో ముందున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 2-10 బేసిస్ పాయింట్ల మధ్య రుసుములు విధించేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నెల 1వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అమలు చేసింది.

ఎస్క్రో ఖాతా కలిగిన పీఏలకు ఒక్క లావాదేవీపై 2 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.02), గరిష్ఠంగా రూ.6 వరకు వసూలు చేస్తోంది.

ఎస్క్రో ఖాతా లేని పీఏలకు 4 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.04), గరిష్ఠంగా రూ.10 వరకు ఛార్జీ ఉంది.

వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు చేస్తే మాత్రం రుసుము ఉండదు.

45
ఆర్‌బీఐ ఆలోచ‌న ఏంటి.?
Image Credit : Getty

ఆర్‌బీఐ ఆలోచ‌న ఏంటి.?

ప్రస్తుతం వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే ఉన్నా, భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందనే హామీ లేదు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా “యూపీఐ నిర్వహణకు అయ్యే ఖర్చును ఎవరో భరించాలి” అని వ్యాఖ్యానించారు. గతంలో నిర్దిష్ట మొత్తానికి మించిన లావాదేవీలపై ఎండీఆర్ విధించాలనే ప్రతిపాదన వచ్చినా, ప్రజల నుంచి వ‌చ్చిన‌ తీవ్ర వ్యతిరేకత కారణంగా దాన్ని వెనక్కి తీసుకున్నారు.

55
ప్రభుత్వ జోక్యం అవసరమా?
Image Credit : Asianet News

ప్రభుత్వ జోక్యం అవసరమా?

ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు ఇదే విధానం అనుసరిస్తే, పేమెంట్ అగ్రిగేటర్లు ఆ భారం వ్యాపారులకు, అక్కడి నుంచి వినియోగదారులకు బదిలీ చేసే అవకాశముంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మాత్రమే వినియోగదారులపై అదనపు భారాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, యూపీఐ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image3
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Related Stories
Recommended image1
Rain Alert: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లండి.. గురువారం ఈ ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు
Recommended image2
8th pay commission: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. రూ. 18 వేలున్న కనీస జీతం ఎంత కానుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved